సహకార బ్యాంకుల్లో రూ.184కోట్ల రుణాలు మాఫీ
గజ్వేల్: జిల్లాలోని సహకార బ్యాంకు ల ద్వారా రైతులకు రూ.184 కోట్ల రుణమాఫీ వర్తిస్తుందని, ఇందులో ఇప్పటివరకు పావువంతు రూ.44 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు డీసీసీబీ చైర్మన్ జైపాల్‌రెడ్డి తెలి పారు. శనివారం గజ్వేల్‌లోని సహకార బ్యాంకులో ఇద్దరు రైతులకు రుణమాఫీ చెక్కులు అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సహకార బ్యాంకుల్లో 56951 మంది రైతులు రుణాలు పొం దారని వారందరికీ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు.
ఈనెల 15లోగా రైతులు తమ రుణాలను రెన్యువల్ చేసుకొని ‘జీరో’ వడ్డీని పొందాలని సూచిం చారు. గజ్వేల్ నియోజకవర్గంలో 5149మంది రైతు లు రుణాల పొందారని చెప్పారు. వీరికి రూ.13.7కోట్ల రుణమాఫీ వర్తిస్తుందన్నారు. జాతీయ బ్యాంకులకు దీటు గా తమ బ్యాంకు సేవలందిస్తుందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జనరల్ మేనేజర్ శివకోటేశ్వర్‌రావు, గజ్వేల్ మండల సహకార సంఘం చైర్మన్ వెంకట్‌నర్సింహారెడ్డి, స్థానిక బ్రాంచ్ మేనేజర్ కొండల్‌రెడ్డి పాల్గొన్నారు.
కొండపాక: కొండపాక పీఏసీఎస్‌లో రుణాలు తీసుకున్న 826 మంది రైతులకు 2కోట్ల 56లక్షల రూపాయల రుణమాఫీ వచ్చిందని దేవేందర్‌రెడ్డి చెప్పారు. దీంట్లో 25 శాతం కింద రూ.61 లక్షలు పీఏసీఎస్‌కు చేరాయన్నారు. రైతులు ఈ నెల 15 వరకు తమ రుణాలను రెన్యూవల్ చేయించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో రెండో విడత విడుదలయ్యే మాఫీ డబ్బులకు ఇబ్బందులెదురవుతాయన్నారు. రెన్యువల్ చేసుకుంటే జీరో శాతం వడ్డీ లేదంటే రైతులకు 13 శాతం వడ్డీ పడుతుందన్నారు.