హత్యాయత్నం కేసు : ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు | AP High Court Rejected House Motion Petition Over Murder Attempt on YS Jagan | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 19 2019 3:50 PM | Last Updated on Sat, Jan 19 2019 4:23 PM

AP High Court Rejected House Motion Petition Over Murder Attempt on YS Jagan - Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. శనివారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఈ పిటిషన్‌కు లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఎన్‌ఐఏ విచారణను అడ్డుకోవాలని భావించిన చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నానికి బ్రేక్‌ పడింది. 

దొడ్డి దారిన ఆర్డర్‌ తెచ్చే ప్రయత్నం : జగన్‌ తరఫు న్యాయవాది
ఏపీ ప్రభుత్వం హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసి దొడ్డి దారిన ఆర్డర్‌ తెచ్చే ప్రయత్నం చేసిందని జగన్‌ తరఫు న్యాయవాది సుజాత శర్మ అన్నారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసిందని ఆమె మీడియాకు వివరించారు. హత్యయత్నం జరిగిన చోటు కేంద్రం పరిధిలో ఉందని చంద్రబాబు మాట్లాడారని, ఇప్పుడేమో కుట్ర ఎక్కడ భయటపడుతుందోనని, ఎన్‌ఐఏ విచారణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో నిజాన్ని బయటకు రాకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ కేసు విషయంలో సోమవారం తమ వాదనలు బలంగా వినిపిస్తామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement