విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సబ్ కమిటీ మంగళవారం సమావేశమైంది. విజయవాడ స్టేట్ గెస్ట్హౌస్లో సమావేశమైన కమిటీ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, మహిళా, రైతు సాధికారిత, టెక్స్టైల్ అంశాలపై చర్చించనున్నారు. కేబినేట్ సబ్ కమిటీ సభ్యులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, పీతల సుజాత, కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథరెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు.