
అడ్డంగా దొరికిపోయిన అన్నవరం దేవస్థానం ఈఓ!
రాజమండ్రి: అన్నవరం దేవస్థానం ఈఓ ఈవీ జగన్నాథరావు సాక్షి కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. నిబంధనలకు విరుద్దంగా దేవస్థానం సిబ్బందిని ఈఓ తన సొంత అవసరాలకు వినియోగించుకున్నారు. తన ఇంటి ప్రహరీ గోడ, కారు షెడ్ నిర్మాణానికి దేవస్థానం ఉద్యోగుల చేత పనులు చేయించారు.
దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం ఈఓ సుధాకర్, వర్క్ ఇనస్పెక్టర్ రాజబాబులు కూడా నిర్మాణానికి సహకరించారు. ఈ దృశ్యాలు సాక్షి కెమెరాకు చిక్కాయి.