Disabled candidates
-
పింఛన్లు తొలగించేందుకే ఈ పరీక్షలు
తణుకు అర్బన్ : ‘ఇరవయ్యేళ్ల నుంచి పింఛను తీసుకుంటున్నాం.. ఎప్పుడూ లేదు, ఇదేం ఖర్మో మరి.. కంటిచూపు కనిపించడం లేదంటే మళ్లీ పరీక్షలంటున్నారు.. పింఛను తొలగించేందుకే ఈ పరీక్షలు.. ఈ ప్రభుత్వానికి ఏ రోగమొచ్చిందో మమ్మల్ని ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు.. మీరు ఎన్ని డబ్బులు దొబ్బినా ఫర్వాలేదు వికలాంగుల మీద పడి ఏడుస్తున్నారు ఏంటో.. మీ ఖర్మ కాలింది మీకు కూడా మా గతే పడుతుంది’.. అంటూ దివ్యాంగులు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.దివ్యాంగుల పింఛను వెరిఫికేషన్ కార్యక్రమం సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మొదలైంది. ముందుగా పట్టణ పరిధిలోని దివ్యాంగులను వెరిఫికేషన్ శిబిరానికి రావాల్సిందిగా వార్డు సెక్రటరీలు నోటీసులిచ్చారు. మొదటి దఫాలో కంటి, చెవికి సంబంధించి ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన శిబిరానికి దివ్యాంగులు తమ సహాయకులను తీసుకుని హాజరయ్యారు. ఇబ్బందులు పడ్డ దివ్యాంగులు.. ముఖ్యంగా కంటిచూపు లేని దివ్యాంగుల వెతలు వర్ణనాతీతం. వీరు అటూ ఇటూ తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు తమ చంటి బిడ్డలను చంకనేసుకుని సహాయకులతో వచ్చి నరకయాతన అనుభవించారు. నిన్ననే నోటీసిచ్చి ఈరోజు నిర్థారణ శిబిరానికి రావాలంటూ హడావుడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. ‘పింఛను మొత్తాన్ని పెంచడమెందుకు? ఇప్పుడు తొలగించేందుకు కుట్ర లు పన్నడమేంటి?’ అంటూ రుసరుసలాడారు. పింఛనుదారుల్లో ఎవరు సక్రమమో, ఎవరు అక్రమమో తెలుసుకునేందుకు మొత్తం అందరినీ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక శిబిరానికి వచ్చిన దివ్యాంగులకు నీళ్లప్యాకెట్లు తప్ప ఏమీ ఇవ్వకపోవడంతో పాటు సర్వర్ పనిచేయకపోవడంతో వారు ఇబ్బందులు పడ్డారు. -
‘దివ్య’మైన ఉపాధి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దివ్యాంగజన్ పెట్రోల్ బంక్ స్థానిక దివ్యాంగుల జీవితాలకు కొత్త వెలుగునిస్తోంది. మొన్నటివరకు ఎన్నో కష్టాలు పడినవారు.. ఇప్పుడు పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. పట్టణ శివారులోని పెద్దూరు వద్ద మెడికల్ కాలేజీ ముందు దివ్యాంగజన్ పెట్రోల్ బంక్‌ను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఏర్పాటు చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.2.50 కోట్లతో బంక్ ఏర్పాటు చేసింది. కలెక్టర్ మరో రూ.30 లక్షలు గ్రాంట్‌గా మంజూరు చేయడంతో ప్రస్తుతం బంక్ నడుస్తోంది. వాస్తవానికి దీనిని ట్రాన్స్‌జెండర్స్ కోసం ఏర్పాటు చేశారు. వారు ఇక్కడ ఇచ్చే రూ.12 వేల వేతనానికి పని చేసేందుకు ముందుకు రాకపోవటంతో దివ్యాంగులకు పని కల్పించాలని కలెక్టర్ నిర్ణయించారు. బంక్‌ను గత నెలలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. 23 మందికి శాశ్వతంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 17 మంది పని చేస్తున్నారు. నిత్యం రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు డీజిల్, పెట్రోల్ అమ్మకాలు సాగుతున్నాయి.ఈమె పేరు ఆకుల సంధ్య (42). సిరిసిల్ల శివ నగర్‌కు చెందిన ఈమెకు చిన్నప్పుడే పోలియో మూలంగా కాలు వంకరగా ఉంది. ఈమె భర్త రమేశ్ సిరిసిల్లలో కిరాణ షాపు నడిపేవాడు. ఇప్పుడు పెద్దూరులో ఉండడంతో పెద్దగా పని లేదు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రభుత్వం మెడికల్ కాలేజీ ముందు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడంతో అక్కడ పని చేస్తూ సంధ్య నెలకు రూ.12 వేలు సంపాదిస్తుంది.ఇతని పేరు బాలమల్లేశ్ (40). సిరిసిల్ల శాంతినగర్‌కు చెందిన ఈయన నిరుపేద. ఇల్లు లేదు. భార్య మాధురి బీడీలు చేస్తుంది. వీరికి ఒక్క పాప. 8వ తరగతి చదువుతుంది. పోలియోతో మల్లేశ్ కాలు వంకరగా ఉంది. అతనిప్పుడు పెట్రోల్ బంక్‌లో పని చేస్తూ నెలకు రూ.13 వేలు సంపాదిస్తున్నాడు. భార్యాభర్తల ఆదాయం రూ.20 వేల వరకు వస్తుండటంతో పెద్దగా కష్టాలు లేకుండా బతుకుతున్నారు.ఉపాధి రెట్టింపైంది మాది సిరిసిల్ల శివారులోని రగుడు. నేను స్కూల్లో పని చేసేదాన్ని. అప్పుడు రూ.6 వేలు జీతం వచ్చేది. నాకు బాబు, కూతురు. నా భర్త నన్ను వదిలేసి వెళ్లాడు. ఒంటరి మహిళను కావడంతో పెట్రోల్ బంక్‌లో పని కల్పించారు. ప్రస్తుతం రూ.12 వేల వేతనం వస్తుంది. జీతం రెట్టింపు అయింది. ఇక్కడ పని చేయడం సంతోషంగా ఉంది. – గోనెపల్లి మంజుల, రగుడు దివ్యాంగులను ప్రోత్సహించాలి ప్రభుత్వ సహకారం, జిల్లా కలెక్టర్ చొరవతోనే ఈ పెట్రోల్ బంక్ ఏర్పాటయింది. వాహనదారులు ఇక్కడ పెట్రోల్,డీజిల్ పోయించుకుని దివ్యాంగులను ప్రోత్సహించాలి. లాభాపేక్ష లేకుండా దివ్యాంగులకు పని కల్పించడమే బంక్ లక్ష్యం. –లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమ అధికారి, రాజన్న సిరిసిల్ల -
CM KCR: వారందరికీ గుడ్‌న్యూస్.. పెన్షన్ 4వేలకు పెంపు
సాక్షి, మంచిర్యాల : సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా కొత్త కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని వికలాంగులకు శుభవార్త వినిపించారు. తెలంగాణలోని వికలాంగులకు ఆసరా పెన్షన్లు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పెంచిన పెన్షన్లు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. కాగా, మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మొత్తం తెలంగాణ సమాజం బాగుండాలి. తెలంగాణ వచ్చి పదేళ్లు అయ్యింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో వికలాంగుల పెన్షన్ కూడా పెంచబోతున్నాం. ఆసరా పెన్షన్లతో అందరూ బాగున్నారు. వికలాంగులకు ప్రస్తుతం రూ. 3,116 పెన్షన్ ఇస్తున్నాం. వారికి మరో వెయ్యి రూపాయాలు పెంచుతున్నాం. మంచిర్యాల గడ్డ నుంచి తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ప్రకటించాలని నేను సస్పెన్షన్‌లో పెట్టాను. వచ్చే నెల నుంచి రూ. 4,116 పెన్షన్ అందుతుంది. అందరి సంక్షేమాన్ని, మంచిని చూసుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఈ క్రమంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ అందిస్తున్నాం. రైతుబంధు ద్వారా రైతులకు రూ.65వేల కోట్టు అందించాం. వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం తెలంగాణ. 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ పంట సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం. సింగరేణి టర్నోవర్‌ను రూ.33వేల కోట్లకు పెంచాం. సింగరేణిది 134 ఏళ్ల చరిత్ర. సింగరేణి మన సొంత ఆస్తి. కాంగ్రెస్ హయాంలో సింగరేణి సర్వనాశం అయ్యింది. దేశంలో బొగ్గుకు కొరత లేదు. 361 బిలియన్ టన్నుల బొగ్గు ఉండగా విద్యుత్‌ను ప్రైవేటు పరం చేస్తామంటున్నారు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే, బీజేపీ పూర్తిగా ముంచాలని చూస్తోంది. వచ్చే దసరాలో సింగరేణి కార్మికులకు రూ.700 కోట్లు బోనస్ ఇవ్వబోతున్నాం. దేశంలోని చెడ్డ పాలసీలను అంతా కలిసి అడ్డుకోవాలి అని పిలుపునిచ్చారు. ఇది కూడా చదవండి: చెన్నై టూ హైదరాబాద్: అప్సర కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్‌లు.. -
International disabled day: దివ్యాంగుల కోసం ఎన్నో కార్యక్రమాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం దివ్యాంగులు తమ ప్రతిభను చాటుకునేందుకు, వారికి అవకాశాలు కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని ప్రధాని మోదీ చెప్పారు. దివ్యాంగులు ప్రదర్శిస్తున్న ధైర్యాన్ని, వారు సాధిస్తున్న విజయాలను ఆయన ప్రశంసించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందనటానికి తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలే తార్కాణం. దివ్యాంగుల జీవితాల్లో సానుకూల మార్పు కోసం అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్న కృషి వారందరికీ కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. -
దివ్యాంగులకు వరం.. యూడీ కార్డ్
ఏలూరు (టూటౌన్): దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనే సంకల్పంతో ప్రభుత్వం తీసుకువచ్చిన యూడీ ఐడీ (యూనిక్ డిజెబిలిటీ ఐడెంటిటీ కార్డ్) వారికి వరంగా మారింది. ఏదోక వైకల్యం ఉన్న వారు ఎక్కడికైనా వెళ్లాలంటే తమ వద్ద ఉన్న అర్హత పత్రాలు అన్నింటినీ గతంలో వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఈ సమయంలో పొరపాటున ఏదైనా పత్రం పోతే తిరిగి దాన్ని పొందేందుకు అనేక అవస్థలు పడాల్సి వచ్చేది. ఈ సమస్యలు లేకుండా దివ్యాంగులకు మేలు చేయాలనే లక్ష్యంతో యూడీ ఐడీ కార్డును ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. అర్హులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 54,052 మంది దివ్యాంగులు ఉన్నారు. వీరందరికీ యూడీ కార్డులను జారీ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ నుంచి జిల్లా కేంద్రంలోని దివ్యాంగుల సంక్షేమ శాఖకు ఆదేశాలు అందాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యూనిక్ గుర్తింపు కార్డులో దివ్యాంగుని పేరు, గుర్తింపు సంఖ్య, పుట్టిన తేదీ, వైకల్య శాతం, జారీ చేసిన తేదీ, కార్డు ఎప్పటివరకూ పనిచేస్తుంది, కార్డు వెనుక వైపు సదరం గుర్తింపు ఐడీ నంబర్, క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. దీనిని కోడింగ్ చేస్తే పూర్తి వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా తొలి, మలి విడతల్లో 9,984 గుర్తింపు కార్డులు మంజూరు చేశారు. కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంది. దరఖాస్తు విధానం ఇలా.. https://www.swavlambancard.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లైఫర్ సర్టిఫికెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తరువాత దివ్యాంగుడి వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. రెండో కాలమ్‌లో చిరునామా, గుర్తింపు కార్డు వివరాలు, శాశ్వత చిరునామా పొందుపర్చాలి. మూడో కాలమ్‌లో వైకల్య వివరాలు, నాలుగో కాలమ్‌లో ఎంప్లాయిమెంట్, దివ్యాంగుని గుర్తింపు వివరాలు నమోదు చేయాలి. ఫొటో, వేలిముద్ర లేక సంతకం చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. దరఖాస్తు పూర్తయిన తరువాత పరిశీలించి గుర్తింపు కార్డులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇప్పటివరకు 9,984 కార్డులు మంజూరు జిల్లాలో ఇప్పటివరకూ 9,984 యూడీ కార్డులు మంజూరు చేశాం. దివ్యాంగులకు సంబంధించిన అన్ని వివరాలు ఒకే కార్డులో పొందుపర్చడం వల్ల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై ఎటువంటి సందేహాలు ఉన్నా జిల్లా కేంద్రం ఏలూరులోని కలెక్టరేట్ కాంపౌండ్‌లో ఉన్న మా కార్యాలయానికి వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు. – ఎం.ఝాన్సీరాణి, సహాయ సంచాలకులు, వికలాంగుల సంక్షేమ శాఖ -
