ఆంధ్రప్రదేశ్ అర్హత పరీక్ష (ఏపీసెట్)-2013 నిర్వహణకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ అర్హత పరీక్ష (ఏపీసెట్)-2013 నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 24న నిర్వహించనున్న ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 12 రీజినల్ సెంటర్లలో 208 పరీక్షా కేంద్రాలలో 1,26,785 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. వీరిలో 3,479 మంది వికలాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేక స్క్రైబ్‌లను ఏర్పాటు చేశారు.
ఇప్పటికే అభ్యర్థులందరికీ హాల్ టికెట్ల పంపిణీ పూర్తయ్యింది. ఒకరి పరీక్షను మరొకరు రాయకుండా తొలిసారి వేలిముద్ర విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఏపీసెట్ సభ్యకార్యదర్శి ప్రొఫెసర్ బి.రాజేశ్వర్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అభ్యర్థులంతా పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని ఆయన సూచించారు.