child kidnapped
-
Guntur: జీజీహెచ్‌లో పసికందు కిడ్నాప్
గుంటూరు (ఈస్ట్): గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)లో మూడు రోజుల మగ శిశువు అపహరణకు గురయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు సుమారు 7 గంటల్లోపే కేసును ఛేదించి శిశువును తల్లి ఒడికి చేర్చారు. శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఉప్పతల మహేష్ భార్య ప్రియాంకను ప్రసవ సమయం దగ్గర పడటంతో కుటుంబ సభ్యులు ఈ నెల 11వ తేదీన జీజీహెచ్‌లో చేర్పించారు. ప్రియాంక ఈ నెల 13న మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ నెల 15వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మహేష్ తల్లి ఏసుకుమారి వార్డులో కోడలి పొత్తిళ్లలో ఉన్న శిశువు ఏడుస్తుండటంతో ఎత్తుకుని వార్డు బయటకు తీసుకొచ్చింది. కొద్దిసేపటి తరువాత ఆ పసికందును ప్రియాంక తల్లి పార్వతమ్మ వద్ద ఉంచి బాత్రూమ్కు వెళ్లింది. కొద్దిసేపటికే పార్వతమ్మ నిద్రలోకి జారుకోగా.. బాత్రూమ్ నుంచి తిరిగొచ్చిన ఏసుకుమారికి పసికందు కనిపించలేదు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కొత్తపేట ఎస్‌హెచ్‌వో శ్రీనివాసులురెడ్డి పోలీసు బృందాల్ని రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులు రైల్వేస్టేషన్ వైపు ఉన్న మెయిన్ గేటు నుంచి బయటకు చేరుకుని ఆటో ఎక్కి వెళ్లిపోయినట్టు గుర్తించారు. ఆటో ఎటు వెళ్లిందో కూపీ లాగిన పోలీసులు చివరకు ఆటో డ్రైవర్‌ను గుర్తించి అతడి సహాయంతో నిందితుల ఇంటికి వెళ్లారు. నిందితులు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదలకు చెందిన హేమవర్ణుడు, రెడ్డి పద్మజలను అరెస్ట్ చేసి పసికందును తల్లి ఒడికి చేర్చారు. మగ శిశువును అపహరించి విక్రయిస్తే భారీగా సొమ్ము సంపాదించవచ్చని భావించిన హేమవర్ణుడు పథకం ప్రకారం పద్మజతో కలిసి ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. -
పరిచయం చేసుకుని.. పని ఇప్పిస్తానని..
సాక్షి, చిత్తూరు: రేణిగుంట రైల్వేస్టేషన్లో గత రాత్రి కలకలం చోటుచేసుకుంది. ఆరు నెలల బాబును దుండగులు కిడ్నాప్ చేశారు. నాలుగు రోజుల క్రితం తాడి పత్రి నుంచి రేణిగుంటకు బాబుతో వచ్చిన స్వర్ణ లత అనే మహిళ తన కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. తాడిపత్రికి చెందిన స్వర్ణలత భర్తతో విభేదాల కారణంగా పుట్టింట్లో ఉంటోంది. ఆమె తాగుబోతు భర్త అక్కడకు కూడా వచ్చి గలాట చెయ్యడంతో పుట్టింటి నుంచి బయటకు వచ్చింది. ఈక్రమంలో రేణిగుంట రైల్వే స్టేషన్లో పనిచేసే స్వీపర్ ద్వారా ఆమెకు అనిత అనే మహిళ పరిచయమైంది. తాను రైల్వేలో ఉద్యోగం చేస్తున్నానని.. స్వర్ణలతకు పని ఇప్పిస్తానని నమ్మబలికింది. దాంతో స్వర్ణలత నాలుగు రోజుల పాటు రైలల్వే స్టేషన్లోనే గడిపింది. ఈ నేపథ్యంలో తల్లీ బిడ్డలకు కొత్త బట్టలు కొనిస్తానని తీసుకెళ్లిన అనిత.. అక్కడ ఆమెను బురిడీ కొట్టించి బాబుతో ఉడాయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఇద్దరు అనుమానిత మహిళలను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
తిరుపతిలో కిడ్నాప్ కలకలం
సాక్షి, తిరుపతి: చిన్నారి కిడ్నాప్ ఘటన నగరంలో కలకలం సృష్టించింది. మూడేళ్ల చిన్నారిని శుక్రవారం రాత్రి కిడ్నాపర్లు ఎత్తుకెళ్ళారు. తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కిడ్నాపర్‌ను గుర్తించి.. ఫొటోను సోషల్ మీడియాలో పెట్టారు. చిన్నారిని కిడ్నాపర్ చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వదిలివెళ్లాడు. స్థానికుల సహకారంతో పోలీసులు ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. -
ధర్మవరంలో చిన్నారి కిడ్నాప్
-
తిరుమలలో మరో చిన్నారి కిడ్నాప్
సాక్షి,తిరుమల: తిరుమలలో మరో చిన్నారిని కిడ్నాప్ చేశారు. శ్రీకాళహస్తికి చెందిన ఏడేళ్ల నందినిని గుర్తుతెలియని మహిళ ఆదివారం కిడ్నాప్ చేసింది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపం లోని అమ్మపాళెంకు చెందిన సురేష్ తిరుమ లలో ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. భార్య దాక్షాయిణి, ఇద్దరు కుమార్తెలు నందిని (7), మహాలక్ష్మి(4)తో కలసి తిరుమలలోనే నివా సం ఉంటున్నాడు. ఈ నెల 23న స్థానిక యాత్రిసదన్–4 వద్దకు పెద్దకుమార్తె నందిని తాగునీటికోసం వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు గాలించినా ఆచూకీ లభించక పోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు సేకరించారు. ఆదివారం మధ్యాహ్నం 3.33కు నందిని ని ఓ మహిళ వెంట తీసుకెళ్తున్నట్లు అక్కడి ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. 3.50 గంటలకు తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్, సాయంత్రం 5 గంట లకు తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కూడా సీసీ కెమెరాల్లో నందిని, గుర్తుతెలి యని మహిళ నడిచివెళుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనను టీటీడీ సీవీఎస్వో ఏ.రవికృష్ణ, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పి అభిషేక్ మహంతి తీవ్రంగా పరిగణించారు. చిన్నారి గాలింపునకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. కిడ్నాప్‌కు పాల్పడిన మహిళ ఫొటోలతో విస్తృత ప్రచారం కల్పించారు. -
తల్లిఒడికి పసికందు
సికింద్రాబాద్: రైల్వేస్టేషన్ ఆవరణలో మూడు రోజుల క్రితం జరిగిన పసికందు కిడ్నాప్ కేసును గోపాలపురం పోలీసులు ఛేదించారు. చిన్నారిని తల్లి ఒడికి చేర్చారు. కిడ్నాపర్ పరారీలో ఉండగా పసికందును కోనుగోలు చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఏసీపీ శివప్రసాద్, గోపాలపురం ఇన్స్పెక్టర్ ఎస్.రామచంద్రారెడ్డితో కలిసి ఉత్తర మండలం అదనపు డీసీపీ పీవై గిరి తెలిపిన వివరాల ప్రకారం.... ఖమ్మం జిల్లాకు చెందిన టి.రమాదేవి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌ను వేదికగా చేసుకుని జీవిస్తోంది. చెత్తకాగితాలు సేకరిస్తూ జీవించే రమాదేవి 27 రోజుల క్రితం మగబిడ్డ (నాగాచారి)కు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా... టోలీచౌకికి చెందిన ఫాస్ట్ఫుడ్సెంటర్ నిర్వాహకుడు మహ్మద్ ఆరీఫ్ (25) సోదరికి పెళ్లై పదేళ్లు కావస్తున్నా సంతానం కలుగలేదు. సోదరి భర్త కోరిక మేరకు ఒక మగబిడ్డను వారికి బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు ఆరీఫ్. అదే ప్రయత్నంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న అతను ఆ ప్రాంతంలో చిల్లర పనులు చేసుకుంటూ జీవించే సురేష్‌ను సంప్రదించాడు. తనకు కొంత డబ్బు వస్తుందని ఆశించిన సురేశ్.. రమాదేవి దగ్గరకు వెళ్లి ఆమె కుమారుడిని విక్రయిస్తే రూ.5 వేలు ఇప్పిస్తానని చెప్పాడు. అందుకు రమాదేవి అంగీకరించలేదు. కాగా, సురేష్ ఈనెల 17న రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కారు పార్కింగ్ ప్రాంతంలో నిద్రకు ఉపక్రమిస్తున్న రమాదేవి వద్దకు వెళ్లి మాటల్లోకి దింపాడు. ఆమె బాత్రూమ్కు వెళ్లిన సమయంలో సురేశ్ .. పసికందు నాగాచారిని అపహరించుకెళ్లాడు. రమాదేరి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన గోపాలపురం పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా సురేష్ బాలుడిని అపహరించి ఆల్ఫా హోటల్ వద్ద ఆరీఫ్‌కు అప్పగించినట్టు గుర్తించారు. ఆరీఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా... సురేష్‌కు రూ. 15 వేలు ఇచ్చి బాలుడిని కొనుగోలు చేసి తన సోదరికి ఇచ్చానని చెప్పాడు. పోలీసులు పసికందు నాగాచారిని స్వాధీనం చేసుకొని రమాదేవికి అప్పగించారు. ఆరీఫ్‌ను రిమాండ్‌కు తరలించి, పరారీలో ఉన్న సురేష్ కోసం గాలిస్తున్నారు.