తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 5 కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు77,651 మంది స్వామివారిని దర్శించుకోగా 26,677 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.07 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కె ట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం మల్లన్న దర్శనానికి భారీగా క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆది, సోమవారాలలో ఆర్జిత అభిషేకాలు,కుంకుమార్చన నిలుపుదల చేశారు. శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుం. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి.
Comments
Please login to add a commentAdd a comment