ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు(పాత చిత్రం)
కాకినాడ(తూర్పుగోదావరి జిల్లా): రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయని ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానం ద్వారా ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,95,723 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో 86,910 మంది దరఖాస్తు చేసినట్లు చెప్పారు.
ఏపీలో 42 రీజినల్ సెంటర్లు, తెలంగాణ(హైదరాబాద్)లో 3 రీజినల్ సెంటర్ల పరిధిలో 115 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు అందరూ గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, హాల్‌టిక్కెట్ వెనక ఎగ్జామ్ సెంటర్ లోకేషన్ తెలిపే గూగుల్ మ్యాప్ ఉంటుందని తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోని అనుమతించమని ఎంసెట్ కన్వీనర్ స్పష్టంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment