జూన్ 6న ఏపీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం జూన్ 6న నూతన రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయనుంది. ఈ లోపలే సాధ్యమైనన్ని ప్రభుత్వ శాఖలను విజయవాడ, గుంటూరులకు తరలించాలని ఈ రోజు జరిగిన ఏపీ మంత్రి మండలి సమావేశంలో నిర్ణయించారు. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.
ఇదిలా ఉండగా, ఏపీ నూతన రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలలోని భూసమీకరణకు ఇష్టంలేదని కోర్టుకు వెళ్లిన వారి భూములను సేకరణ ద్వారా సమీకరిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.