కర్నూలు (జిల్లా పరిషత్): అభివృద్ధి పనులకు అవసరమైన సిమెంట్‌ను ఇకపై ప్రభుత్వమే బస్తా రూ.200కు అందజేస్తుందని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ రామాంజనేయులు చెప్పారు. కర్నూలు జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన మేజర్ పంచాయతీ సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు, ఈవోఆర్‌డీల సమావేశంలో ఆయన మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం నిధులన్నీ ఇకపై పంచాయతీలకు వెళ్తాయని చెప్పారు. ఇసుకను డీఆర్‌డీఏ ఆధ్వర్యంలోని మహిళా సంఘాల ద్వారా, గ్రావెల్, కంకరను స్థానిక సప్లయర్స్ ద్వారా కొనుగోలు చేయాలని సూచించారు.