Aarogyasri Trust
-
AP: ఆరోగ్యశ్రీ ఆగలేదు.. అయినా అసత్య ప్రచారమే!
సాక్షి, విజయవాడ: ఏపీ వ్యాప్తంగా డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినా కూడా నిలిచిపోయాయంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ఇస్తోంది. రెండు రోజుల క్రితం నెట్ వర్క్ ఆసుపత్రులకి 200 కోట్ల బకాయిలు విడుదల చేసింది. మిగిలిన బకాయిల విడుదలపై ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి, వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సిఈవో లక్ష్మీ షాతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే.. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.3566 కోట్లు చెల్లించింది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో నెట్ వర్క్ ఆసుపత్రులకు తొలి రెండు నెలలలో రూ.366 కోట్ల చెల్లింపులు చేసింది. ఇక ఏడాది కాలంగా రోజుకి సరాసరిన 5349 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు జరిగాయి. మొన్న(మే 22, బుధవారం) 6718 మందికి.. నిన్నన(మే 23, గురువారం) 7118 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందాయి. ఈ విషయాన్ని ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీ షా తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించవద్దన్న పిలుపుకి నెట్ వర్క్ ఆసుపత్రులు సహకరిస్తున్నాయని ఆయన వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలలోనూ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని.. ఆరోగ్యశ్రీ సేవలకు ఎక్కడా అంతరాయం లేదని లక్ష్మీషా స్పష్టం చేశారు. -
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, కడపలో 12 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన కడప జిల్లాలోని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్యమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 12 ► అర్హత: మంచి అకడమిక్ రికార్డ్‌తో బీఎస్సీ(నర్సింగ్), ఎమ్మెస్సీ(నర్సింగ్), బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మా డీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ► వేతనం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: విద్యార్హతలు, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, డోర్ నెం.57–98–1, అక్కయ్యపల్లి, శాస్త్రి నగర్, కడప చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 17.06.2021 ► వెబ్సైట్: kadapa.ap.gov.in మరిన్ని నోటిఫికేషన్లు: ఐబీపీఎస్ నోటిఫికేషన్, 10 వేలకు పైగా ఉద్యోగాలు NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో 89 పోస్టులు -
కొత్తగా మరో 19 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు
సాక్షి, అమరావతి: ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతోపాటు వేగంగా ఫలితాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 19 చోట్ల ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 13 జిల్లాల్లో 14 వైరాలజీ ల్యాబ్‌లు ఉన్నాయి. వీటికి రోజుకు 90 వేలకు పైగా టెస్టులు చేసే సామర్థ్యం ఉంది. మొత్తం 14 ల్యాబ్‌ల్లో 89 ఆర్టీపీసీఆర్ మెషిన్లు పనిచేస్తున్నాయి. కాగా, కరోనా థర్డ్ వేవ్ వచ్చినా, భవిష్యత్‌లో మరిన్ని ఎక్కువ టెస్టులు చేయాల్సి వచ్చినా 14 ల్యాబ్‌లకు తోడు కొత్తగా ఏర్పాటు చేస్తున్న 19 ల్యాబ్‌లు ఉపయోగపడనున్నాయి. ఇప్పటివరకు జిల్లా కేంద్రాలకే పరిమితమై ఉన్న ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లను ఇప్పుడు నియోజకవర్గాల స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఎక్కడ వీటిని పెడితే బాగుంటుందో కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించి.. ఆ మేరకు 19 చోట్ల అందుబాటులో ఉంచనుంది. ఒక్కో ల్యాబ్‌కు రూ.80 లక్షల వ్యయం కొత్త ల్యాబ్‌ల రాకతో పరీక్ష ఫలితాల్లో జాప్యం తగ్గుతుంది. పైగా రోగుల నమూనాలను జిల్లా కేంద్రాలకు పంపే ఇబ్బందులు తప్పుతాయి. ఒక్కో ల్యాబ్‌లో రోజుకు 800 టెస్టులు చొప్పున మొత్తం 19 కొత్త ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ల్లో 15 వేలకు పైగా పరీక్షలు చేయొచ్చు. ఒక్కో ల్యాబ్‌కు ప్రభుత్వం రూ.80 లక్షల వరకూ వ్యయం చేస్తోంది. రెండు నెలల్లో ఈ ల్యాబ్‌ల ఏర్పాటు పూర్తవుతుంది. కాగా, ప్రస్తుతమున్న 14 ల్యాబ్‌లను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందన్న సంగతి తెలిసిందే. వేగంగా ఫలితాలు.. ఇప్పటివరకు జిల్లా కేంద్రాల్లోనే ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిపైన లోడు ఎక్కువవడంతో ఫలితాల్లో జాప్యం జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చే ల్యాబ్‌లతో ఈ జాప్యాన్ని నివారించవచ్చు. అవసరమనుకుంటే ఈ ల్యాబ్‌ల్లో మెషిన్లు పెంచి మరిన్ని టెస్టులు చేసే వెసులుబాటూ ఉంది. ప్రస్తుతం మనకున్న 14 ల్యాబొరేటరీల్లో 89 ఆర్టీపీసీఆర్ మెషిన్లు పనిచేస్తున్నాయి. –మల్లికార్జున, సీఈవో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ -
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, ప్రకాశంలో ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్.. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 09 ► అర్హత: మంచి అకడమిక్ రికార్డ్‌తో బీఎస్సీ(నర్సింగ్), ఎమ్మెస్సీ(నర్సింగ్), బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మాడి, బీఎస్సీ మెడికల్‌ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ► వయసు: 42ఏళ్లు మించకుండా ఉండాలి. ► వేతనం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: విద్యార్హతలు,కంప్యూటర్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, డా.వైఎస్సార్ ఏహెచ్‌సీటీ, ఆపోజిట్: ప్రకాశం భవన్, ఓల్డ్ రిమ్స్, ఓంగోలు చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021 ► వెబ్సైట్: https://prakasam.ap.gov.in -
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్‌లో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన కృష్టా జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్.. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 27 ► పోస్టుల వివరాలు: ఆరోగ్య మిత్ర 22; టీం లీడర్: 05. ► ఆరోగ్య మిత్ర: అర్హత: మంచి అకడెమిక్ రికార్డుతో బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్; ఇంగ్లిష్, తెలుగు చదవడం,రాయడంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 42ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► టీం లీడర్: అర్హత: మంచి అకడెమిక్ రికార్డుతో బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్; ఇంగ్లిష్, తెలుగు చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. పీజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 42ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► చిరునామా: డిస్ట్రిక్ కోఆర్డినేటర్, డాక్టర్ వైఎస్ఆర్ ఏహెచ్‌సీటీ, స్టేట్ గెస్ట్‌హౌస్ కాంపౌండ్, గోపాలరెడ్డి రోడ్, గవర్నర్‌పేట, విజయవాడ. ► దరఖాస్తులకు చివరి తేది: 09.06.2021 ► వెబ్సైట్: https://krishna.ap.gov.in డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, గుంటూరులో ఖాళీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన గుం టూరు జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్.. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 31 ► పోస్టుల వివరాలు: ఆరోగ్య మిత్ర 27; టీం లీడర్: 04. ► ఆరోగ్య మిత్ర: అర్హత: మంచి అకడెమిక్ రికార్డుతో బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్; ఇంగ్లిష్, తెలుగు చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 42ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► టీం లీడర్: అర్హత: మంచి అకడెమిక్ రికార్డుతో బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్; ఇంగ్లిష్, తెలుగు చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. పీజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 42 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► చిరునామా: ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేట్ కార్యాలయం, డీహెచ్ఎంఓ కార్యాలయం పక్కన, కలెక్టర్ బంగ్లారోడ్, గుంటూరు–522004. ► దరఖాస్తులకు చివరి తేది: 09.06.2021 ► వెబ్సైట్: https://guntur.ap.gov.in -
ప్రైవేట్ ఆస్పత్రికి రూ.10 లక్షలు ఫైన్
విజయనగరం ఫోర్ట్: కోవిడ్ రోగుల నుంచి కాసుల దోపిడీకి పాల్పడే ప్రైవేటు ఆస్పత్రులకు విజయనగరం జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్ కళ్లెం వేశారు. ఇక ముందు ఏ ఆస్పత్రి నిర్వాహకుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకుండా అధిక మొత్తంలో అపరాధ రుసుం విధించారు. విజయనగరం పట్టణంలోని కర్రల మార్కెట్ రోడ్డులో ఉన్న పీజీ స్టార్ ఆస్పత్రి యాజమాన్యం కోవిడ్ వైద్యానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తోందంటూ జేసీతో పాటు ఆరోగ్యశ్రీ అధికారులకు ఇటీవల పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. వీటిపై జేసీ, జిల్లా ఆరోగ్యశ్రీ అదనపు సీఈవో మహేష్‌కుమార్‌లు విచారణ చేపట్టారు. విచారణలో అధికంగా ఫీజులు వసూలు చేసినట్టు నిర్ధారణ కావడంతో పీజీ స్టార్ ఆస్పత్రికి రూ.10 లక్షల అపరాధ రుసుం విధిస్తూ జేసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
రాష్ట్రం వెలుపలా ఆరోగ్యశ్రీ ఆదుకుంది
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో మొదటిసారి చేసిన గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైందని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ మల్లికార్జున తెలిపారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం తాటిగుంటపల్లి గ్రామానికి చెందిన ఎ.ఆనంద్ (26)కు బెంగళూరులో గత నెల 28న గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించగా అది విజయవంతమై అతను కోలుకున్నట్టు తెలిపారు. ► నాలుగేళ్లుగా గుండె వ్యాధితో బాధపడుతున్న ఆనంద్కి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయాలని తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి నిర్ధారించింది. ► దీంతో బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించారు. ► ఇందుకు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ బెంగళూరు సమన్వయకర్త డాక్టర్ ఉష నిరంతరం పర్యవేక్షించారు. ► గుండె మార్పిడి శస్త్ర చికిత్స ప్యాకేజీ రూ.11 లక్షల మొత్తాన్ని వైదేహి ఆస్పత్రికి అందిస్తాం. ఆనంద్‌కు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఈ శస్త్రచికిత్స అందించాం. ► ఆపరేషన్ జరిగిన ఐదో రోజున ఆనంద్ కోలుకొని తనకు ప్రాణదానం చేసిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ► సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇతర రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కార్పొరేట్ ఆస్పత్రుల్లోని సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్య చికిత్స అందించడాన్ని 2019 నవంబర్ ఒకటి నుంచి ప్రారంభించాం. అందులో భాగంగానే తొలిసారి ఆనంద్‌కు బెంగళూరులో చికిత్స చేయించగా, అది విజయవంతమైంది. -
గ్యాస్ లీకేజీ బాధితులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అండ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకి అయ్యే మొత్తం ఆసుపత్రి ఖర్చులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చెల్లించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.దీనికి సంబంధించి గురువారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. దీని ద్వారా విశాఖతో పాటు గ్యాస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న గుర్తింపు పొందిన ఏ ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా బాధితులు ఎటువంటి ఫీజు చెల్లించకుండా వైద్యసేవలు పొందవచ్చు. (గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన సీఎం జగన్) ఆరోగ్య శ్రీ తో అనుసంధానం అయిన హాస్పిటల్స్‌తో పాటు, అనుసంధానం కానీ హాస్పటల్స్‌కి కూడా ఇది వర్తిస్తోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ఇప్పటికే అన్ని ఆసుపత్రులకు అందజేసింది. గ్యాస్ బాధితులకి చికిత్స అందించిన హాస్పటల్స్ వారికి సంబంధించిన ఆధార్ కార్డు, ఇతర వివరాలు తీసుకొని చికిత్స అనంతరం వైద్య సేవల బిల్లులతో సహా ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కు పంపాల్సి ఉంటుంది. వారి వైద్యం కోసం ప్రభుత్వం ఎంతైనా చెల్లించనుంది. దీనికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. ప్రమాదవశాత్తు లీకైన గ్యాస్ వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా సత్వర వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి గ్యాస్ లీకేజీ బాధితులకి నష్టపరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. (మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం: సీఎం జగన్) -
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేసే ఆసుపత్రులకు రూ.234 కోట్లు విడుదల చేసినట్లు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ మల్లికార్జునరావు తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కార్డులతో వైద్యం చేసిన ఆసుపత్రులకు నిధులు విడుదల చేశామన్నారు. ఈ క్రమంలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం కింద వైద్యం చేసిన ఆసుపత్రులకు రూ.127 కోట్లు విడుదల చేశామన్నారు. తద్వారా ఉద్యోగులు, ప్రజల వైద్యానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. (ఉషస్సులు నింపుతున్న ఆరోగ్యశ్రీ) చదవండి: కోటిన్నర కుటుంబాలకు ఆరోగ్య భరోసా -
ఆ చిట్టితల్లికి వైద్యం అందించండి
అల్లిపురం (విశాఖ దక్షిణం) : ‘చిట్టి తల్లికి ఎంత కష్టమో’.. శీర్షికతో సాక్షి మెయిన్ ఎడిషన్‌లో ఆదివారం వెలువడిన వార్తకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించారు. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోను ఆదేశించారు. విశాఖ నగరం అల్లిపురంలోని గౌరీవీధిలో ఉంటున్న హేమలత (11) బోన్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. తల్లిదండ్రులు అప్పలరాజు, అమ్మాజీ కూలీలు కావటంతో ఆమెకు అంతంతమాత్రం వైద్యం చేయించగలుగుతున్నారు. కాగా, ‘సాక్షి’ కథనంతో పలువురు దాతలు కూడా స్పందిస్తున్నారు. తమ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని ఫోన్‌చేసి చెబుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చర్యలు మరోవైపు.. సీఎం ఆదేశాలతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడారు. దీంతో బాలికను తీసుకుని తక్షణమే ఆస్పత్రికి రావాలని ఆస్పత్రి యాజమాన్యం సమాచారమిచ్చింది. బాలికకు అవసరమైన వైద్యం, మందులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందజేస్తామని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు సీఎం జగన్‌కు, ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. -
డిశ్చార్జి తర్వాత రోజుకు రూ.225
సాక్షి, అమరావతి : ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం ఇంటి వద్ద కోలుకునే సమయంలో వేతన నష్టాన్ని భర్తీచేసేందుకు అందించే ఆర్థిక సాయానికి రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీచేసింది. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కె జవహర్‌రెడ్డి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ 26 స్పెషాలిటీ వైద్య సేవలకు సంబంధించి 836 రకాల చికిత్సలకు ఈ ఆర్థిక సాయం వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, ఆస్పత్రి నుంచి రోగి డిశ్చార్జి అయ్యాక ఏ జబ్బుకు ఎన్ని రోజుల్లో కోలుకుంటారనేది మార్గదర్శకాల్లో పొందుపరిచారు. ఈ ఆదేశాలు 2019 డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయి. 836 రకాల చికిత్సలకు వర్తింపు బ్యాంకు ఖాతా లేకపోతే.. కుటుంబ సభ్యుల ఖాతాలోకి - డిశ్చార్జి అనంతరం ఆర్థిక సాయం కింద రోజుకు రూ.225లు ప్రభుత్వం ఇస్తుంది. ఇలా గరిష్టంగా నెలకు రూ.5,000లు రికవరీ కాలానికి ఇస్తారు. 40 రోజులు ఆస్పత్రిలో ఉంటే 30 రోజులకు రూ.5వేలు, మిగతా పది రోజులకు రోజుకు రూ.225లు చొప్పున ఇస్తారు. మొత్తం 40 రోజులకు రూ.7,250లు ఇస్తారు. - ఈ మొత్తం రోగి బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఒకవేళ రోగికి వ్యక్తిగత బ్యాంకు ఖాతా లేకపోతే రోగి కుటుంబ సభ్యుల్లో ఒకరి ఖాతాకు ఇవ్వవచ్చు. - నెట్వర్క్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 48 గంటలలోపు రోగి బ్యాంకు ఖాతాకు ఈ మొత్తం జమ అవుతుంది. బ్యాంకు లావాదేవీలు వైఫల్యం చెందితే అవి విఫలమైన సమయం నుంచి 72 గంటలలోపు చెక్కు జారీచేస్తారు. ఆ చెక్కును సంబంధిత గ్రామ, వార్డు వలంటీర్ల సహాయంతో పంపిణీ చేస్తారు. - ఏదైనా ఫిర్యాదు ఉంటే రోగులు, వారి బంధువులు శస్త్ర చికిత్స చేసిన నెట్వర్క్ ఆస్పత్రులకు చెందిన ఆరోగ్య మిత్రను లేదా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కార్యాలయ సమన్వయకర్తను సంప్రదించవచ్చు. లేదా సంబంధిత గ్రామ సచివాలయాలను సంప్రదించవచ్చు. - ఒకే సంవత్సరంలో అదే సమస్య పునరావృతమైతే మొదటిసారి మాత్రమే భత్యం మంజూరు చేస్తారు. - అలాగే, కేన్సర్ రోగులకు పలుమార్లు చికిత్స లేదా రేడియేషన్ అవసరమైనప్పటికీ వారికీ ఒకసారి మాత్రమే అందజేస్తారు. -
నేటి నుంచి ఆరోగ్యశ్రీ బంద్
సాక్షి, అమరావతి: పేదల ఆరోగ్యానికి వరప్రదాయని ఆరోగ్యశ్రీ సేవలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోనున్నాయి. గత కొన్ని నెలలుగా తమకు బకాయిలు చెల్లించని కారణంగా సోమవారం నుంచి వైద్య సేవలను నిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం ప్రకటించింది. ఆరోగ్యశ్రీతో పాటు 5 లక్షల మంది ఉద్యోగులకు, 3 లక్షల మంది పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు మొత్తం 35 లక్షల మందికి వర్తించే ఉద్యోగుల వైద్యం కూడా ఆపేస్తున్నట్టు యాజమాన్యాలు ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీ నర్సింగ్ అసోసియేషన్ (అప్నా), సూపర్ స్పెషాలిటీ అసోసియేషన్ (ఆశా)ల నిర్ణయంతో నేటి నుంచి మెరుగైన వైద్యం కోసం వెళ్లే పేద రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 630కి పైగా ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్నాయి. కోటి ముప్పయి లక్షల కుటుంబాలకు వర్తించే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ వస్తున్న ప్రభుత్వం.. గత కొంతకాలంగా పేద రోగుల వైద్యానికయ్యే ఖర్చులు ఆస్పత్రులకు చెల్లించడం లేదు. ఈ బకాయిలు కొండలా పెరిగి రూ. 500 కోట్లకు చేరుకున్నాయి. ఈ బకాయిలు చెల్లించమని గత కొన్ని నెలలుగా ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. గత ఐదు నెలలుగా 90 వేల క్లెయిములను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కనీసం పరిశీలించలేదని, విధిలేని పరిస్థితుల్లోనే తాము వైద్య సేవలను ఆపేయాల్సి వచ్చిందని ఆ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. కేన్సర్ పేషెంట్లకు కీమో థెరపీ, కిడ్నీ బాధితులకు డయాలసిస్ వంటి అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలూ నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఉద్యోగుల నుంచి డబ్బు వసూలు చేసినా.. రాష్ట్రంలో 5 లక్షల మంది ఉద్యోగులు, 3 లక్షల మంది పెన్షనర్లు వైద్యం కోసం నెలకు కొందరు రూ. 90, మరికొందరు రూ.120 చెల్లిస్తున్నారు. ఈ సొమ్ము ఏడాదికి రూ. 200 కోట్లు అవుతుంది. మరో రూ. 200 కోట్లు ప్రభుత్వం ఇచ్చి మొత్తం రూ. 400 కోట్లతో ఉద్యోగులు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు వైద్యం అందించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి వసూలు చేసిన డబ్బు కూడా ఆస్పత్రులకు ఇవ్వలేదు. ఏప్రిల్ నుంచి ఉద్యోగుల వైద్యానికి సంబంధించి పైసా ఇవ్వలేదని, దీంతో ఆస్పత్రులు మూత పడే పరిస్థితి చేరుకున్నాయని యాజమాన్యాలు పేర్కొన్నాయి. డబ్బులివ్వకపోవడంతో చిన్న చిన్న నర్సింగ్‌హోంలు మూతపడే దశకు వచ్చాయని సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. జాప్యం చేసేందుకు తెరమీదకు క్లినికల్ ఆడిట్ ఆరోగ్యశ్రీ నిధులు జాప్యం చేసేందుకే దేశంలోనే ఎక్కడాలేని క్లినికల్ ఆడిట్‌ను తెరమీదకు తెచ్చారని ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. 2017లో ఏప్రిల్‌లో ఈ పద్ధతి తేగా ఒక్క బిల్లును కూడా ఆడిట్ చెయ్యలేదన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టులో క్లెయిములు పరిష్కారానికి తగినంత మంది సిబ్బంది లేక పోవడం వల్లే జాప్యం జరుగుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే నియామకాలు చేస్తున్నట్టు వెల్లడించారు. బకాయిలు నిజమే.. ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నది నిజమే. మేము బకాయిలు లేవని చెప్పడం లేదు. రెండు మూడు రోజుల్లో కొన్ని నిధులు ఇస్తామని చెప్పాం. వాళ్లు కూడా దానికి అంగీకరించారు. ఒక్కొక్క సమస్యనూ పరిష్కరించుకుంటూ వెళతామని చెప్పాం. వీలైనంత త్వరలో అన్ని సమస్యలూ పరిష్కరిస్తాం. – డా.ఎన్.సుబ్బారావు, ఇన్చార్జి సీఈఓ, ఆరోగ్యశ్రీ నిధుల కోసం బతిమలాడినా ఇవ్వలేదు రోగికి వైద్యం చేసిన తర్వాత డబ్బుల కోసం సర్కారు చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదు. ట్రస్ట్ నుంచి సీఎఫ్ఎంఎస్కు నిధులు వెళ్లడం వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. ఎన్నిసార్లు బతిమాలినా నిధులు రాకపోవడం వల్ల విధిలేని పరిస్థితుల్లో డిసెంబర్ 17వ నుంచి ఆరోగ్యశ్రీ , ఉద్యోగులకు వైద్యం ఆపేస్తున్నట్టు చెప్పాం. ఆదివారం సాయంత్రం మంత్రి ఫోన్ చేసి వారం రోజుల్లో రూ. 200 కోట్లు ఇస్తామని, సమ్మె విరమించమని కోరారు. కానీ నిధులిచ్చే వరకూ సమ్మె వాయిదా వేస్తాంగానీ, విరమణ చెయ్యలేమని చెప్పాం. – ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం డబ్బుకట్టే ఉద్యోగులకే దిక్కులేదు నెలనెలా వైద్యానికి డబ్బుకట్టే ఉద్యోగులు, పెన్షనర్లకే దిక్కులేదు. ఇక ఉచితంగా చేయాల్సిన పేద రోగులకు నిధులిస్తారా. నేను ప్రభుత్వ డాక్టరుగా రిటైరయ్యాను. మా భార్యకు జబ్బుచేసి వైద్యం చేయించుకుంటే ఆరు నెలలైనా బిల్లులు ఇవ్వలేదు. పైగా డిసెంబర్ 31 తర్వాత రీయింబర్స్మెంట్ ఆపేయాలని చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల వైద్యం బిల్లులు రాకపోతే ఆపెయ్యక ఎవరైనా ఏం చేస్తారు? – డా.పి.శ్రీనివాస్, ఏపీ నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధి -
రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్..!!
సాక్షి, అమరావతి: పేద రోగులకు భరోసా కల్పించాల్సిన ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుతం అవసాన దశకు చేరుకుంది. ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు బకాయిలు విడుదల చేయకపోవడం, వైద్యానికి అనేక ఆంక్షలు విధించడంతో రోగులకు వైద్యమందడం లేదు. ప్రభుత్వం తమకు బాకీ పడిన మొత్తాన్ని చెల్లించేవరకు ఆరోగ్యశ్రీ సేవలు అందించబోమని ఆస్పత్రి యాజమాన్యాల అసోసియేషన్ (ఆశా) స్పష్టం చేసింది. 450 ఆస్పత్రులకు 500 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆశా అధ్యక్షుడు మురళీ కృష్ణ విమర్శించారు. రేపటి నుంచి (సోమవారం) ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఆస్పత్రులకు సంబంధించిన 80 వేల క్లెయిమ్‌లను ఆరోగ్యశ్రీ ట్రస్టు పెండింగ్‌లో పెట్టిందనీ, ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి : అవసాన దశలో..ఆరోగ్యశ్రీ) -
ఆరోగ్యశ్రీ ట్రస్టుకు.. అవినీతి జబ్బు!
సాక్షి, హైదరాబాద్: అది వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి.. సీఎం కేసీఆర్ స్వయంగా దాన్ని ప్రారంభించారు.. అన్ని వసతులున్న ఆ ఆస్పత్రి ఆరోగ్యశ్రీ పథకం వర్తించేందుకు దరఖాస్తు చేసింది.. ఆరు నెలలైనా ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు కనీసం తనిఖీలకు రాలేదు. చివరికి ఆస్పత్రి యాజమాన్యం విజ్ఞప్తి మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం, వైద్య మంత్రి కార్యాలయంలో ఆరా తీసింది. దాంతో తనిఖీలు చేసి.. ఏడాది తర్వాత దరఖాస్తును పరిష్కరించారు. ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్–ఎల్బీనగర్ ప్రాంతంలో మరో ప్రైవేటు ఆస్పత్రి.. అగ్నిమాపక శాఖ అనుమతి సైతం లేదు. ఆస్పత్రి ప్రారంభిం చగానే ఆరోగ్యశ్రీ కోసం దరఖాస్తు చేశారు. రెండు రోజుల్లోనే అధికారుల తనిఖీ పూర్తయింది. నెలలోపే అనుమతి కూడా మంజూరైంది. దీనికి కారణం ‘మామూలే’.. పైరవీలు, డబ్బులు. పేదలకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకం.. అధికారుల వైఖరితో అక్రమాలకు అడ్డాగా మారిపోయింది. వైద్యారోగ్య శాఖలోని కొందరు ముఖ్యలు.. తమకు ఇష్టమైన వారికి ఆరోగ్యశ్రీ ట్రస్టు బాధ్యతలు అప్పగించడం, వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఆరోగ్యశ్రీ లక్ష్యం నీరుగారిపోతోంది. సొంత ప్రయోజనాలు, ప్రైవేటు ఆస్పత్రులకు లబ్ధి చేకూర్చడమే ప్రధాన ఉద్దేశంగా ఆరోగ్యశ్రీ ట్రస్టులోని అధికారుల నిర్ణయాలు ఉంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేదలకు అత్యుత్తమ వైద్యం కోసం.. పేదలకు కూడా అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. లక్షలాది మంది పేదలు ఈ పథకం కింద ఉచితంగా వైద్యం పొందారు. ప్రస్తుతం తెలంగాణలో 85 లక్షల పేద కుటుంబాల్లోని 2.75 కోట్ల మందికి ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఏటా రూ.700 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు కలిపి సుమారు 949 రకాల వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 341 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలవుతోంది. వీటిలో 96 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. ఆస్పత్రుల ఎంపికలో కక్కుర్తి.. వైద్యసేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ఎప్పటికప్పుడు ఆస్పత్రులను ఎంపిక చేస్తుంది. వందల కోట్ల పథకం కావడంతో చాలా ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలు అందించేందుకు పోటీపడుతున్నాయి. కొత్త ఆస్పత్రి నిర్మాణం పూర్తి కాగానే పథకం కింద సేవలు అందించేందుకు దరఖాస్తు చేసుకుంటున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆయా ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేసి.. తగిన సౌకర్యాలు, ప్రమాణాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకుని.. వాటిని పథకం కింద ఎంపిక (ఎంపానెల్మెంట్) చేస్తుంది. ఇదే అధికారులకు అవకాశంగా మారుతోంది. ఆరోగ్యశ్రీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఆస్పత్రులను మాత్రమే ఎంపిక చేయాల్సిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస వసతులు లేకున్నా.. ఉమ్మడి ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభమైనప్పుడు (2008లో) తెలంగాణలో 46 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందేవి. ప్రమాణాల ప్రాతిపదికన ఈ జాబితా పెంచాలని అప్పట్లోనే నిబంధనలు చేర్చారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల సంఖ్య ప్రస్తుతం 341కి చేరింది. అయితే గత రెండేళ్లుగా మాత్రం ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పైరవీలకు తెరతీశారు. అనుమతుల ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే అని చెబుతున్నా.. ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయానికి వచ్చి ‘మామూళ్లు’సమర్పించుకున్న ఆస్పత్రులనే ఎంపిక చేశారు. తగిన సౌకర్యాలు, ప్రమాణాలు లేకున్నా పలు ప్రైవేటు ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ ట్రస్టు సేవల జాబితాలో చేర్చారు. ప్రత్యేకమైన వైద్య నిపుణులు, పరీక్ష కేంద్రాలు, పడకల సంఖ్య పరిమితి, వీల్చైర్లకు మార్గాలు, అగ్నిమాపక అనుమతులు వంటివి కూడా లేకున్నా ఎంపిక చేశారు. ఇందులో భారీగా అవినీతి కూడా చోటు చేసుకుంది. చర్యలు చేపట్టిన సర్కారు.. ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారుల తీరుపై భారీగా ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వ ఆలస్యంగా స్పందించింది. విచారణ చేపట్టి.. ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారిగా వ్యవహరించిన సీనియర్ వైద్యుడి వైఖరితోనే ఇదంతా జరిగిందని గుర్తించింది. ఆయనను పదవి నుంచి తప్పించి, అక్రమాల నియంత్రణపై దృష్టిపెట్టింది. ఆరోగ్యశ్రీ పథకం మొదలైనప్పటి తరహాలోనే ఐఏఎస్ అధికారికి సీఈవోగా బాధ్యతలు అప్పగించింది. అయితే ఇప్పటికే ఎంపిక చేసిన ఆస్పత్రుల విషయంగా ఏ చర్యలు తీసుకుంటారు, ఇకనైనా అక్రమాలు ఆగుతాయా, ఆరోగ్యశ్రీ ట్రస్టులోని మిగతా అధికారుల తీరు మారుతుందా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల సంఖ్య ఏడాది ఆస్పత్రులు 2008 46 2014 216 2015 242 2016 271 2017 316 2018 341 -
ఆరోగ్యశ్రీలో ‘రిఫరల్’ దందా!
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కూలీ పని చేసే నారాయణ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆరోగ్యశ్రీ కార్డు ఉందన్న ధీమాతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిర్వాహకులు ఆస్పత్రిలో చేర్చుకున్నా సాధారణ చికిత్స చేసి.. వైద్యం మాత్రం మొదలుపెట్టలేదు. ఒక రోజు గడిచాక ఇదేమిటని నిలదీస్తే.. స్పెషలిస్ట్ డాక్టర్ రావాలని, మెల్లగా నయం చేస్తామని, కావాలంటే మరో ఆస్పత్రికి వెళ్లిపోవచ్చని సలహా ఇచ్చారు. ఓ కార్పొరేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. గోదావరిఖనికి చెందిన రాజేందర్ చిరు వ్యాపారి. కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడు. ఇటీవల అనారో గ్యానికి గురికావడంతో కరీంనగర్లో ఆరోగ్యశ్రీ సదుపాయమున్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. వారం రోజులైనా నిపుణులు రావడం లేదు. వైద్యం మొదలుకాలేదు. ఇదేమిటని నిలదీస్తే తగిన సదుపాయాలు లేవంటూ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ చికిత్సల పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు రోగు ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పేరుకు పెద్దసంఖ్యలో ఆస్పత్రులు ఆరోగ్య శ్రీలో ఉన్నా.. చాలా వాటిలో సరైన వైద్య సౌకర్యాలుగానీ, వైద్య నిపుణులుగానీ ఉం డడం లేదు. వాటిల్లో చేరిన రోగులకు తగిన వైద్యం అందడం లేదు. సదుపాయాలు, నిపుణులు లేకున్నా.. ఈ ఆస్పత్రులు ఆరో గ్యశ్రీలో రిజిస్టర్ చేసుకుంటున్నాయి. రోగు లను చేర్చుకుని, కొంత కాలయాపన చేసి.. చివరికి కేస్ షీట్లతో సహా కార్పొరేట్ ఆస్ప త్రులకు రిఫర్ చేస్తున్నాయి. తద్వారా కార్పొ రేట్ ఆస్పత్రుల నుంచి కమీషన్లు పొందు తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల తీరు వల్ల కొన్నిసార్లు రోగుల పరిస్థితి విషమిస్తోంది. కచ్చితమైన ఆదాయం మరి! రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ కింద ఏటా సగటున రూ.650 కోట్లు ఖర్చు చేస్తోంది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యాధులు సహా మొత్తం 949 రకాల చికిత్సలను ఉచితంగా అంది స్తున్నారు. రాష్ట్రంలో 85 లక్షల పేద కుటుంబాల్లోని 2.75 కోట్ల మంది ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నారు. వారికి వైద్యం అందించిన ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుపుతోంది. అయితే చాలా ఆస్పత్రులకు వచ్చే రోగుల కంటే ఆరోగ్యశ్రీ కింద చేరే వారి సంఖ్యే ఎక్కువ. పూర్తిస్థాయి వైద్యం అందించేవి తక్కువే తమ వద్ద ఆ రోగి చికిత్సకు అవసరమైన సదు పాయాలు లేవంటూ తమతో ఒప్పంద మున్న కార్పొరేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నాయి. అత్యవసర కేసులు వచ్చినా చేర్చుకుని.. కొంత సేపటి తర్వాత కార్పొరేట్ ఆస్పత్రులకు పంపు తున్నాయి. చికిత్స అనంతరం ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి వచ్చే సొమ్ము లోంచి పది, 15 శాతం కమీషన్‌గా తీసుకుని... మిగతా సొమ్మును చికిత్స చేసిన ఆస్పత్రికి అందజేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద ఎంత ఎక్కువ మంది రోగులను రిఫర్ చేస్తే కమీషన్ అంత ఎక్కువగా ఉంటుంది. అన్నీ ఒప్పందాల కిందే.. తఇటీవల అన్ని కార్పొరేట్ ఆస్పత్రులు సాదా సీదా సౌకర్యాలతో ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ విభాగాలు నెలకొల్పి చికిత్స అందిస్తు న్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి నేరుగా రోగులు రావడం కష్టమని భావించి.. అదే పనిగా ఆరోగ్యశ్రీ కోసం ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు ఆస్పత్రులతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. రోగులను ఆకర్షించి కార్పొరేట్లకు తరలిస్తున్నాయి. పేదలను ఆదుకునే బృహత్తర లక్ష్యం.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న లక్ష్యంతో 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. మొదట ఉమ్మడి ఏపీ పరిధిలోని మహబూబ్‌నగర్, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి... 2008 ఏప్రిల్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించారు. మొదట్లో 163 రకాల చికిత్సలు అందించేవారు. తర్వాత పెంచు కుంటూ వెళ్లారు. ప్రస్తుతం 949 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు. తూతూమంత్రంగా తనిఖీలు ఆరోగ్యశ్రీ సేవల జాబితాలో ఆస్పత్రులను చేర్చేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రత్యేకంగా నిబంధనలను రూపొందించింది. కానీ అవన్నీ కాగి తాలకే పరిమితమవుతున్నాయి. ఆస్పత్రులకు ప్రధానంగా అవసరమైన ప్రత్యేక వైద్యులు, పరీక్ష కేంద్రాలు, కనీస పారిశుధ్యం వంటివి లేకున్నా అధికారులు ఆరోగ్యశ్రీలో చోటు కల్పిస్తున్నారు. పరిమితికి మంచి పడకల సంఖ్య ఉన్నా, వీల్‌చైర్ తీసుకెళ్లే దారి లేకున్నా, అగ్నిప్రమాద నివారణ వ్యవస్థ ఏర్పాటు చేయకున్నా అనుమతులు ఇస్తుండడం గమ నార్హం. అంతేకాదు రోగుల నుంచి ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లోనూ తూతూమంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టే అక్రమాల పుట్ట! ఆరోగ్యశ్రీ పథకంలో అక్రమాలు, అర్హతలేని ప్రైవేటు ఆస్పత్రులను ఆరోగ్యశ్రీలో చేర్చడంలో అధికారుల పాత్ర కీలకంగా ఉంది. కొందరు అధికారులు సొంత లాభమే చూసుకుని.. కనీస వసతులు, ప్రమాణాలు కూడా దిక్కులేని ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీలో చేరేందుకు సహకరిస్తున్నారు. మొత్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల జాబితా పెరుగుతున్నా.. వాసి మాత్రం ఉండడం లేదు. దీంతో అలాంటి ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్న పేదలు తగిన వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. దీనిపై ఇటీవల ఫిర్యాదులు కూడా పెరిగాయి. పేద రోగులకు వైద్యం అందడంలో కీలకమైన ఆరోగ్యశ్రీ ట్రస్టు వ్యవహారం ఇలా ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అసలు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు రెగ్యులర్ పర్యవేక్షణాధికారి లేకపోవడం గమనార్హం. నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్‌గా పనిచేసే అధికారికే ట్రస్టు బాధ్యతలను అదనంగా అప్పగించారు. దీంతో ఆరోగ్యశ్రీ ట్రస్టు నిర్వహణ అధ్వానంగా తయారైంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు.. ఏడాది కేసులు ఖర్చు (రూ.) 2014–15 1,96,866 519,40,87,639 2015–16 2,60,543 684,67,77,428 2016–17 2,77,199 714,57,77,428 2017–18 1,83,108 459,67,79,239 (2017 అక్టోబర్ 31 వరకు) -
133 ఆరోగ్యశ్రీ చికిత్సలు.. మళ్లీ ప్రైవేటు వైద్య కాలేజీలకు!
సాక్షి, హైదరాబాద్: పేదల ఆరోగ్య రక్షణ, ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి కోసం గతంలో ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయాన్ని మార్చేలా ఆరోగ్యశ్రీ ట్రస్టు బోర్డు ప్రతిపాదనలు చేసింది. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ ఆస్పత్రులలో మాత్రమే వైద్యం అందించే 133 రకాల చికిత్సలను రాష్ట్రంలోని మొత్తం 15 ప్రైవేటు వైద్య కాలేజీలకూ వర్తింపజేయాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు మళ్లీ పాత పరిస్థితి వస్తుందని వైద్యశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పేదలకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే అత్యున్నత ప్రమాణాలతో వైద్యం అందించాలనే లక్ష్యంతో 2008లో ఆరోగ్యశ్రీ పథకం మొదలైంది. ఈ పథకం కింద ప్రస్తుతం 942 రకాల చికిత్సలు అందిస్తున్నారు. మొదట్లో అన్ని చికిత్సలను అందించేలా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు అవకాశం ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా శస్త్రచికిత్సలు చేశాయి. అవసరం లేకున్నా గర్భాశయాలను తొలగించడంతోపాటు థైరాయిడ్, అపెండిక్స్, మొర్రి, ఫిస్టులా, హెర్నియా వంటి సమస్యల పేరుతో భారీగా శస్త్రచికిత్సలు నిర్వహించాయి. దీనివల్ల చికిత్సల కోసం వచ్చిన పేదల ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు ప్రభుత్వానికి ఆర్థికంగా అనవసర భారం పడింది. ఈ అంశాలపై అధ్యయనం చేసిన ప్రభుత్వం 133 రకాల చికిత్సలను ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తొలగిస్తూ 2012లో నిర్ణయం తీసుకుంది. ఈ చికిత్సలను ప్రభుత్వ ఆస్పత్రులలో మాత్రమే చేయాలని స్పష్టం చేసింది. దీంతో అవసరమైన వారికి మాత్రమే శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఈ 133 చికిత్సలు నిర్వహణతో ఆరోగ్యశ్రీ నిధులు వచ్చి ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతం అవుతున్నాయి. మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోంది. మళ్లీ అదే తీరు... ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం తమకు రద్దు చేసిన 133 రకాల చికిత్సలను ఎలాగైనా పొందేందుకు ప్రైవేటు ఆస్పత్రులు కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు చికిత్సల నిర్వహణ బోధించాలనే కారణంతో ప్రైవేటు వైద్య కాలేజీలకు రద్దు చేసిన 133 చికిత్సలను తిరిగి వర్తింపజేయాలని ఆరోగ్యశ్రీ ట్రస్టును కోరాయి. ఐదేళ్లుగా అవసరంలేదని భావించిన ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉన్నతాధికారులు కూడా ఇందుకు అంగీకరించారు. అనంతరం ఈ ప్రతిపాదన ప్రభుత్వానికి చేరింది. ప్రభుత్వం దీనికి అనుమతిస్తే ప్రస్తుతం 133 చికిత్సలను నిర్వహిస్తూ ఆరోగ్యశ్రీ నుంచి నిధులు పొందుతున్న ప్రభుత్వ ఆస్పత్రులకు పోటీగా ప్రైవేటు వైద్య కాలేజీలూ ఆ చికిత్సలను అందిస్తాయి. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు తగ్గి ఆస్పత్రుల అభివృద్ధిపై ప్రభావం పడనుంది. -
కిడ్నీ మార్పిడి, క్యాన్సర్ చికిత్సలకు కవరేజీ రెట్టింపు
- రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు... - సర్కారుకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రతిపాదన - పేదలు, ప్రభుత్వోద్యోగులకు ప్రయోజనం సాక్షి, హైదరాబాద్: కిడ్నీ మార్పిడి, క్యాన్సర్‌లోని రెండు వ్యాధులకు చేసే శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీలో ప్రస్తుతమున్న కవరేజీ మొత్తాన్ని పెంచాలని ఆరోగ్యశ్రీ ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మేరకు ఇటీవల వైద్య ఆరోగ్యశాఖకు ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ రోగులకు ఎలాంటి వైద్య శస్త్రచికిత్స చేసినా రూ. 2 లక్షలకు మించి కవరేజీ రాదు. అంతకుమించి ఖర్చయితే రోగులే భరించాల్సి ఉంటుంది. కొందరు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రయత్నిస్తారు. అక్కడ అదనపు సొమ్ము విడుదలైతే సరేసరి లేకుంటే రోగి చావును వెతుక్కోవాల్సిన పరిస్థితి. అంతేగాక అధికంగా ఖర్చయ్యే శస్త్రచికిత్సలు చేయడానికి అనేక ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ముందుకు రావడంలేదు. చాలా మంది పేదలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ రెండు చికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే రూ. 2 లక్షలు సరిపోకపోవడంతో కవరేజీ సొమ్ము పెంచాలని ఆరోగ్యశ్రీ భావిస్తోంది. సర్కారు సంసిద్ధత తెలిపితే ఆరోగ్యశ్రీ బోర్డులో నిర్ణయం తీసుకొని అమలుచేస్తారు. కిడ్నీ మార్పిడికి రూ. 3.24 లక్షలు తెలంగాణలో మొత్తం 944 వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద పేదలు, ప్రభుత్వ ఉద్యోగులకు కవరేజీ ఇస్తున్నారు. అయితే వాటిల్లో అత్యంత కీలకమైన కిడ్నీ మార్పిడి, క్యాన్సర్‌లోని అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా, అక్యూట్ మైలాయిడ్ లుకేమియా శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ కవరేజీ పరిధికి మించి ఖర్చవుతోంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు లెక్కల ప్రకారం... కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు అంతా కలిపి రూ. 3,23,980 అవుతుందని తేల్చింది. ప్రస్తుతం ఇస్తున్న రూ.2లక్షలు పోనూ మిగతా మొత్తం పెంచాలని నిర్ణయించింది. అక్యూట్ మైలాయిడ్ లుకేమియాకు రూ. 4.15 లక్షలు ఆరోగ్యశ్రీలో మొత్తం 194 క్యాన్సర్లకు సంబంధించిన చికిత్సలకు కవరేజీ ఉంది. అందులో మెడికల్ అంకాలజీలోని అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియాకు రూ. 2.88 లక్షలు ఖర్చవుతుందని ఆరోగ్యశ్రీ తేల్చింది. ఇక అక్యూట్ మైలాయిడ్ లుకేమియాకు రూ. 4.15 లక్షలు ఖర్చు కానుంది. కాబట్టి ఆరోగ్యశ్రీలో పై మూడు శస్త్రచికిత్సలకు తాము వేసిన లెక్కల ప్రకారం కవరేజీ పెంచాలని యోచిస్తున్నారు. దీనివల్ల అటు పేదలు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని... సర్కారు సానుకూలంగా ఉందని... అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చాక అమలు చేస్తామని ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ చంద్రశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. -
పదో షెడ్యూల్లోకి ఆరోగ్యశ్రీ
♦ ఎంఎన్‌జే, యోగాధ్యయన పరిషత్ కూడా.. ♦ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.. త్వరలో ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ ట్రస్టును విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో చేర్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సంబంధించి రాష్ట్ర పరిధిలోని ఆస్తులన్నీ తెలంగాణకే చెందుతాయి. దీంతోపాటు హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, యోగాధ్యయన పరిషత్‌లు కూడా పదో షెడ్యూల్లో చేర్చారు. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన విభజన ప్రక్రియ మొదలు కానుంది. వీటిని పదో షెడ్యూల్లో చేర్చితే ఏపీ ప్రభుత్వం సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నిర్ణయంతో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయి. సొంత విధానాలు.. సొంత భవనం.. ఆరోగ్యశ్రీ ట్రస్టుకి రాష్ట్రంలో ఉన్న ఆస్తులు తెలంగాణకే చెందితే.. ఇక పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ భవనం.. అక్కడున్న అన్ని ఆస్తులూ పూర్తిగా తెలంగాణకే బదలాయిస్తారు. ఒకవేళ ఏపీ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయం ఈ భవనంలోనే తాత్కాలికంగా ఉండాలన్నా అద్దె చెల్లించాల్సిందే. అది కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తేనే. ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ తెలంగాణ నుంచి సీఈవోగా ఉన్నారు. విభజన జరిగితే పూర్తిస్థాయి సీఈవోను ప్రభుత్వం నియమిస్తుంది. నగదు రహిత కార్డులను జారీ చేసి ఉద్యోగుల వైద్య చికిత్సల పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం ఆరోగ్యశ్రీపైనే ఉంచింది. దీంతో రోజూ ఆరోగ్యశ్రీని ఆశ్రయించేవారు వేల సంఖ్యలో ఉన్నారు. ఆరోగ్యశ్రీ విభజన జరగక ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు తెలంగాణలో ఆరోగ్యశ్రీ పేరుతో తెల్లకార్డున్న పేద కుటుంబానికి రూ. 2 లక్షల వరకు వైద్య సేవలు పొందే వీలుంది. అదే ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో రూ. 2.5 లక్షల వరకు పొందేందుకు వీలు కల్పించారు. ఇలా వేర్వేరు పేర్లతో వేర్వేరు ఆర్థిక కవరేజీతో నడుస్తున్నాయి. ట్రస్టు ఉమ్మడిగా ఉండటం.. విధానాలు వేర్వేరుగా ఉండటం వల్ల సమస్యలు వచ్చాయి. ప్రస్తుతం రెండు వేర్వేరు బ్యాంకు ఖాతాలు, సిబ్బంది అంతర్గత పని విభజన జరిగినా.. విభజన స్పష్టంగా లేక సమస్యలొస్తున్నాయి. ఇప్పుడు ఈ సమస్యలన్నీ తీరనున్నాయి. ఎంవోయూతో ఎంఎన్‌జే సేవలు.. ఎంఎన్‌జే ఆస్పత్రిని పదో షెడ్యూల్లో చేర్చడంతో అది పూర్తిగా తెలంగాణకే కేటాయించినట్లయింది. ఇక నుంచి అందులో తెలంగాణ ప్రాంత ప్రజలే వైద్య సేవలు పొందడానికి వీలు కలుగనుంది. ఏపీ ప్రజలు కూడా ఇక్కడ వైద్య సేవలు పొందాలంటే.. అందుకు ఏపీ ప్రభుత్వం తెలంగాణతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోవాల్సి ఉంటుందని, సేవలకు అవసరమైన ఖర్చును భరించాల్సి ఉంటుందని అంటున్నారు. యోగాధ్యయన పరిషత్తు కూడా ఇదేవిధంగా ఉంటుందని చెపుతున్నారు. -
గందరగోళంలో ఆరోగ్యశ్రీ
ట్రస్టు విభజనపై ఇరు రాష్ట్రాల్లో సందిగ్ధం విభజన చట్టంలో లేని మార్గదర్శకాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి ఆరు నెలలు దాటినా ‘ఆరోగ్యశ్రీ’ మాత్రం ఉమ్మడిగానే ఉండిపోయింది. రెండు రాష్ట్రాల బాధ్యతలను ఒకే ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) నిర్వహిస్తుండటంతో సమస్యలు వచ్చిపడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విధానాలు, ప్రాధాన్యాలు మారిపోయాయి. ప్రభుత్వాల ఆలోచనలూ భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన ఆరోగ్యశ్రీ ట్రస్టు విభజన ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఎప్పుడు విభజిస్తారో అంతుబట్టడం లేదు. లక్షలాది మంది పేదలకు, ఉద్యోగులకు సేవలందించే ఆరోగ్యశ్రీని గాలికి వదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరు రాష్ట్రాలు వీలైనంత త్వరగా ఓ నిర్ణయానికి వస్తే అందరికీ మేలు జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. అయితే రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో ఆరోగ్యశ్రీ విభజనకు సంబంధించి స్పష్టత లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలంగాణ ఉన్నతాధికారులు అంటున్నారు. చట్టంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటే నిబంధనల ప్రకారం విభజన జరిగేది. 9వ షెడ్యూల్లో ఉంటే ఆరోగ్యశ్రీని నిట్టనిలువునా విభజించే అవకాశం ఉండేది. ఆస్తులు, సేవలు, నిధులు, సిబ్బందిని జనాభా నిష్పత్తి ప్రకారం ఇరు రాష్ట్రాలకు కేటాయించేవారు. ఒకవేళ పదో షెడ్యూల్లో ఉంటే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కేంద్ర కార్యాలయం ఉన్న రాష్ట్రానికే ట్రస్టును బదలాయించేవారు. ఆ ప్రకారం అది హైదరాబాద్‌లో ఉన్నందున తెలంగాణకే దక్కుతుంది. ఈ రెండు షెడ్యూళ్లలో ఆరోగ్యశ్రీ లేకపోవడంతో ఎలా విభజించాలన్న దానిపై ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం రెండు వేర్వేరు బ్యాంకు ఖాతాలు, సిబ్బంది అంతర్గత పని విభజన జరిగినా సేవలు అందించడంలో సమస్యలు వస్తున్నాయి. తాజాగా దీనిపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ సలహాకు వెళ్లింది. విభజన జరగక సమస్యలు.. పేదలకు, ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య సేవలు అందించే బాధ్యతను ఆరోగ్యశ్రీనే చూసుకుంటోంది. తెల్లకార్డున్న లక్షలాది మంది పేదలు ఉచితంగా సేవలు పొందుతున్నారు. నగదు రహిత కార్డుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు కూడా సేవలు పొందుతారు. మొత్తం 938 జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో చికిత్స చేస్తారు. అయితే ఆరోగ్య సేవల విషయంలో రెండు రాష్ట్రాల్లో వేర్వేరు విధానాలను ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద ఒక్కో పేద కుటుంబానికి రూ. 2 లక్షల వరకు వైద్య సేవలు పొందే వీలుంది. అదే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవల పేరుతో ఈ పరిమితిని రూ. 2.50 లక్షలకు పెంచారు. అంతేకాదు ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి సీఈవోగా ఉన్న ఐఏఎస్ అధికారిని ఏపీకి కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆయన సహజంగా ఏపీపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సీఈవోగా ఉన్నా అక్కడి అధికారి తెలంగాణలో పర్యవేక్షణ బాధ్యతలు చూడటం ఇబ్బందిగా ఉంటుందన్న వాదన కూడా ఉంది. దీంతో తెలంగాణలో పేదలు, ఉద్యోగులు ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. మరోవైపు ఆరోగ్యశ్రీలో పనిచేసే ఆరోగ్యమిత్రలు జీతాలు పెంచాలని కోరుతున్నారు. వారి గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. వైద్య శిబిరాలు కూడా అనుకున్నంతస్థాయిలో జరగకపోవడంతో రోగులు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పర్యవేక్షణలోపం వల్ల ఆరోగ్యశ్రీ సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. విభజన చేపట్టాలని స్వయానా సీఈవోనే ప్రభుత్వానికి విన్నవించినా ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. కనీసం సీఈవో పర్యవేక్షణలో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రత్యేకాధికారులనైనా నియమిస్తే బాగుంటుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. న్యాయ సలహాకు వెళ్లాం రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూళ్లలో దేనిలోనూ ఆరోగ్యశ్రీ విభజనపై స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. అందువల్ల ఈ విషయంలో గందరగోళం నెలకొంది. అందుకే ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ విభజన జరగలేదు. ఈ నేపథ్యంలో న్యాయ సలహాకు వెళ్లాం. అక్కడి నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చాక విభజనపై ముందుకు వెళ్తాం. ఇప్పటికే విభజనకు సంబంధించిన ఫైలును సిద్ధం చేశాం. - సురేష్‌చందా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ రాష్ర్ట విభజన (జూన్ 2, 2014) నాటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు రోగుల రిజిస్ట్రేషన్- 4.56 లక్షలు సేవలు పొందిన రోగులు- 2.92 లక్షలు జరిగిన శస్త్రచికిత్సలు, థెరపీలు ప్రభుత్వాసుపత్రులు-57 వేలు ప్రైవేటు ఆసుపత్రులు-1.16 లక్షలు విడుదలైన నిధులు ప్రభుత్వాసుపత్రులు-రూ. 160 కోట్లు ప్రైవేటు ఆసుపత్రులు - రూ. 323 కోట్లు