Saibabu
-
సారిక మిస్టరీ
సాయిబాబు హీరోగా, ఆశి రాయ్, సురయ పరివిన్ హీరోయిన్లుగా రామ్ పల్లె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టరీ ఆఫ్ సారిక’. బాలాజి సమర్పణలో అనీషా క్రియేషన్స్ బ్యానర్లో సుగుణ సుబ్రమణ్యం నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘‘సస్పెన్స్ తో కూడిన చిత్రమిది’’ అన్నారు రామ్ పల్లె. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. రామ్ పల్లెగారు మా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. త్వరలో ట్రైలర్, సాంగ్స్ విడుదల చేయనున్నాం. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న మా సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’’ అని సుగుణ సుబ్రమణ్యం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ మిత్ర, కెమెరా: సులమ్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్: నెహ్రు బాబు. -
నీకై అభిసారికనై...
సాయిబాబు, ఆశీరాం, సురయపర్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘నీకై అభిసారికనై’. సీనియర్ ఎడిటర్ వెంకట్రామ్ పల్లా ఈ చిత్రంతో దర్శకునిగా మారారు. అనీషా క్రియేష¯Œ ్స పతాకంపై ఓ.సుగుణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వెంకట్రామ్ పల్లా మాట్లాడుతూ– ‘‘సినీ పరిశ్రమలో దాదాపు 2 దశాబ్దాల పైన ఎడిటర్‌గా అనుభవం ఉన్న నన్ను నమ్మి దర్శకత్వం అవకాశం ఇచ్చిన సుగుణగారికి కృతజ్ఞతలు. యూత్‌ని ఆకర్షించేలా లవ్, హారర్ ప్రధానంగా ఈ చిత్రం ఉంటుంది. టైటిల్లో మంచి ఫీల్ గుడ్ కనిపిస్తోందని సన్నిహితులు అభినందించారు. ప్రస్తుతం ఫైట్ మాస్టర్ రాబిన్ సుబ్బు నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు. ‘‘మొదటి షెడ్యూల్‌ని విజయవంతంగా పూర్తి చేశాం. ఈ నెల 10 నుంచి రెండో షెడ్యూల్ మొదలైంది. ఈ నెలాఖరుకి షూటింగ్ పూర్తి అవుతుంది’’ అని సుగుణ అన్నారు. రఘుబాబు, మచ్చా నాగభూషణ్, ‘జబర్దస్త్’ రాజమౌళి నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బాలాజీ, కెమెరా: ప్రసాద్, సంగీతం: రాజ్ కిరణ్. -
రేపటి నుంచి ఏపీ ఎంసెట్ పరీక్షలు
కాకినాడ(తూర్పుగోదావరి జిల్లా): రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయని ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు ఆన్లైన్ విధానం ద్వారా ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,95,723 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో 86,910 మంది దరఖాస్తు చేసినట్లు చెప్పారు. ఏపీలో 42 రీజినల్ సెంటర్లు, తెలంగాణ(హైదరాబాద్)లో 3 రీజినల్ సెంటర్ల పరిధిలో 115 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు అందరూ గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, హాల్‌టిక్కెట్ వెనక ఎగ్జామ్ సెంటర్ లోకేషన్ తెలిపే గూగుల్ మ్యాప్ ఉంటుందని తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోని అనుమతించమని ఎంసెట్ కన్వీనర్ స్పష్టంగా చెప్పారు. -
మే 5న ఏపీ ఎంసెట్ ఫలితాలు
- కన్వీనర్ సాయిబాబు వెల్లడి - మెయిళ్ల ద్వారా అభ్యర్థులకు జవాబుపత్రాలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్–2017 ఫలితాలు మే 5న విడుదల చేయనున్నామని కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఎంసెట్ ప్రాథమిక ‘కీ’ని వెబ్సైట్లో పొందుపరిచామని కన్వీనర్ సాయిబాబు తెలిపారు. ఈ కీపై అభ్యంతరాలు ఉంటే మే 1వ తేదీ సాయంత్రం అయిదు గంటల వరకు స్వీకరిస్తామని చెప్పారు. ఈ అభ్యం తరాలను వెబ్సైట్లో నిర్దేశించిన ఫార్మా ట్లోనే పంపిం చాలని సూచిం చారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షకు సంబంధించి విద్యార్థుల జవాబు పత్రాన్ని వారి ఈమెయిల్ అడ్రస్‌కు పంపిస్తున్నామని, వెబ్సైట్లోనూ పొందుపరుస్తు న్నామని చెప్పారు. ఎంసెట్ ఫలితాలను మే 5న విడుదల చేయాలని నిర్ణయించి నందున ఇంటర్మీడియెట్ కాకుండా సీబీఎస్ఈ, ఏపీఓఎస్ఎస్, ఎన్ఐఓఎస్, డిప్లొమో, ఆర్జేయూకేటీ, ఐఎన్‌సీ, ఇంట ర్మీడియెట్ ఒకేషనల్ ఇతర బోర్డుల ధ్రువ పత్రాలతో పరీక్షలకు హాజరైన విద్యార్ధులు ప్రత్యేక డిక్లరేషన్ ఫారాలను, మార్కుల జాబితాలను తమకు ముందుగా పంపాలన్నారు. -
ఏపీ ఎంసెట్ కీ అభ్యంతరాలపై 6న నిపుణుల కమిటీ భేటీ
9న విశాఖలో ఫలితాలు విడుదల కన్వీనర్ సాయిబాబు వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్సు టెస్టు(ఎంసెట్)కు సంబంధించి ప్రాథమిక కీపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై ఈ నెల 6న నిపుణుల కమిటీని సమావేశపర్చాలని ఎంసెట్ కమిటీ నిర్ణయించింది. ప్రాథమిక కీపై ఇప్పటివరకు 12 అభ్యంతరాలు రాగా అందులో ఎక్కువ మెడికల్ విభాగానికి సంబంధించినవే. రానున్న రెండురోజుల్లో మరిన్ని అభ్యంతరాలు వచ్చే అవకాశాలున్నాయి. వీటన్నిటినీ నిపుణుల కమిటీ ముందుం చనున్నామని, వారిచ్చే సూచనలను అనుసరించి తుది నిర్ణయం తీసుకుంటామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. ఈనెల 9న ఫైనల్ కీ, ర్యాంకులు ప్రకటిస్తామన్నారు. ఈ ఫలితాలను విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారని వివరించారు. మెడికల్‌లో 23వ ప్రశ్నను డిలీట్ చేయాలి ఇలా ఉండగా ఎంసెట్ మెడికల్ ప్రశ్నపత్రంలోని 23వ ప్రశ్నలో ఒక పదం ఇంగ్లిష్ వెర్షన్లో ఒకరకంగా, తెలుగు వెర్షన్లో మరో రకంగానూ ఇచ్చారని, దీనివల్ల విద్యార్థులు సరైన సమాధానాన్ని గుర్తించడంలో సందిగ్ధతకు లోనయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు ఎంసెట్ కన్వీనర్‌కు నివేదించారు. ఆ ప్రశ్నలో ఒక పదం 'nucleolides' అని ఇంగ్లిష్‌లో ఉండగా అదే ప్రశ్నను తెలుగు అనువాదంలో 'nucleotides' అని ఇచ్చారు. దీనివల్ల విద్యార్థులు ఇబ్బందికి గురయ్యారని, కొంతమందికి నష్టం కలుగుతోందని వివరించారు. ఈ ప్రశ్నను తొలగించి ర్యాంకులు ప్రకటించాలని కన్వీనర్‌ను కోరారు. -
ఏపీ ఎంసెట్‌కు నగరంలోనూ కేంద్రాలు
వెల్లడించిన సెట్ కన్వీనర్ సాయిబాబు సాక్షి, హైదరాబాద్ /బాలాజీచెరువు(కాకినాడ): ఏపీ ఎంసెట్‌కు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. హైదరాబాద్‌లోని మెహిదీపట్నం, టోలిచౌకి, గోల్కొండ, లంగర్‌హౌజ్, ఇబ్రహీంబాగ్, గండిపేట, రాయదుర్గం, షేక్‌పేట, గచ్చిబౌలి ప్రాంతాలు జోన్-ఏ పరిధిలో, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి, చందానగర్, బీహెచ్ఈఎల్, పటాన్చెరు, కండ్లకోయ, జీడిమెట్ల, గండిమైసమ్మ, దూలపల్లి, గుండ్లపోచంపల్లి, దుండిగల్ ప్రాంతాలను జోన్-బీ పరిధిలో ఉన్నాయని వివరించారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంసెట్ నిర్వహణకు సకల చర్యలు ఎంసెట్ నిర్వహణలో లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కన్వీనర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన నిఘా పెడుతున్నట్లు వివరించారు. ఇంటర్మీడియెట్ హాల్ టికెట్ నంబర్‌ను తప్పుగా నమోదు చేసిన విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియెట్ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంసెట్ ఈమెయిల్ (apeamcet2k16@ gmail.com)కు ఈనెల 20వ తేదీలోగా పంపించాలని సూచించారు. ఈ విషయాన్ని అభ్యర్థులందరికీ సంక్షిప్త సమాచారం అందించామన్నారు. హాల్ టికెట్ నంబర్‌ను సరిచేయించుకోకపోతే వారు ఎంసెట్ హాల్ టిక్కెట్‌ను డౌన్లోడ్ చేసుకోలేరని వివరించారు. ఏప్రిల్ 3 నుంచి 9 వరకు సవరణలకు అవకాశం ఆన్లైన్ దరఖాస్తుల్లో సమాచారం పొందుపర్చడంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికి ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు కన్వీనర్ చెప్పారు. ఎంసెట్ హాల్ టికెట్లను ఏప్రిల్ 21 నుంచి 27వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 0884-2340535, 0884-2356255 నంబర్లలో సంప్రదించవచ్చని సాయిబాబు సూచించారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వంపై కార్మికవర్గం అసంతృప్తి
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు సిరిసిల్ల : తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై కార్మికవర్గం అసంతృప్తితో ఉందని సీఐటీ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో సీఐటీ యూ జిల్లా మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై కార్మికలోకం ఎన్నో ఆశలు పెట్టుకుందని, మేనిఫెస్టో లో కూడా చాలా హామీలిచ్చారని పేర్కొన్నా రు. ఐదు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం కరెంటు కోతలు, కనీస వేతన చట్టం అమలు వంటి అంశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో గంటలు గంటలు చర్చలు జరిపిన సీఎం కేసీఆర్ కార్మిక సంఘాలతో ఇప్పటివరకు ఒక్క గంటైనా మాట్లాడలేదన్నారు. ఎన్నో ఆశలతో టీఆర్ఎస్ను గెలిపించిన కార్మికలోకం ఇప్పుడు నిరాశకు గురవుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరలను పెంచగా, ప్ర స్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యజమానులకు అనుకూలమైన నిర్ణయాలు చేస్తోందన్నారు. కోరలు లేని కా ర్మిక చట్టాలను పటిష్టపరచాల్సి ఉండగా త్రై పాక్షిక కమిటీని ఏర్పాటు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. తె లంగాణలో కార్మికుడికి కనీస వేతనం రూ.15000 ఉండేలా చట్టం చేయాలన్నారు. సింగరేణిలో అటెండర్‌కు సైతం రూ.35 వేలు జీతం ఉందని, శ్రమను నమ్ముకున్న కార్మికుల కు మెరుగైన జీతం ఇవ్వాలన్నారు. సిరిసిల్ల నేత కార్మికులు ఆత్మగౌరవంతో బతికేవిధంగా పవర్‌లూం షెడ్లు నిర్మించి సాంచాలను బ్యాంకు రుణాలతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సిరిసిల్ల పట్టణంలో ఎర్రజెండాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ముత్యంరావు, మూషం రమేశ్, పంతం రవి, శ్రీరాం సదానందం, గంగారం, గణేశ్, అజయ్ పాల్గొన్నారు.