Aarogyasri Health Care Trust Rrecruitment 2021: Vacancies Prakasam District - Sakshi
Sakshi News home page

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్, ప్రకాశంలో ఖాళీలు

Published Fri, Jun 11 2021 1:58 PM | Last Updated on Fri, Jun 11 2021 4:03 PM

Aarogyasri Health Care Trust Rrecruitment 2021: Vacancies Prakasam District - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 09

అర్హత: మంచి అకడమిక్‌ రికార్డ్‌తో బీఎస్సీ(నర్సింగ్‌), ఎమ్మెస్సీ(నర్సింగ్‌), బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మాడి, బీఎస్సీ మెడికల్‌ల్యాబ్‌ టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్, తెలుగు, ఇంగ్లిష్‌ చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 42ఏళ్లు మించకుండా ఉండాలి.

► వేతనం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతలు,కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్, డా.వైఎస్సార్‌ ఏహెచ్‌సీటీ, ఆపోజిట్‌: ప్రకాశం భవన్, ఓల్డ్‌ రిమ్స్, ఓంగోలు చిరునామాకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021

► వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement