సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రేపు (శనివారం) ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం రెండు దశాల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం భావించినట్లు అన్ని అనుకూలంగా జరిగితే మార్చి చివరి నాటికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. తొలి విడత మార్చి 21, రెండో విడత ఎన్నిక 24న నిర్వహించే విధంగా షెడ్యూల్ రూపొందించినట్లు సమాచారం.
ఇప్పటికే మొత్తం 13 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారైన విషయం తెలిసిందే. జిల్లా పరిషత్ ఎన్నికలు ముగియగానే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. మరోవైపు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. (ఏపీ జిల్లా పరిషత్ రిజర్వేషన్లు ఖరారు)
Comments
Please login to add a commentAdd a comment