సాక్షి, అమరావతి : కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వర్క్ ఎట్ హోం అవకాశాన్ని కల్పించాలని అమరావతి ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు కోరారు. రెవెన్యూ ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉగాది నాడు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఏప్రిల్ 14వ తేదికి మార్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చాలని రెవెన్యూ ఉగ్యోగులు రాత్రింబవళ్లు పనిచేశారన్నారు. రెవెన్యూ కార్యాలయాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా మార్చితే కరోనా వైరస్ ప్రబలే అవకాశం ఉన్నందున సీఎం జగన్ ఉద్యోగుల పట్ల పెద్ద మనసు చూపి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.
రాష్ట్రమంతటా ఫైళ్లు ఆన్‌లైన్‌లో గత అయిదు సంవత్సరాల నుంచి నడుస్తున్నందున కరోనా వైరస్ దృష్టా పది రోజుల పాటు ఉద్యోగులకు వర్క్ ఎట్ హోం అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు అయినా ఈ అవకాశాన్ని కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు, అధికారులు అందరూ గత నెల నుంచి కరోనా వ్యాధికి భయపడకుండా ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. వారికి ఏపీ జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment