
సాక్షి, గుంటూరు : చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో లాయర్లకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన హామీలను కాపీ కొడుతున్నారని విమర్శించారు. ఈ నాలుగున్నరేళ్లలో లాయర్లకు ఇచ్చిన 18 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ అధికారంలోకి రాగానే రూ. 100 కోట్లతో లాయర్ల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు, హౌసింగ్ సొసైటీ, హెల్త్ కార్డులు కూడా మంజూరు చేస్తామని ప్రకటించారన్నారు. ఈ హామీలతో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ హామీలను కాపీ కొడుతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment