పొగాకు సమాఖ్యకు ఫిబ్రవరి 9న ఎన్నికలు | AP Tobacco growers Cooperative Union elections on february 9th | Sakshi
Sakshi News home page

పొగాకు సమాఖ్యకు ఫిబ్రవరి 9న ఎన్నికలు

Published Sun, Jan 5 2014 4:46 AM | Last Updated on Sat, Aug 18 2018 8:53 PM

AP Tobacco growers Cooperative Union elections on february 9th

ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య (ఏపీ టుబాకో గ్రోయర్స్ కోఆపరేటివ్ యూనియన్) నూతన పాలకవర్గ ఎన్నికలకు జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్ జీఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. సమాఖ్య అధ్యక్షునిగా కట్టా శివయ్య పదవీ కాలం ముగిసి రెండేళ్లయింది. ఈ రెండేళ్లలో సమాఖ్య పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీ (పీఐసీ) పాలనలో ఉంది. ఫిబ్రవరి 29న నూతన పాలకవర్గ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల అధికారిగా అద్దంకి సబ్‌డివిజనల్ సహకారాధికారి స్వర్ణ నాగేశ్వరరావును నియమించారు.

 ఎన్నికల షెడ్యూల్ వివరాలను జిల్లా సహకారాధికారి పి.శరభయ్య వివరించారు. సమాఖ్యలో మొత్తం 18 మంది డెరైక్టర్లను సభ్యులు రహస్య ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు. వీరిలో ఒకరిని అధ్యక్షునిగా, మరొకరిని ఉపాధ్యక్షునిగా ఎన్నుకుంటారు. ముగ్గురు ఎక్స్‌అఫీషియో సభ్యులు (అధికారులు)ంటారు. జిల్లాసహకారాధికారి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్‌లు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు.

 ఎన్నికల షెడ్యూల్ ఇదీ..
 జనవరి 5న సమాఖ్య పీఐసీ/సీఈఓ అర్హులైన ఓటర్ల జాబితా తయారు చేస్తారు. 11న ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలియజేయవచ్చు. 17న ఎన్నికల అధికారికి ఓటర్ల జాబితా సమర్పణ, 21న ఎన్నికల అధికారి ఓటర్ల జాబితా పరిశీలన, 28న ఎన్నికల నోటిఫికేషన్‌ను కలెక్టర్ జారీ చేస్తారు. 29న ఎన్నికల అధికారి ఎన్నికల ప్రకటనను జారీ చేస్తారు. ఫిబ్రవరి 1న నామినేషన్ల స్వీకరణ, 2న నామినేషన్ల పరిశీలన, 3న నామినేషన్ల ఉపసంహరణ, 9న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement