సాక్షి, విశాఖ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శనివారం విశాఖ విమానాశ్రయంలో పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, మోపిదేవి వెంకటరమణ, ధర్మాన కృష్ణదాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు చెట్టి ఫాల్గుణ, అదీప్ రాజ్, కన్నబాబు, గొల్ల బాబూరావు, గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు, మాజీ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ, నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్, పార్టీ నగర అధ్యక్షులు శ్రీనివాస్ వంశీకృష్ణ, పార్టీ సీనియర్లు మళ్ల విజయ్ ప్రసాద్, కేకే రాజు, కుంభా రవిబాబు, అల్ఫా కృష్ణ, అక్కరమాని విజయనిర్మల తదితరులు ఉన్నారు.
కాగా విమానాశ్రయంలోనే పార్టీ నాయకులు, అధికారులు, ఇతర ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. అనంతరం రోడ్డు మార్గాన తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంలోని స్వర్ణ జయంతి ఆడిటోరియానికి చేరుకుని... అక్కడ జరిగే ఈస్ట్రన్ నేవల్ కమాండ్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్‌తో జగన్ భేటీ కానున్నారు. అనంతరం కల్వరి వద్ద ఉన్న అరిహంత్ డైనింగ్ హాల్‌లో విందులో పాల్గొంటారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి తాడేపల్లి బయల్దేరి వెళతారు. కాగా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ నగరానికి రావడం ఇది రెండోసారి.
Comments
Please login to add a commentAdd a comment