ఆరోగ్యశ్రీ స్థానంలో బీమా విధానానికి కూటమి ప్రభుత్వం చర్యలు
బీమా విధానం వస్తే పథకం దళారుల చేతుల్లోకి
ఆందోళనలో ఆరోగ్యమిత్రలు, ట్రస్ట్ ఉద్యోగులు
తమ ఉద్యోగాలకు భద్రత ఉండదని ఆవేదన
రాష్ట్ర వ్యాప్తంగా 2,600 మందికిపైగా ఉద్యోగులు
మిత్రలు, టీం లీడర్లకు వేతనాలు పెంచి భరోసానిచ్చిన గత ప్రభుత్వం
ఇప్పుడు వారి జీవితాలను అంధకారంలోకి నెడుతున్న కూటమి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సేవలందించిన వలంటీర్లకు మొండిచేయి చూపించిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు పేద రోగులకు అండదండగా నిలిచే ‘ఆరోగ్య మిత్ర’లకూ అన్యాయాన్ని తలపెట్టే దిశగా సాగుతోంది. ఇప్పటివరకు పేద రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్న ఆరోగ్య శ్రీ పథకం స్థానంలో బీమా విధానాన్ని ప్రవేశపెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయతి్నస్తుండటంతో ఆరోగ్య మిత్రలు, ఆరోగ్య శ్రీ టస్ట్రు సిబ్బందిలో ఆందోళన మొదలైంది.బీమా రూపంలో దళారి వ్యవస్థ వస్తే తమ ఉద్యోగాలకు భద్రత ఉండదని ఆరోగ్య మిత్రలు, టీం లీడర్లు, ఇతర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వమే ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వహిస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం సేవలను అందించడంలో ఆరోగ్య మిత్ర పాత్ర ఎంతో కీలకం. జబ్బుల బారిన పడిన వారు. ప్రమాదాల్లో గాయపడి ఆస్పత్రులకు వచి్చన వారికి పథకం కింద ఉచిత వైద్య సేవలు అందించి, వారు కోలుకుని చిరునవ్వుతో ఇంటికి తిరిగి వెళ్లే వరకు ఆరోగ్య మిత్రలు, టీం లీడర్లు వారికి వెన్నంటి ఉంటారు. ఈ పథక అమలుకు రాష్ట్రవ్యాప్తంగా 2,600 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
2012 మంది ఆరోగ్య మిత్రలు, 101 మంది టీం లీడర్లు, జిల్లా కార్యాలయాలు, ట్రస్ట్‌లో 500 మంది వరకు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది పేద, మధ్య తరగతి ప్రజల సేవలో నిమగ్నమై ఉన్నారు. నెలన్నర క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచి్చన కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ స్థానంలో బీమా విధానం ప్రవేశపెడతామంటూ చేసిన ప్రకటన ఈ చిరుద్యోగులను కలవరపాటుకు గురిచేస్తోంది.
డిగ్రీ, పీజీ, బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ వంటి ఉన్నత చదువులు చదివి 16 ఏళ్ల నుంచి వీరంతా ఆరోగ్య శ్రీ పథకం అమలులో భాగస్వాములై ఉన్నారు. కొత్తగా తమను ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా బీమా సంస్థకు అప్పజెబితే ఆ సంస్థ లాభాపేక్షతో ఉద్యోగాల్లో కోత పెడుతుందని, అప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వంలోనే కొనసాగించాలని కోరుతున్నారు.
భరోసానిచి్చన గత ప్రభుత్వం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆరోగ్య శ్రీలో విప్లవాత్మక సంస్కరణలతో పథకాన్ని బలోపేతం చేసింది. ప్రొసీజర్‌లు, వైద్య సేవల ఖర్చుల పరిమితి, నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఖ్యను పెంచడమే కాకుండా కీలకమైన ఆరోగ్య మిత్రలు, టీం లీడర్ల వేతనాలను పెంచి, వారికి భరోసా కలి్పంచింది. 2014–19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మిత్రలకు రూ.6 వేలు, టీం లీడర్లకు రూ.10,600 చొప్పున వేతనాలు ఉండేవి.
వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే 2019 నవంబర్‌లో మిత్రల వేతనాలను రూ.12 వేలకు, టీం లీడర్ల వేతనాలను రూ.15 వేల వరకు పెంచింది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి సీఎం కావడంతో వీరి ఉద్యోగాలకే ఎసరు వచి్చంది. ఆరోగ్య శ్రీ పథకాన్ని నిరీ్వర్యం చేసి, పేదల సేవలో ఉన్న మిత్రలు, ఇతర సిబ్బంది భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోంది.
ఆరోగ్య మిత్రల ముఖ్యమైన విధులు
⇒ నెట్‌వర్క్ ఆస్పత్రిలో సేవా కేంద్రం నిర్వహణ
⇒ రోగి ధ్రువపత్రాల పరిశీలన, అనంతరం రోగిని ఆస్పత్రిలో చేర్చడం
⇒ రోగికి అవసరమైన చికిత్సల వివరాలతో కూడిన ప్రతిపాదనను ట్రస్ట్‌కు పంపడం. వాటికి ఆమోదం వచ్చాక, చికిత్సలు
అందేలా సమన్వయపరచడం.
⇒ వైద్య సేవలు పొందడంలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం
⇒ చికిత్స అనంతరం డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లే రోగి నుంచి వైద్య సేవలపై అభిప్రాయసేకరణ చేయడం
⇒ 10 రోజులకు సరిపడా మందులను ఉచితంగా అందించడం
⇒ విశ్రాంతి సమయంలో భృతి కోసం ఆరోగ్య ఆసరా నగదును రోగి/కుటుంబ సభ్యుడి బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేయడానికి వీలుగా ప్రతిపాదనలు పంపడం
ఉద్యోగ భద్రత కలి్పంచాలి
బీమా విధానంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 16 ఏళ్లుగా ఈ పథకం కింద సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్దేశించిన అర్హతలు, నియమ నిబంధనలకు లోబడి మేం నియమితులమయ్యాం. ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కలి్పంచాలి. బీమా విధానం అమలు చేసినప్పటికీ మమ్మల్ని ప్రభుత్వం పరిధిలోనే కొనసాగించి రెగ్యులర్ చేయాలి.
– సీహెచ్ గోవింద్, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ వైద్య మిత్రా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment