జేఎన్టీయూహెచ్ వీసీ డాక్టర్ రామేశ్వర్‌రావ
హైదరాబాద్: మూల్యాంకనం పట్ల విద్యార్థులకు ఉన్న అపోహలను తొలగించేందుకు జవాబు పత్రాల కాపీలను ఇవ్వాలని నిర్ణయించినట్టు జేఎన్టీయూహెచ్ వీసీ డాక్టర్ రామేశ్వర్‌రావు తెలిపారు. శనివారం తన చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్షలు బాగా రాసినా కూడా తనకు తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు డిప్రెషన్‌కు లోనుకాకుండా ఈ ప్రక్రియ దోహదపడుతుందని చెప్పారు. అలాగే, మూల్యాంకనంలో జరిగే పొరపాట్లను కూడా దీనివల్ల నివారించవచ్చని అన్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ సదుపాయం విద్యార్థులకు అందుబాట్లో ఉంటుందన్నారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబరు, ఫొటో ఐడీ కార్డు, ఫింగర్‌ప్రింట్స్ సమర్పించి కళాశాల నుంచే జవాబు పత్రాల కాపీలను పొందవచ్చని తెలిపారు. ఏవైనా తప్పులు దొర్లినట్లయితే వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
విద్యార్థుల చేతికి జవాబు పత్రాల కాపీ
Published Sun, Jun 1 2014 8:32 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM
Advertisement