సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో అంతా ఒప్పంద రాజకీయమే నడుస్తోంది. ఎన్నికల ముందు ఒప్పందంలో భాగంగానే చైర్మన్ విజయేందర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చైర్మన్‌గా పీఠం దక్కించుకునేందుకు ముత్తవరపు పాండురంగారావు పావులు కదిపారు. ఇప్పుడా పదవి కోసం కొందరు డెరైక్టర్లతోనూ ‘ఒప్పందాలు’ జరిగాయి. బుధవారం జరగనున్న చైర్మన్ ఎన్నికలో పోటీ పడకుండా, పూర్తిస్థాయిలో సహకరించేందుకు చేతులకు మట్టి అంటకుండా లక్షలకు లక్షల రూపాయలు దోచిపెట్టే వ్యూహం పన్నారు. భువనగిరి, సూర్యాపేటలో డీసీసీబీ బ్రాంచ్‌ల బిల్డింగుల నిర్మాణం, కోదాడలో బ్యాంకుకు ప్రహరీ, టాయిలెట్ల నిర్మాణం, వాహన గ్యారేజీ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు.
ఇదీ ... నేపథ్యం
డీసీసీబీ చైర్మన్‌గా పనిచేసిన యడవెల్లి విజయేందర్‌రెడ్డి గత నెల 15వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. ఖాళీ అయిన చైర్మన్ పదవికి ఎన్నిక కోసం ముందే నిర్ణయం అయిన మేరకు సెప్టెంబరు 29వ తేదీన నోటిఫికేషన్ జారీ అయ్యింది. అయితే, ఈ ఎన్నికను సాఫీగా ముగించేందుకు, పాలకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నేతలు పెద్ద వ్యూహమే రచించారు. విజయేందర్‌రెడ్డి రాజీనామా చేయగానే వైస్‌చైర్మన్‌గా ఉన్న ముత్తవరకు పాండురంగారావు ఇన్‌చార్జ్ చైర్మన్ అయ్యారు. ఈలోగా ఏం జరిగిందో ఏమో కానీ డీసీసీబీ సీఈఓ కోటి 38ల క్షల 75వేల రూపాయల విలువైన పనులకు సెప్టెంబర్ 23వ తేదీ టెండరు ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ఓ దినపత్రికలో (సాక్షి కాదు) 26వ తేదీన అచ్చయ్యింది. మంగళవారంతో టెండరు షెడ్యూళ్ల కొనుగోలు గడువు ముగిసింది. ఈ ప్రకటన మేరకు భువనగిరిలో భవన నిర్మాణానికి రూ.60లక్షలు, సూర్యాపేట భవనానికి రూ.60.75లక్షలు, కోదాడలో ప్రహరీ, టాయిలెట్స్, గ్యారేజీ నిర్మాణానికి రూ.10లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. ఇంతా చేస్తే, భువనగిరి పనికి 3, సూర్యాపేటకు 3, కోదాడ పనికి 5 చొప్పున మాత్రమే టెండరు దరఖాస్తులు అమ్ముడయ్యాయి. ఇదంతా ఓ పద్ధతి, ప్రణాళిక ప్రకారం నడిచిన వ్యవహారమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్లాన్ అదిరింది!
Published Wed, Oct 8 2014 2:01 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement