ఏపీ, తెలంగాణలో కొత్త ఉన్నత విద్యాసంస్థలు
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వెల్లడి
న్యూఢిల్లీ: ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయను న్న ఉన్నత విద్యా సంస్థల వివరాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మం త్రి సృ్మతి ఇరానీ బుధవారం లోక్‌సభకు తెలియచేశా రు. ఏపీలో ఐఐఎం, ఐఐటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఆర్), ఎన్‌ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), పెట్రోలియం యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఎయిమ్స్ తరహా సంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలో హార్టికల్చర్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.