సాక్షి, అమరావతి: పేద రోగులకు భరోసా కల్పించాల్సిన ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుతం అవసాన దశకు చేరుకుంది. ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు బకాయిలు విడుదల చేయకపోవడం, వైద్యానికి అనేక ఆంక్షలు విధించడంతో రోగులకు వైద్యమందడం లేదు. ప్రభుత్వం తమకు బాకీ పడిన మొత్తాన్ని చెల్లించేవరకు ఆరోగ్యశ్రీ సేవలు అందించబోమని ఆస్పత్రి యాజమాన్యాల అసోసియేషన్ (ఆశా) స్పష్టం చేసింది. 450 ఆస్పత్రులకు 500 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆశా అధ్యక్షుడు మురళీ కృష్ణ విమర్శించారు. రేపటి నుంచి (సోమవారం) ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఆస్పత్రులకు సంబంధించిన 80 వేల క్లెయిమ్‌లను ఆరోగ్యశ్రీ ట్రస్టు పెండింగ్‌లో పెట్టిందనీ, ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment