హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులందరినీ విజయవాడకు తరలించే అంశంపై ఏపీ ప్రభుత్వం బుధవారం సర్య్కులర్ జారీ చేసింది.
హైదరాబాద్: హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులందరినీ విజయవాడకు తరలించే అంశంపై ఏపీ ప్రభుత్వం బుధవారం సర్య్కులర్ జారీ చేసింది. జూన్ 27 లోపల కార్యలయాలన్నీ విజయవాడకు తరలివెళ్లాలని ఆదేశాలు ఇచ్చింది. అందుకోసం విజయవాడ, గుంటూరులో అద్దె భవనాలు ఎంపిక చేసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించి 32 శాఖలు, 89 డైరెక్టరేట్ల అధికారులకు ఆదేశాలు పంపింది.