సాక్షి, ఏలూరు: వరుస ఎన్నికలతో క్షణం తీరిక లేకుండా పనిచేసిన జిల్లాలోని ఉగ్యోగులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఉద్యో గుల పంపకా ల సందడి జి ల్లాలోని ప్రభు త్వ కార్యాలయాల్లోనూ కనిపిస్తోంది. అధికారులలో ఎవరు ఎక్కడకు బదిలీ అవుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మన జిల్లాకు చేరువలో రాజధాని ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు, అన్ని శాఖల మంత్రులు రాష్ట్రస్థాయి అధికార యంత్రాంగం, ప్రధాన కార్యాలయాలు మనకు దగ్గర్లోనే కొలువుదీరతాయి. ఆ ప్రభావం జిల్లాపై కచ్చితంగా పడుతుంది. జిల్లాలో ఏ కార్యాలయానికి వెళ్లినా ఇదే చర్చ నడుస్తోంది. మరోవైపు రాష్ట్ర విభజన కారణంగా ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి ఫైళ్లను ప్రధాన కార్యాలయాలకు పంపిం చవద్దని ఆదేశాలందాయి. కేవలం విభజనకు సంబంధించిన ఫైళ్లు మాత్రమే పంపించమంటున్నారు. ఈ కారణంగా జిల్లాకు రావాల్సిన బిల్లులు, ఇతర పాలనాపరమైన పనులు కొద్దిరోజుల పాటు నిలిచిపోనున్నాయి.
ప్రభుత్వ శాఖలు 76.. ఉద్యోగులు 45,155 మంది
జిల్లాలోని 76 ప్రభుత్వ శాఖల్లో 45,155 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో జిల్లాస్థాయి అధికారులుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కొందరు ఉన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల విభజన జరుగుతోంది. దీంతో కలెక్టర్ సహా అధికారులు తాము కోరుకునే ప్రాంతానికి సంబంధించి ఆప్షన్లు ఇవ్వా ల్సి వస్తోంది. తెలంగాణ వారు అక్కడికి వెళ్లిపోయే అవకాశం ఉంది. అలా వెళ్లే వారు ఎవరనే దానిపై చర్చ సాగుతోంది. ఇన్నాళ్లూ తమతో కలసి పనిచేసిన వారు ప్రాంతాల పేరుతో బదిలీపై వెళ్లాల్సిరావడంతో కొందరు ఉద్వేగానికి లోనవుతున్నారు. ఇదేవిధంగా తెలంగాణ ప్రాం తంలో పనిచేస్తున్న వారు కూడా మన జిల్లాకు రానున్నారు. అలా ఎవరు వస్తున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. జిల్లాస్థాయి అధికారులు రాష్ట్రం మారాల్సి వస్తుంటే.. కిందిస్థాయి సిబ్బంది జిల్లాలు, జిల్లాలోనే పలు ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమకు కావాల్సిన స్థానాల్లో పోస్టింగ్ పొందేం దుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
పాలకులు మనకు సమీపంలోనే... కొత్త రాష్ట్రం జూన్ 2న అధికారికంగా ఏర్పడనుంది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుతీరుతుంది. రాజధాని ఎక్కడనే నిర్ణయం జరిగేంతవరకూ విజయవాడ-గుంటూరు మధ్య పరిపాలనా కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సీఎం క్యాంప్ ఆఫీసు గుంటూరులోనే ఉండబోతోంది. రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయం కూడా సమీపంలోనే ఏర్పాటు కానున్నాయి. మన పాలకులు, ఉన్నతాధికారులు మనకు అత్యంత సమీపంలోనే ఉంటారు. ఇప్పటివరకూ జిల్లా పర్యటనలకు మంత్రులు వస్తున్నారంటే కనీసం ఒకరోజు ముందుగానే సమాచారం ఉండేది. కానీ కొత్త పాలకులు జిల్లా పర్యటనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వచ్చే అవకాశం ఉంది. తక్కువ దూరమే కావడంతో సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలకు తరచూ వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ అంశం అధికారులకు ఇప్పటినుంచే ముచ్చెమటలు పట్టిస్తోంది. ఏ చిన్న పొరపాటు జరిగినా ఫలితాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఇక మీదట అత్యంత అప్రమత్తంగా పనిచేయాల్సిన పరిస్థితి వారికి ఏర్పడుతుంది.
ఎవరెటు
Published Sun, May 25 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement