
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేసే ఆసుపత్రులకు రూ.234 కోట్లు విడుదల చేసినట్లు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ మల్లికార్జునరావు తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కార్డులతో వైద్యం చేసిన ఆసుపత్రులకు నిధులు విడుదల చేశామన్నారు. ఈ క్రమంలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం కింద వైద్యం చేసిన ఆసుపత్రులకు రూ.127 కోట్లు విడుదల చేశామన్నారు. తద్వారా ఉద్యోగులు, ప్రజల వైద్యానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. (ఉషస్సులు నింపుతున్న ఆరోగ్యశ్రీ)
చదవండి: కోటిన్నర కుటుంబాలకు ఆరోగ్య భరోసా
Comments
Please login to add a commentAdd a comment