మల్లన్న సేవలో శాసన సభ కమిటీ సభ్యులు | AP Assembly committee members visited at srisailam temple | Sakshi
Sakshi News home page

మల్లన్న సేవలో శాసన సభ కమిటీ సభ్యులు

Feb 1 2016 6:54 PM | Updated on Aug 18 2018 5:18 PM

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వార్లను సోమవారం ఏపీ శాసన సభ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు.

కర్నూలు: శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వార్లను సోమవారం ఏపీ శాసన సభ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. స్వామివార్లకు రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర  ప్రత్యేక పూజలను నిర్వహించారు.

ఆశీర్వచన మండపంలో వేదపండితులు వారికి ఆశీర్వచనాలు పలికారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర స్త్రీ, శిశు, వికలాంగ, వృద్ధుల సంక్షేమ వ్యవహారాల శాసన సభ కమిటీ చైర్‌పర్సన్ గీత, సభ్యులు సత్యప్రభ, లక్ష్మీదేవి, బొడ్డు నాగేశ్వరరావు ఉన్నారు. అనంతరం చైర్‌పర్సన్ గీత విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలిస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement