Reorganization law
-
నవ కశ్మీరం
శ్రీనగర్: అక్టోబర్ 31. ఈ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి ఇదే రోజు. 500కిపైగా విడివిడిగా ఉన్న సంస్థానాలను మన దేశంలో కలపడానికి కృషి చేసిన మహనీయుడాయన. అప్పటి ప్రధాని నెహ్రూ పాక్ సరిహద్దుల్లో ఉన్న సమస్యాత్మక ప్రాంతమైన కశ్మీర్‌ను భారత్‌లో కలపడానికి పటేల్‌కు అనుమతినివ్వలేదు. ఫలితంగా ఇన్నాళ్లూ ఆ సమస్య రావణకాష్టంలా రగిలింది. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లకు పటేల్ జయంతి రోజే కశ్మీర్లో నవ శకానికి నాంది పలికింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ అప్పట్లో రాజ్యాంగంలో జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ఆగస్టు 5న రద్దు చేసింది. కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి ఓకే చెప్పింది. పటేల్ జయంతి అయిన నేటి నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు అమల్లోకి వచ్చిన ఈ చట్టంతో 173 ఏళ్ల చరిత్ర కలిగిన జమ్మూ కశ్మీర్ కథ ఇక గతం. జమ్ము కశ్మీర్, లదాఖ్ ప్రాంతాలు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ చట్టం ప్రకారం అసెంబ్లీఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్, పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా లదాఖ్ అవతరించాయి. శాంతి భద్రతలు కేంద్రం చేతుల్లోనే జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలన్నీ గురువారం నుంచి నేరుగా కేంద్రం చేతుల్లోకి వెళ్లనున్నాయి. పోలీసు యంత్రాంగం యావత్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధీనంలో నడుచుకుంటుంది. కేంద్రం నియమించిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కే సర్వాధికారాలు ఉంటాయి. భూ లావాదేవీల వ్యవహారాలన్నీ ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. యూటీగా మారిన కశ్మీర్ అసెంబ్లీకి శాంతి భద్రతలు, పోలీసు యంత్రాంగం, పబ్లిక్ ఆర్డర్ మినహా మిగిలిన అన్ని అంశాల్లోనూ చట్టాలు చేసే అధికారాలున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఏసీబీ వంటివన్నీ కేంద్రం నియమించిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పరిధిలోనే పనిచేస్తాయి. ఇక జమ్మూ కశ్మీర్లో ఎన్నికయ్యే ప్రభుత్వ అసెంబ్లీ స్థానాలు 107గా ఉన్నాయి. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చాక తర్వాత వాటి సంఖ్య 114కి పెరుగుతుంది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సిఫారసు లేనిదే ఆర్థిక బిల్లులేవీ అసెంబ్లీలో ప్రవేశపెట్టే అధికారాలు కొత్త ప్రభుత్వానికి ఉండవు. ఇక, లదాఖ్‌కు శాసనసభ అంటూ ఏమీ ఉండదు. ఇది పూర్తిగా కేంద్ర నియంత్రణలోనే ఉంటుంది. ఎల్జీల ప్రమాణం నేడే జమ్మూ కశ్మీర్ కొత్త లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ) గా ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర ముర్ము, లదాఖ్æ ఎల్జీగా ఆర్కే మాథూర్‌లను కేంద్రం నియమించింది. గురువారం నాడు శ్రీనగర్, లేహ్‌లలో జరిగే కార్యక్రమాల్లో ఈ ఇద్దరు లెఫ్ట్‌నెంట్ గవర్నర్స్ పదవీ ప్రమాణం చేయనున్నారు. వీరిద్దరితో కశ్మీర్ హైకోర్టు సీజే గీత ప్రమాణం చేయిస్తారు. -
హైకోర్టు కట్టడానికి డబ్బుల్లేవు
- అందువల్ల నిర్మాణానికి సమయం పడుతుంది - ఈ విషయంలో తెలంగాణ వైఖరి సరికాదు - హైకోర్టు విభజన కేంద్రం పరిధిలో లేదు - చట్టప్రకారం సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే - విజయవాడలో మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు సాక్షి, విజయవాడ బ్యూరో: పునర్విభజన చట్టంలో తమకు కావాల్సిన వాటిని అమలు చేయాలంటున్న తెలంగాణ ప్రభుత్వం అవే చట్టంలో ఉన్న మిగిలిన అంశాలను మాత్రం కాదంటోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ పద్ధతి సరికాదని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అన్నారు. తెలంగాణతో గొడవ పడడానికి తాను సిద్ధంగా లేనని, అది ఉపయోగం లేదన్నారు. చైనా పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. హైకోర్టు కట్టడానికి స్థలం ఉంది కానీ డబ్బులు లేవన్నారు. రైతులు భూమి ఇచ్చారని.. దాన్లో నిర్మాణాలు చేసేందుకు మాస్టర్‌ప్లాన్ తయారు చేయాలి కదా అని ప్రశ్నించారు. హైకోర్టును ఐకానిక్ భవనంగా కట్టాలనుకుంటున్నామని.. దానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్ కూడా తమదేనంటున్నారని చెప్పారు. కూర్చుని చర్చించుకునేందుకు ప్రయత్నాలు చేశానని.. అయినా నీళ్లు, పదో షెడ్యూల్లో ఉన్న ఆస్తుల విషయంలో ఏదీ జరగలేదన్నారు. కేసీఆర్, తానూ కూర్చుని మాట్లాడుకుంటే ఏమవుతుందని ప్రశ్నించిన ఆయన చట్టప్రకారం రెండు రాష్ట్రాల సమస్యలను కేంద్రం పరిష్కరించాల్సి ఉందన్నారు. హైకోర్టు విభజన అంశం కేంద్రం పరిధిలో లేదని, సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. హైదరాబాద్‌లో అన్నీ వదులుకుని వచ్చిన వాడిని.. కోర్టును కూడా వదులుకుంటే ఏమవుతుందని ప్రశ్నించారు.కాగా రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ఎందుకో ముందుకు రావట్లేదన్నారు. కేంద్రం ఇంకా రూ.1,500 కోట్లే ఇస్తామంటోంది ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలసి రాజధానికి నిధులివ్వాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. రాజధానికి మొత్తంగా రూ.2,500 కోట్లు ఇస్తామంటున్నారని, గతంలో విజయవాడ, గుంటూరు నగరాలకిచ్చిన వెయ్యికోట్లనూ అందులో కలిపి చెబుతున్నారన్నారు. ఇంకా రూ.1,500 కోట్లు ఇస్తారని, అవి రాజధానిలో తాము కట్టే 400 కేవీ విద్యుత్ టవర్స్‌కు సరిపోతాయని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తాము కేంద్రాన్ని నిధులు అడుగుతామన్నారు. రాజధాని నిర్మాణంకోసం రుణాలకోసం ప్రయత్నిస్తామని, ఎక్కడ అవకాశముంటే అక్కడికెళ్లి అడుగుతామని చెప్పారు. తాను కేంద్రంపై పోరాడనని, సమస్యలపై పోరాడతానని ఆయన అన్నారు. ఇంత చేస్తున్నా వైఎస్సార్సీపీ పొంతనలేని విమర్శలు చేస్తోందని, సీబీఐ విచారణ అడుగుతోందని మండిపడ్డారు. సీబీఐ విచారణ వేస్తే ఈ వ్యవహారాన్ని కంపు చేయాలని చూస్తోందని ఆరోపించారు.ఐదురోజుల చైనా పర్యటన ఫలప్రదమైందని, పెట్టుబడులే ధ్యేయంగా పలు నగరాల్లో పర్యటించామని చంద్రబాబు తెలిపారు. ఇతర దేశాల్లో ఏపీని ఒక రాష్ట్రంగా కూడా చూడట్లేదని, తనను చూసి హైదరాబాద్‌ను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. దేశంలో చైనాకు చెందిన 500 కంపెనీలు పని చేస్తున్నాయని, వాటిద్వారా పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా చైనా పర్యటన, జరిగిన ఒప్పందాల గురించి ఆయన వివరించారు. కడపలో ఆన్‌స్టీల్ కంపె నీ రూ.మూడువేల కోట్లతో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ముందుకొచ్చిందని, బ్రహ్మణి స్టీల్స్‌కు గతంలో కేటాయించిన స్థలాన్ని దానికిస్తామని చెప్పినట్లు తెలిపారు. -
ఏపీ, తెలంగాణలో కొత్త ఉన్నత విద్యాసంస్థలు
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వెల్లడి న్యూఢిల్లీ: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయను న్న ఉన్నత విద్యా సంస్థల వివరాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మం త్రి సృ్మతి ఇరానీ బుధవారం లోక్‌సభకు తెలియచేశా రు. ఏపీలో ఐఐఎం, ఐఐటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఆర్), ఎన్ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), పెట్రోలియం యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎయిమ్స్ తరహా సంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలో హార్టికల్చర్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.