Arogyamitra
-
ఆరోగ్య‘మిత్రు’లకూ అన్యాయమే!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సేవలందించిన వలంటీర్లకు మొండిచేయి చూపించిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు పేద రోగులకు అండదండగా నిలిచే ‘ఆరోగ్య మిత్ర’లకూ అన్యాయాన్ని తలపెట్టే దిశగా సాగుతోంది. ఇప్పటివరకు పేద రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్న ఆరోగ్య శ్రీ పథకం స్థానంలో బీమా విధానాన్ని ప్రవేశపెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయతి్నస్తుండటంతో ఆరోగ్య మిత్రలు, ఆరోగ్య శ్రీ టస్ట్రు సిబ్బందిలో ఆందోళన మొదలైంది.బీమా రూపంలో దళారి వ్యవస్థ వస్తే తమ ఉద్యోగాలకు భద్రత ఉండదని ఆరోగ్య మిత్రలు, టీం లీడర్లు, ఇతర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వమే ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వహిస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం సేవలను అందించడంలో ఆరోగ్య మిత్ర పాత్ర ఎంతో కీలకం. జబ్బుల బారిన పడిన వారు. ప్రమాదాల్లో గాయపడి ఆస్పత్రులకు వచి్చన వారికి పథకం కింద ఉచిత వైద్య సేవలు అందించి, వారు కోలుకుని చిరునవ్వుతో ఇంటికి తిరిగి వెళ్లే వరకు ఆరోగ్య మిత్రలు, టీం లీడర్లు వారికి వెన్నంటి ఉంటారు. ఈ పథక అమలుకు రాష్ట్రవ్యాప్తంగా 2,600 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.2012 మంది ఆరోగ్య మిత్రలు, 101 మంది టీం లీడర్లు, జిల్లా కార్యాలయాలు, ట్రస్ట్‌లో 500 మంది వరకు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది పేద, మధ్య తరగతి ప్రజల సేవలో నిమగ్నమై ఉన్నారు. నెలన్నర క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచి్చన కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ స్థానంలో బీమా విధానం ప్రవేశపెడతామంటూ చేసిన ప్రకటన ఈ చిరుద్యోగులను కలవరపాటుకు గురిచేస్తోంది.డిగ్రీ, పీజీ, బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ వంటి ఉన్నత చదువులు చదివి 16 ఏళ్ల నుంచి వీరంతా ఆరోగ్య శ్రీ పథకం అమలులో భాగస్వాములై ఉన్నారు. కొత్తగా తమను ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా బీమా సంస్థకు అప్పజెబితే ఆ సంస్థ లాభాపేక్షతో ఉద్యోగాల్లో కోత పెడుతుందని, అప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వంలోనే కొనసాగించాలని కోరుతున్నారు.భరోసానిచి్చన గత ప్రభుత్వంవైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆరోగ్య శ్రీలో విప్లవాత్మక సంస్కరణలతో పథకాన్ని బలోపేతం చేసింది. ప్రొసీజర్లు, వైద్య సేవల ఖర్చుల పరిమితి, నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్యను పెంచడమే కాకుండా కీలకమైన ఆరోగ్య మిత్రలు, టీం లీడర్ల వేతనాలను పెంచి, వారికి భరోసా కలి్పంచింది. 2014–19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మిత్రలకు రూ.6 వేలు, టీం లీడర్లకు రూ.10,600 చొప్పున వేతనాలు ఉండేవి.వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే 2019 నవంబర్‌లో మిత్రల వేతనాలను రూ.12 వేలకు, టీం లీడర్ల వేతనాలను రూ.15 వేల వరకు పెంచింది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి సీఎం కావడంతో వీరి ఉద్యోగాలకే ఎసరు వచి్చంది. ఆరోగ్య శ్రీ పథకాన్ని నిరీ్వర్యం చేసి, పేదల సేవలో ఉన్న మిత్రలు, ఇతర సిబ్బంది భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోంది.ఆరోగ్య మిత్రల ముఖ్యమైన విధులు⇒ నెట్వర్క్ ఆస్పత్రిలో సేవా కేంద్రం నిర్వహణ ⇒ రోగి ధ్రువపత్రాల పరిశీలన, అనంతరం రోగిని ఆస్పత్రిలో చేర్చడం ⇒ రోగికి అవసరమైన చికిత్సల వివరాలతో కూడిన ప్రతిపాదనను ట్రస్ట్‌కు పంపడం. వాటికి ఆమోదం వచ్చాక, చికిత్సలు అందేలా సమన్వయపరచడం.⇒ వైద్య సేవలు పొందడంలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం ⇒ చికిత్స అనంతరం డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లే రోగి నుంచి వైద్య సేవలపై అభిప్రాయసేకరణ చేయడం ⇒ 10 రోజులకు సరిపడా మందులను ఉచితంగా అందించడం ⇒ విశ్రాంతి సమయంలో భృతి కోసం ఆరోగ్య ఆసరా నగదును రోగి/కుటుంబ సభ్యుడి బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేయడానికి వీలుగా ప్రతిపాదనలు పంపడంఉద్యోగ భద్రత కలి్పంచాలిబీమా విధానంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 16 ఏళ్లుగా ఈ పథకం కింద సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్దేశించిన అర్హతలు, నియమ నిబంధనలకు లోబడి మేం నియమితులమయ్యాం. ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కలి్పంచాలి. బీమా విధానం అమలు చేసినప్పటికీ మమ్మల్ని ప్రభుత్వం పరిధిలోనే కొనసాగించి రెగ్యులర్ చేయాలి.– సీహెచ్ గోవింద్, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ వైద్య మిత్రా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ -
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, కడపలో 12 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన కడప జిల్లాలోని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్యమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 12 ► అర్హత: మంచి అకడమిక్ రికార్డ్‌తో బీఎస్సీ(నర్సింగ్), ఎమ్మెస్సీ(నర్సింగ్), బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మా డీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ► వేతనం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: విద్యార్హతలు, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, డోర్ నెం.57–98–1, అక్కయ్యపల్లి, శాస్త్రి నగర్, కడప చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 17.06.2021 ► వెబ్సైట్: kadapa.ap.gov.in మరిన్ని నోటిఫికేషన్లు: ఐబీపీఎస్ నోటిఫికేషన్, 10 వేలకు పైగా ఉద్యోగాలు NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో 89 పోస్టులు -
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, ప్రకాశంలో ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్.. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 09 ► అర్హత: మంచి అకడమిక్ రికార్డ్‌తో బీఎస్సీ(నర్సింగ్), ఎమ్మెస్సీ(నర్సింగ్), బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మాడి, బీఎస్సీ మెడికల్‌ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ► వయసు: 42ఏళ్లు మించకుండా ఉండాలి. ► వేతనం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: విద్యార్హతలు,కంప్యూటర్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, డా.వైఎస్సార్ ఏహెచ్‌సీటీ, ఆపోజిట్: ప్రకాశం భవన్, ఓల్డ్ రిమ్స్, ఓంగోలు చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021 ► వెబ్సైట్: https://prakasam.ap.gov.in -
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్‌లో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన కృష్టా జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్.. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 27 ► పోస్టుల వివరాలు: ఆరోగ్య మిత్ర 22; టీం లీడర్: 05. ► ఆరోగ్య మిత్ర: అర్హత: మంచి అకడెమిక్ రికార్డుతో బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్; ఇంగ్లిష్, తెలుగు చదవడం,రాయడంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 42ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► టీం లీడర్: అర్హత: మంచి అకడెమిక్ రికార్డుతో బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్; ఇంగ్లిష్, తెలుగు చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. పీజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 42ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► చిరునామా: డిస్ట్రిక్ కోఆర్డినేటర్, డాక్టర్ వైఎస్ఆర్ ఏహెచ్‌సీటీ, స్టేట్ గెస్ట్‌హౌస్ కాంపౌండ్, గోపాలరెడ్డి రోడ్, గవర్నర్‌పేట, విజయవాడ. ► దరఖాస్తులకు చివరి తేది: 09.06.2021 ► వెబ్సైట్: https://krishna.ap.gov.in డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, గుంటూరులో ఖాళీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన గుం టూరు జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్.. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 31 ► పోస్టుల వివరాలు: ఆరోగ్య మిత్ర 27; టీం లీడర్: 04. ► ఆరోగ్య మిత్ర: అర్హత: మంచి అకడెమిక్ రికార్డుతో బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్; ఇంగ్లిష్, తెలుగు చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 42ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► టీం లీడర్: అర్హత: మంచి అకడెమిక్ రికార్డుతో బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్; ఇంగ్లిష్, తెలుగు చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. పీజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 42 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► చిరునామా: ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేట్ కార్యాలయం, డీహెచ్ఎంఓ కార్యాలయం పక్కన, కలెక్టర్ బంగ్లారోడ్, గుంటూరు–522004. ► దరఖాస్తులకు చివరి తేది: 09.06.2021 ► వెబ్సైట్: https://guntur.ap.gov.in -
కరోనా రోగులు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్లాలి
నెల్లూరు(అర్బన్): కరోనా పాజిటివ్ వచ్చిన రోగులు తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు రేషన్ కార్డు తీసుకుని నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లాలని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ నాగార్జున బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డులేకపోతే ఆధార్‌కార్డు ఆధారంగా సీఎంసీఓ లెటర్‌ను తీసుకెళ్లాలని తెలిపారు. అప్పుడు మాత్రమే ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలందుతాయన్నారు. కరోనా రోగులను తరలించేటప్పుడు 104, 108 సిబ్బంది తమతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని రావాలని రోగులకు చెప్పాలని కోరారు. ఈ విషయం తెలియక అనేక మంది రోగులు ఆస్పత్రులకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేసేందుకు ప్రభుత్వం ప్యాకేజీలు ఇప్పటికే ప్రకటించిందని గుర్తుచేశారు. -
ఆరోగ్యశ్రీకి నిబంధనాలు
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆకర్షించడానికి చేసే పథకంలా ఆరోగ్యశ్రీలో బడ్జెట్ కేటాయింపులు, నగదు చెల్లింపులు ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం కింద శస్త్రచికిత్సలు చేయించుకునే వారికి నగదును పెంచిన ప్రభుత్వం, పథకంలోని సర్జరీల సంఖ్యను మాత్రం పెంచలేదు. పేదలకు ప్రమాదకర రోగం వస్తే చికిత్స చేయించుకునే తాహతులేక, ఆస్తులు అమ్ముకున్నా ఖరీదైన వైద్యం పొందలేక ప్రాణాలు కోల్పోతున్నారు. సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలు అయిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, న్యూరో సర్జరీలు, యాక్సిడెంట్లలో తీవ్రంగా గాయపడిన వారికి అందించే ఐసీయూ చికిత్సలు, గుండెకు చేసే అధునాతనమైన శస్త్రచకిత్సలను ఈ పథకం పరిధిలో చేర్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఒంగోలు సెంట్రల్: నిబంధనల ఆరోగ్యశ్రీ పథకంతో ఆరోగ్యం మెరుగయ్యేదెలా అంటూ పేదలు ప్రభుత్వతీరును విమర్శిస్తున్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రస్తుతం ఈ పథకానికి ఇస్తున్న రూ. 2.50 లక్షలు ఏప్రిల్ నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీని వల్ల పేద రోగులకు పెద్దగా ఉపయోగంలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో..: ఖరీదైన వైద్యం పేదలకు అందించాలన్న ఉద్దేశ్యంతో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు. మొదట్లో 468 జబ్బులతో మొదలైన ఈ పథకం కింద సంవత్సరంలోనే 938 జబ్బులను చేర్చారు. పేదవారు చికిత్స చేయించుకోలేని గుండెజబ్బు నుంచి కాలేయ జబ్బు వరకూ, క్యాన్సర్ నుంచి ఏ జబ్బుకైనా కార్పొరేట్ ఆసుపత్రుల్లో దీని కింద చికిత్స చేసుకునేలా పథకాన్ని తీర్చిదిద్దారు. జబ్బు బారిన పడిన వారికి చికిత్సతో పాటూ వైద్యం జరిగినన్ని రోజులు భోజనం, రవాణా చార్జీలను సైతం చెల్లించేలా పథకాన్ని రూపొందించారు. అప్పట్లో అనేక మంది దీని ద్వారా ప్రాణాలు కాపాడుకుని వైఎస్సార్‌కు తమ గుండెల్లో గుడికట్టారు. ప్రస్తుతం జరుగుతున్న తీరు ప్రస్తుతం 938 జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉండగా వీటిలో 133 జబ్బులకు ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్సలు చేయకూడదని, ప్రభుత్వ వైద్య శాలల్లోనే చికిత్స చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. హైదరాబాద్ వంటి నగరాల్లో చికిత్స చేయించుకుంటే ఆరోగ్యశ్రీ కింద నగదు విడుదల చేయడం లేదు. దీంతో అక్కడి వైద్యశాలలు ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన రోగులకు వైద్య చికిత్సలను అందించడం లేదు. ♦ సొంత ఊరిలో రేషన్ తీసుకుంటేనే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని లింకు పెట్టారు. దీంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారిని ఈ పథకం కింద వైద్య సాయానికి అనర్హులుగా చేశారు. ♦ కిడ్నీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పథకం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ♦ క్యాన్సర్ వస్తే చికిత్సకు కనీసం 8 సార్లుకు పైగా కీమోథెరపీని చేయించుకోవాలి. అయితే ప్రభుత్వం మాత్రం రెండుసార్లు వరకే తాము భరిస్తామని, తరువాత ఎవరికి వారే చేయించుకోవాలని నిబంధనను విధించడంతో క్యాన్సర్ రోగులు మృత్యువాత పడుతున్నారు. ♦ అతి తక్కువ మంది ఉండే చెవి, మూగ వారికి చేసే కాంక్లియర్ ఇన్‌ప్లాంట్స్‌ను మాత్రం పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. అయితే అది కూడా ఆసుపత్రులు నెలకు 1 కేసు మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించారు. ♦ ఇక నరాలు, కాలేయానికి సంబంధించిన శస్త్రచికిత్సలకు ప్రైవేటు వైద్యశాలలు ముందుకు రావడంలేదు. ఇలాంటి అనేక నిబంధనల వల్ల పేద వారు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పలు వైద్య సేవలను పొందలేకపోతున్నారు. ♦ గతంలో ఆరోగ్యశ్రీలో ఉండే 24 గంటల కడుపు నొప్పిని, పసరు తిత్తిలోని రాళ్లకు చేసే శస్త్రచికిత్సలను, ఆడవారికి చేసే పెద్ద శస్త్రచికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించుకోవాలని నిబంధన విధించారు. ♦ ప్రస్తుతం పథకంలో ఉన్న అర్థం, పర్థంలేని నిబంధనలు ఉంటే పథకం కింద వైద్యశాలలకు ఇచ్చే నగదును పెంచితే పేద రోగులకు ఒరిగేదేమీ లేదు. పథకం పరిధిని విస్త్రత పరిస్తేనే పేద రోగులకు లబ్ధి చేకూరతుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. -
చిరుద్యోగులపై చిన్నచూపు
పశ్చిమగోదావరి, దెందులూరు : వైద్య, ఆరోగ్య శాఖలో సేవలందించే ఆరోగ్య మిత్రలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. 15 ఏళ్లుగా పనిచేస్తున్నా అరకొర జీతాలే చెల్లిస్తుండడం, ఉద్యోగ భద్రత కరువవడంతో వారు అవస్థలు పడుతున్నారు. ఆరోగ్య మిత్రల పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్నవారితోనే పని చేయిస్తుండడంతో వారు తీవ్ర పనిభారంతో అల్లాడుతున్నారు. జిల్లాలో 70 పోస్టులు ఖాళీ జిల్లాలో 60 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ వైద్యశాలలు ఉన్నాయి. వీటిలో 170 పోస్టులు ఉండగా 100 మంది ఆరోగ్యమిత్రలు మాత్రమే ఉన్నారు. 70 పోస్టులు నియామకానికి నోచుకోలేదు. ఆరోగ్యమిత్రకు నెలకు రూ.6 వేలు జీతం ఇస్తున్నారు. మొదటి వారంలో మంజూరు కావాల్సిన ఆ జీతం కాస్తా నెల చివరిలో చేతికొచ్చే వరకూ సందేహమే. 15 ఏళ్లుగా ఆరోగ్యమిత్రలకు రూ.6 వేలు మాత్రమే వేతనంగా ప్రభుత్వం చెల్లిస్తోంది. జీతంలో పెరుగుదల లేకపోవడంతో పాటు ఉద్యోగ భద్రత కరువవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏదో ఒక రోజు ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని, జీతం పెరుగుతుందనే ఆశతో పనిచేస్తున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేవలు భేష్ పేషెంట్ వైద్యశాలలో చేరినప్పటి నుంచి ఓపీ షీటు నమోదు దగ్గర నుంచి శస్త్రచికిత్స జరిగి వైద్య సేవలు పొంది ఇంటికి వెళ్లేందుకు డిశ్చార్జి అయ్యేంత వరకు ఆరోగ్యమిత్రలు సేవలందిస్తారు. పేషెంట్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చవకుండా చూసుకునే పూర్తి బాధ్యత వైద్యశాలల్లో ఆరోగ్య మిత్రలదే. ఒక్కో ఆరోగ్యమిత్ర 8 గంటలు చొప్పున విధులు నిర్వహిస్తారు. దినసరి కూలీలు కూడా నేడు నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు సంపాదిస్తున్నారు. కానీ ఆరోగ్యమిత్రలపై మాత్రం ప్రభుత్వం కరుణ చూపడం లేదు. ఆరేళ్లుగా యూనిఫామ్ కరువు 2012లో ఆరోగ్య మిత్రలకు ఒక ఎఫ్రాన్ (యూనిఫామ్) ఇచ్చారు. అప్పటి నుంచి ఆరేళ్లుగా ఆరోగ్యమిత్రలకు యూనిఫామ్‌లు ఇవ్వటం లేదు. సెలవులు సైతం లేవు. ఒకవైపు ప్రభుత్వం నెట్వర్క్ వైద్యశాలలకు చెల్లించాల్సిన బిల్లులు కోట్ల రూపాయలు పెండింగ్ ఉండటం, మరో వైపు పేషెంట్ చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయ్యేంత వరకూ సేవలందించే ఆరోగ్యమిత్రలకు ఉద్యోగ భద్రత, జీతంపెంపు, యూనిఫాం ఇవ్వకపోవడం వంటి ప్రధాన సమస్యల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో జిల్లాలోని వంద మంది ఆరోగ్య మిత్రలు దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అనేకసార్లు ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులకు వినతిపత్రాలు అందజేసినా ప్రభుత్వం తమ సమస్యలను 15 ఏళ్లుగా పెడచెవిన పెట్టిందని ఆరోగ్యమిత్రలు కన్నీటి పర్యంతమవుతున్నారు. 15 ఏళ్లుగా సేవలు 15 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 8 గంటల పాటు పూర్తిస్థాయి వైద్య సేవలు అందిస్తున్నాం. ఆరోగ్య మిత్రలకు కనీస వేతనం, యూనిఫాం, నిబంధనల ప్రకారం సెలవులు, నెల మొదటి వారంలో జీతం జమ చేయాలి. ఆరోగ్యమిత్రల సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు అధ్యాయన కమిటీని ఏర్పాటు చేయాలి. – పీవీ ప్రసాద్, ఆరోగ్య మిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు -
ఆరోగ్య మిత్రలపై వేటు !
విజయనగరంఫోర్ట్: ఆరోగ్యమిత్రలు భయపడినట్లే జరిగింది. విద్యార్హతల పేరుతో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న ఆరోగ్యమిత్రల తొలగింపు ప్రక్రియకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు బుధవారం జీవో జారీ చేసింది. తక్షణమే జిల్లా మేనేజర్లను విధుల నుంచి తొలగించాలని ఈ జీవోలో పేర్కొంది. కో-ఆర్డినేటర్ మినహా అందరినీ ప్రభుత్వం నూతనంగా నిర్దేశించిన విద్యార్హతల ప్రకారం నియమించాలని సూచించింది. ఈ జీవో ప్రకారం కో-ఆర్డినేటర్ మినహా అందరినీ తొలగించినట్లేనని భావిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) పథకంలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రోడ్డునపడనున్న మిత్రలు జిల్లాలో 102 మంది పీహెచ్సీ మిత్రలు, 30 మంది నెట్వర్క్ మిత్రలు, ఒక నెట్వర్క్ టీమ్ లీడరు, మగ్గురు డివిజన్ల్ టీమ్ లీడర్లు, ఒక జిల్లా మేనేజర్, ఒక జిల్లా కో-ఆర్డినేటర్ పనిచేస్తున్నారు. జిల్లా మేనేజర్‌ను తక్షణమే విధుల నుంచి తొలిగించాలని, మిత్రలు, టీమ లీడర్లుగా బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత ఉన్న వారిని నూతనంగా నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎనిమిదేళ్ల క్రితం ఆరోగ్యశ్రీ పథకంలో డిగ్రీ విద్యార్హతతో చేరిన వీరంతా రోడ్డున పడే దుస్థితి నెలకొంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది 40 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. దీంతో తమకు ఇక ఉద్యోగ అవకాశాలు కూడా లేవని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పోరాటానికి సన్నద్ధం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆరోగ్య మిత్రలు గురువారం నుంచి పోరాటానికి సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వారు విధులు బహిష్కరించి ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని నిర్ణయించారు. ఏమీ పాలుపోవడంలేదు ‘ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న తమను తొలిగించడం దుర్మార్గం. ఉద్యోగం ఉందని ఆశతో జీవిస్తున్నాం. ఉద్యోగం నుంచి తొలగిస్తే భార్య, పిల్లలతో ఏ విధంగా జీవించాలి. ఏమి చేయాలో పాలు పోవడంలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఉన్న ఉద్యోగాన్ని పీకేయడం అన్యాయం. కె.మురళీధర్, ఆరోగ్యమిత్ర, విజయనగరం మా పొట్టగొట్టడం తగదు ‘చంద్రబాబు నాయుడు ఉన్నఫలంగా ఉద్యోగం తీసేసి అన్యాయం చేస్తాడని ఊహించలేదు. జీతం తక్కువ ఇచ్చినా సరే కష్ట పడి పనిచేస్తున్నాం. జీతాలు పెంచుతారని ఆశిస్తున్న తరుణంలో ఉద్యోగం తీసేయడం దారుణం. మాలాంటి వారి పొట్టగొట్టడం ప్రభుత్వానికి తగదు.’ పి.లక్ష్మి, ఆరోగ్య మిత్ర, విజయనగరం -
అయ్యో మిత్రా!
ఉపాధి కోల్పోయినవారు ► సర్కారు ఆపరేషన్ సక్సెస్.. ► జిల్లాలో 215 మంది ఆరోగ్యమిత్రలపై వేటు ► 8 ఏళ్ల సర్వీసు ఒక్క జీవోతో పోయె ► తమ అనుకూలుర కోసమే ఈ పన్నాగం ► మా కుటుంబాలను రోడ్డున పడేశారని బాధితుల ఆగ్రహం ► నేటి నుంచి ఆందోళన పథం!.. కోర్టుకు వెళ్లే యోచన ఎనిమిదేళ్ల అనుభవం.. ఇన్నాళ్లూ చేసిన సేవలు.. ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు.. అన్నీ ఒక్క జీవోతో కొట్టుకుపోయాయి. వందలమంది చిరుద్యోగులను రోడ్డున పడేశాయి. అధికార పార్టీకి అనుకూలమైన వారిని నియమించుకునేందుకు సర్కారు పన్నిన కుట్రకు వైద్యమిత్రలు బలయ్యారు. వయసురీత్యా ఇప్పుడు వేరే ఉద్యోగాలు దొరకడం కూడా కష్టమేనని వారు కన్నీరు పెట్టుకుంటున్నారు. విశాఖపట్నం: వైద్యమిత్రలు రోడ్డున పడ్డారు. కాదు.. ప్రభుత్వమే వారిని రోడ్డున పడేసింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చింది. ఆరోగ్యమిత్రలను వైద్యమిత్రలుగానూ మార్చింది. పేరుదేముందిలే అనుకుంటే.. ఇప్పుడు వారిని ఇంటికి సాగనంపే జీవో జారీ చేసింది. కొద్ది రోజుల నుంచి వీరిని తొలగిస్తారన్న ప్రచారం జరుగుతున్నా.. ప్రభుత్వం తమ క డుపు కొట్టే నిర్ణయం తీసుకోదన్న ఆశతో వీరున్నారు. వారి ఆశలను తుంచేస్తూ జీవో జారీ చేయడంతో అంతా షాక్ తిన్నారు. విశాఖ జిల్లా, నగరంలో కలిపి ఎన్టీఆర్ వైద్యసేవలో 216 మంది వైద్యమిత్రలు సేవలందిస్తున్నారు. వీరిలో ఒకరు జిల్లా మేనేజర్. నెట్వర్క్ వైద్యమిత్రలకు రూ.7300, పీహెచ్సీ వైద్యమిత్రలకు రూ.6200, టీమ్ లీడర్లకు రూ.10 వేలు, డీఎంకు రూ.20 వేలు చొప్పున జీతాలు చెల్లిస్తున్నారు. డీఎం, టీమ్ లీడర్లు, డివిజనల్ టీమ్ లీడర్లను ఎంబీఏ అర్హత, నెట్వర్క్, పీహెచ్సీ వైద్యమిత్రలను డిగ్రీ అర్హతతో 2007లో ఆరోగ్యశ్రీ పథకం కింద ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. అప్పట్నుంచి వీరు విధులు నిర్వర్తిస్తూ ఎంతో అనుభవాన్ని గడించారు. కాగా తెలంగాణలో వీరంతా ఇప్పటికీ ఆరోగ్యశ్రీలో ఆరోగ్య మిత్రలుగానే కొనసాగుతున్నారు. పైగా వారికి ఈ ఏడాది 40 శాతం జీతాలు పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎనిమిదేళ్ల అనుభవం ఉన్న తమను అర్హతల మెలికతో రోడ్డున పడేశారని వైద్యమిత్రలు ఆందోళన చెందుతున్నారు. నిలిచిపోయిన సేవలు ఎన్టీఆర్ వైద్యసేవ కింద చికిత్స పొందే రోగులకు వైద్యమిత్రలు మార్గదర్శకులుగా వ్యవహరించేవారు. వైద్యానికి వచ్చే వారికి ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో చేర్చేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయించి, వారికి వైద్యసేవలు సక్రమంగా అందుతున్నాయో లేదో చూసేవారు. రోగి ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేదాకా అన్నింటికీ వీరే బాధ్యత వహించేవారు. ఇన్నాళ్లూ తెల్ల రేషన్‌కార్డుదారులకే సేవలందించిన వీరు కొన్నాళ్ల నుంచి ప్రభుత్వోద్యోగులు, వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్‌కార్డుల పథకంలో చికిత్స కోసం వచ్చే వారికి కూడా సహకారం అందిస్తూవచ్చారు. ఉన్న పళంగా వీరిని తొలగించడంతో బుధవారం నుంచి ఆస్పత్రుల్లో ైవె ద్యమిత్రల సేవలు నిలిచిపోయాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవలకు సంబంధించి మార్గదర్శనం చేసేవారే లేకుండా పోయారు. కొత్తగా వైద్యమిత్రల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసి, నియామక ప్రక్రియ పూర్తి చేయడానికి మరో నెలరోజులైనా పడుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటిదాకా ఎన్టీఆర్ వైద్య సేవలు పొందేవారి పరిస్థితి అగమ్య గోచరంగా మారనుంది. అయిన వారి కోసమేనా? వైద్యమిత్రలను తొలగించి వారి స్థానంలో తమవారిని నియమించుకోవాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నియమితులైన వైద్యమిత్రలపై ఎలాగైనా వేటు వేయాలన్న లక్ష్యంతోనే అర్హతల మార్పును తెరపైకి తీసుకొచ్చిందంటున్నారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సువారు కావాలని ఇప్పుడు చెప్పడం విడ్డూరంగా ఉందని.. అదే కొలమానంఅయితే గత ఎనిమిదేళ్లుగా తాము ఎలా సేవలందించగలిగామని బాధిత వైద్యమిత్రలు ఆగ్ర హంతో ప్రశ్నిస్తున్నారు. ఆందోళనపథంలో.. తక్కువ జీతాలు ఇస్తున్నా ఈ ఉద్యోగాలనే నమ్ముకుని భార్యాపిల్లలతో నెట్టుకువస్తున్న తమను తొలగించడం అన్యాయమని వీరు ఆవేదన చెందుతున్నారు. దీనిపై భవిష్యత్ కార్యచరణకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో వైద్యమిత్రలు కోర్టుకు వెళ్లే యోచన చేస్తున్నారు. గురువారం నుంచి కలెక్టరేట్ వద్ద దీక్ష లు చేపట్టాలని భావిస్తున్నారు. మా ఉసురు తగులుతుంది.. ఎనిమిదేళ్లుగా ఈ ఉద్యోగాన్నే నమ్ముకుని విధులు నిర్వర్తిస్తున్నాం. రోగులకు సంపూర్ణ సేవలందిస్తూ సాయపడుతున్నాం. ఇప్పుడు అకస్మాత్తుగా ఉద్యోగంలోంచి తీసేశారు. అప్పట్లోనే తీసేస్తే వేరో ఉద్యోగం వెతుక్కునే వారం. మాకు వయసు దాటిపోయింది. ఇప్పుడెవరు ఉద్యోగం ఇస్తారు? మా పిల్లల చదువులు ఆగిపోతాయి. ఎనిమిదేళ్లుగా జీతాలు పెంచలేదు సరికదా ఇప్పుడు ఇంటికి పంపేశారు. మా పొట్టకొట్టి బీఎస్సీ నర్సింగ్ చదివిన వారికిస్తారట. ఎన్టీఆర్ వైద్య సేవను తల్లిలా నమ్ముకున్నాం. మమల్ని రోడ్డున పడేశారు. మా ఉసురు తగులుతుంది. -విజయ, పీహెచ్సీ వైద్యమిత్ర -
మరీ ఇంత శత్రుత్వమా!
ఆరోగ్యమిత్రలకు అడుగడుగునా అన్యాయమే అరకొర వేతనాలు కానరాని ఈఎస్ఐ కార్డులు పీఎఫ్ అనుమానమే పట్టించుకోని అధికారులు విశాఖపట్నం,న్యూస్‌లైన్ : తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం కోసం నిరీక్షించే పేదలకు వారు నిజంగా ఆరోగ్య మిత్రలే.. ఆపద్బంధువులే. అయితే వారు మాత్రం తమ జీవితాలకు సంబంధించి ఎంతో శత్రుత్వాన్ని ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో సమన్వయకర్తలుగా పని చేస్తున్న ఆరోగ్యమిత్రలు ఉద్యోగాలకు, వేతనాలకు సంబంధించి అనేక సమస్యల నడుమ పని చేస్తున్నారు. విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని డిస్పెన్సరీలు, జిల్లాలోని ఆరోగ్యకేంద్రాల్లో 105 మందిఆరోగ్యమిత్రలు 2007 నుంచి పనిచేస్తున్నారు. రోగుల ఆరోగ్యం గురించి పట్టించుకునే తమ బాగోగుల గురించి ఆలోచించేవారే కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది సమన్వయకర్తలు, కలెక్టర్లకు మొర పెట్టుకున్నా తమ సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయని అంటున్నారు. ఔట్సోర్సింగ్ సంస్థ శ్రమ దోపిడీ చేస్తున్నా ఇటు జిల్లాయంత్రాంగం గాని, అటు కార్మిక శాఖగాని పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. మొదట్లో వీరి వేతనం రూ.3,900 కాగా, తరువాత రూ.2,500కి తగ్గించేశారు. 2012 నుంచి కటింగ్‌లు పోనూ రూ.4,600 వంతున చెల్లిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఈ వేతనాలతో ఎలా బతకాలో అర్ధం కావడం లేదని వీరు గగ్గోలు పెడుతున్నారు. విధులివీ ఆరోగ్యమిత్రలు డిస్పెన్సరీలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విధులు నిర్వహిస్తారు. ఆరోగ్యశ్రీ సేవల కోసం రోగులకు ఆస్పత్రులను సిఫార్సు చేస్తారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫీల్డ్ వర్క్ చేస్తారు. ఒక్కో ఆరోగ్యమిత్ర రెండు నుంచి మూడు వార్డులలో సేవలందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ చికిత్సల తరువాత ఏడాది కాలం వరకు రోగుల బాగోలను వీరే చూసుకోవాల్సి వుంటుంది. సమస్యలివీ పీఎఫ్, ఈఎస్ఐ మొత్తాలు మినహాయిస్తున్నా సంబంధిత సంస్థలకు ఈ మొత్తాలుమ చేస్తున్నారో లేదోనన్న సందేహం ఇన్నేళ్లుగా పనిచేస్తున్నా కనీసం ఈఎస్ఐ కార్డులు కూడా అందించని యాజమాన్యం అందరికీ ఆరోగ్య సేవల కోసం పనిచేస్తున్న వీరి ఆరోగ్యానికి కనీస రక్షణ శూన్యం ఆందోళనలే మిగులు ప్రస్తుతం వీరంతా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ (హైదరాబాద్) సంస్థ కింద ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. కలెక్టర్, ఆరోగ్యశ్రీ సమన్వయకర్తలు మారినప్పుడల్లా తమ బాధలు వెళ్లబోసుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. 2011లో తమకు టీఏ బిల్లుకింద నెలకు రూ.వెయ్యి ఇస్తామన్నారని, అది కార్యరూపం దాల్చలేదని అంటున్నారు.