
తిరుమలలో మరో చిన్నారి కిడ్నాప్
కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు సేకరించారు. ఆదివారం మధ్యాహ్నం 3.33కు నందిని ని ఓ మహిళ వెంట తీసుకెళ్తున్నట్లు అక్కడి ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. 3.50 గంటలకు తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్, సాయంత్రం 5 గంట లకు తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కూడా సీసీ కెమెరాల్లో నందిని, గుర్తుతెలి యని మహిళ నడిచివెళుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనను టీటీడీ సీవీఎస్‌వో ఏ.రవికృష్ణ, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్‌పి అభిషేక్ మహంతి తీవ్రంగా పరిగణించారు. చిన్నారి గాలింపునకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. కిడ్నాప్‌కు పాల్పడిన మహిళ ఫొటోలతో విస్తృత ప్రచారం కల్పించారు.