వైకల్యాన్ని జయించిన ఓటు
వారు దివ్యాంగులే కానీ అందరికీ ఆదర్శవంతులు.. నడవ రాకున్నా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.. కళ్లు కనబడకున్నా కదిలొచ్చారు.. మేము సైతం అంటూ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.. ఓటేసేందుకు బద్ధకించిన వారి కళ్లు తెరిపించారు. పోలింగ్ శాతంలో సాధారణ ఓటర్ల కంటే దివ్యాంగ ఓటర్లే ముందుండడం విశేషం. ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఇటీవలి ఎన్నికల్లో సాధారణ ఓటర్ల కంటే దివ్యాంగ ఓటర్లే అధిక సంఖ్యలో ఓటు వేసి తమ ఉనికి చాటుకున్నారు. జిల్లాలో 84 శాతం ఓటింగ్ నమోదు చేసి తాము ఎందులో తీసిపోలేమని మరోసారి నిరూపించుకున్నారు. అధికారులు సేకరించిన లెక్కల ప్రకారం జిల్లాలో 17,886 మంది దివ్యాంగ ఓటర్లుంటే, 1,369 పోలింగ్ కేంద్రాల్లో కలిపి 15,060 మంది (84శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో విశేషమేమిటంటే కళ్లు లేకున్నా 1,876 మంది ఇంటి నుంచి కదిలి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు. అవయవాలన్నీ సక్రమంగా ఉండి ఓటు వేయని వారికి వీరు ఆదర్శంగా నిలిచారు. అలాగే మూగ, చెటివి వారి విషయానికి వస్తే 1,396 మంది, అత్యధికంగా శారీరక వికలాంగులు 9,585 మంది, ఇతరులు 2,203 మంది ఓటు వేశారు. నియోజకవర్గాల వారీగా చూస్తే, అత్యధికంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 3,361 మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండో స్థానంలో బాల్కొండ నియోజకవర్గం ఉండగా, మూడవ స్థానంలో ఆర్మూర్ నియోజకవర్గం ఉంది. అత్యల్పంగా నిజామాబాద్ అర్బన్‌లో 896 మంది మాత్రమే ఓటేశారు. అయితే, జిల్లా పోలింగ్ శాతం 76.23 ఉండగా, ఇందులో దివ్యాంగులది 84 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ప్రత్యేక దృష్టి సారించడంతోనే.. రాష్ట్ర ఎన్నికల సంఘం దివ్యాంగ ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఓటు హక్కు ఉన్న దివ్యాంగులందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా వారికి పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఇందుకు ఎన్నికలకు కొన్ని రోజుల ముందుగానే పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు నిర్మించారు. ఇంటి నుంచి కదల్లేని, నడవలేని వారిని ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించేలా రవాణా ఏర్పాట్లు చేశారు. వారి కోసం ప్రత్యేకంగా 400 లకు పైగా వీల్ చైర్లను తెప్పించిన అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచారు. వలంటీర్లను కూడా నియమించారు. ఆటోల ద్వారా ఇంటి నుంచి దివ్యాంగ ఓటర్లను తీసుకుని వచ్చి వీల్చైర్ల ద్వారా పోలింగ్ బూత్ వద్దకు తీసుకెళ్లారు. మళ్లీ పోలింగ్ కేంద్రం నుంచి ఇంటికి అదే ఆటోలలో తరలించారు. వారికి కల్పించిన సౌకర్యాలను తెలుసుకుని దివ్యాంగ ఓటర్లు ధీమాగా ఓటేయడానికి ముందుకు కదిలారు. ఇటు అంధులు సులభంగా ఓటే వేసేలా అన్ని పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ యూనిట్లపై బ్రెయిలీ లిపిని ఏర్పాటు చేశారు. తద్వారా దివ్యాంగ ఓటర్ల పోలింగ్ శాతం పెరగడానికి కారణమైంది. వివరాలు సేకరించిన అధికారులు.. అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగ ఓటర్లపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించిన నేపధ్యంలో జిల్లాలో ఎంత మంది దివ్యాంగ ఓటర్లున్నారో తెలుసుకోవడానికి జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ, డీఆర్డీఏ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వివరాలను సేకరించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 3,084 మంది, బోధన్‌లో 3,164, బాన్సువాడలో 2,729, నిజామాబాద్ అర్బన్‌లో 1,313, నిజామాబాద్ రూరల్‌లో 4,053, బాల్కొండ నియోజకవర్గంలో 3,543 మంది ఓటర్లున్నట్లు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తంగా దివ్యాంగ ఓటర్లు 17,886 మంది ఓటర్లున్నట్లు అధికారుల సర్వేలో తేలింది. ప్రస్తుతం 15,060 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని వారి ఉనికిని చాటుకున్నారు. -
యాసిడ్ దాడి బాధితులకు రిజర్వేషన్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో యాసిడ్ దాడి బాధితులతో పాటు మానసిక అస్వస్థత, అటిజం వంటి వ్యాధులతో బాధపడేవారికి రిజర్వేషన్ కల్పించనున్నట్టు అధికారిక ఉత్తర్వులు వెల్లడయ్యాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్స్లో ప్రస్తుతం ఏ, బీ, సీ గ్రూపుల్లో మూడు శాతంగా ఉన్న రిజర్వేషన్‌ను నాలుగు శాతానికి పెంచుతూ పైన పేర్కొన్న క్యాటగిరీలకు కోటా వర్తింపచేయనున్నట్టు ఈ ఉత్తర్వులు స్పష్టం చేశాయి. 40 శాతం కన్నా తక్కువ లేకుండా నిర్థిష్ట వైకల్యం కలిగిన వారికి రిజర్వేషన్లను వర్తింపచేస్తారు. వీరికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో వీటికి సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలు గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్లను నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైకల్యం కలిగిన ఉద్యోగి పట్ల ఎవరైనా వివక్ష పాటిస్తే వారిపై గ్రీవెన్స్ రిడ్రెసల్ అధికారి వద్ద ఫిర్యాదు చేయవచ్చు. -
దివ్యాంగులకు దిక్సూచి
విధి చిన్నచూపు చూసినా అతడు కుంగిపోలేదు. వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపించాడు. పేదరికాన్ని జయించి చదువుకుని రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. తనలా శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోవాలనేఆశయంలో ఉద్యోగాన్ని వదిలి దివ్యాంగులకు అండగా నిలుస్తున్నారు దేవరపల్లికి చెందిన కాగిత భాస్కరరావు. గొల్లగూడెం వద్ద ఆశ్రమం స్థాపించి 56 మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. దేవరపల్లి : పోలియో వ్యాధి బారిన పడి రెండు కాళ్లు చచ్చుపడిపోవడంతో మానసికంగా కుంగిపోయాడు దేవరపల్లికి చెందిన కాగిత భాస్కరరావు. చదువుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ పేదరికం అడ్డుగా నిలిచింది. అయినా పట్టుదలతో తల్లిదండ్రులను ఒప్పించి ఇంటర్ వరకు ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాడు. అనంతరం ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేసి 1994లో దివ్యాంగుల కోటాలో రైల్వే శాఖలో ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ భాస్కరరావుకు తృప్తి లేదు. సమాజంలో దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను, అవమానాల నుంచి కొంతమదిౖకైనా విముక్తి కల్పించాలని నిర్ణయించుకుని రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2004లో భారతి వికలాంగుల సేవా సమితి స్థాపించి లగడపాటి రామలక్ష్మమ్మ వికలాంగుల ఆశ్రమం పేరున దేవరపల్లి మండలం గొల్లగూడెం వద్ద ఆశ్రమం స్థాపించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాలలో సుమారు 56 మంది దివ్యాంగులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. చదువుతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు, వృత్తి విద్యలో శిక్షణ ఇస్తున్నారు. చేతివృత్తులతో పాటు కంప్యూటర్ రంగంలో శిక్షణ ఇస్తున్నారు. దాతల సహకారంతో ఆశ్రమం అభివృద్ధి ఆశ్రమం అభివృద్ధికి ప్రభుత్వ సహకారం లేకపోయినప్పటికీ దాతల సహకారం లభిస్తోంది. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఎంతోమంది దాతలు ఆశ్రమాన్ని సందర్శించి విరాళాలు అందజేస్తున్నారు. ఎంతోమంది ధనికులు తమ పిల్లల పుట్టిన రోజు వేడుకలు, పెళ్లి్ల రోజు వేడుకలను ఆశ్రమంలో నిర్వహించి దివ్యాంగులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాలుగా భాస్కరరావు ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది దివ్యాంగులను అక్కున చేర్చుకుంటున్నారు. ఆశ్రమం ద్వారా వివిధ సేవలు ప్రత్యేక విద్య, చేతివృత్తుల శిక్షణ, కంప్యూటర్ శిక్షణ, డిజిటల్ క్లాసులు, దివ్యాంగులకు ఉచిత హాస్టల్ వసతి సౌకర్యం, మెడికల్ క్యాంపుల నిర్వహణ, కృత్రిమ కాళ్లు, చేతులు, క్యాలిపర్స్, క్రచ్చెస్, వీల్‌చైర్స్, ట్రైసెకిళ్లు అందజేయుట, దివ్యాంగులకు వివాహ కార్యక్రమాలు నిర్వహించడం, వేసవి కాలంలో మినరల్ వాటర్‌తో చలివేంద్రాల ఏర్పాటు, అనాథలకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతేకాక కన్నబిడ్డల నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రుల కోసం వృద్ధాశ్రమం స్థాపించి వృద్ధులకు ఆశ్రయం కల్పింస్తున్నారు. తనతో పాటు భార్య భారతి, ఇద్దరు పిల్లలు కూడా ఆశ్రమం సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. భాస్కరరావు కుటుంబమంతా దివ్యాగులు, వృద్ధుల సేవలకే అంకితమై పనిచేస్తున్నారు. నా చివరి శ్వాస వరకు దివ్యాగుల సేవలోనే ఉంటానని భాస్కరరావు అంటున్నారు. వృద్ధుల కోసం దాతల సహకారంతో భవన నిర్మాణం చేస్తున్నారు. -
ఆ బాబు నీడలు మాకొద్దు
ఒక వికలాంగురాలిగా నా అనుభవ పాఠాలతో చెబుతున్నాను. ప్రభుత్వాలిచ్చే సామాజిక పెన్షన్లను రాజకీయంగా చూడవద్దు. సామాజికంగా దెబ్బతిన్న వర్గాలకు ఇది చేయూత అనుకోండి. వారు భావితరాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని మరవద్దు. అలా ఆలోచించే వారికే ఈ ఎన్నికల్లో పట్టం కట్టాలన్నది నా కోరిక. వికలాంగులు, వయో వృద్ధులు, వితంతువుల ఆవేదన నుంచి వచ్చే ఏకైక మాట ఇది. ఒకింత బాసట కావాలని ఆశించే అభ్యర్థన ఇది. గెస్ట్ కాలం: సమాజంలో మెజారిటీ వికలాంగులు దయనీయస్థితిలో ఉన్నారు. వయో వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు హయాంలో ఈ వర్గాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. వంద కూడా దాటని పెన్షన్ కోసం చెప్పులరిగేలా తిరిగే వాళ్లం. వైఎస్ పాదయాత్రలో అనేకమంది ఈ గోడు వెళ్లబోసుకున్నారు. వికలాంగురాలిగా నాకూ ఏదో తెలియని అపనమ్మకం ఉండేది. దానికి బలమైన కారణాలూ న్నాయి. చంద్రబాబు తన హయాంలో తొమ్మిదేళ్లు ఉద్యోగ నియామకాలు నిలిపివేశారు. ఫలితంగా ఒక్క వికలాంగుడికీ ఉద్యోగం రాలేదు. ఆయన ఈ ద్రోహం చేసి ఉండకపోతే వికలాంగుల్లో కనీసం 50 శాతం మంది బాగుపడి ఉండేవారు. ఉద్యోగాల్లో చేరి ఉండేవారు. వైఎస్‌కు మేలు చేయాలని ఉన్నా... చంద్రబాబు చర్యలు అడ్డుగా నిలిచాయి. అప్పటికే అనేకమంది ఉద్యోగాల్లో చేరేందుకు వయోపరిమితి దాటిపోయారు. వయో వృద్ధుల పరిస్థితి ఇంతకంటే దారుణం. చంద్రబాబు కాలంలోని వరుస కరవు.. గ్రామీణ ఆర్థిక ప్రగతిని దెబ్బతీసింది. ఉమ్మడి కుటుంబాలు ఆ కాలంలోనే అంతరించాయి. ఖాళీ అయిన ఊళ్లు, వలసలు వెళ్లిన కొడుకులు ఆనాటి పరిస్థితి. దీంతో వయసు ఉడిగిన పెద్దలకు ఆసరా కరవైంది. పూట గడవడమే కష్టమనే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత హైటెక్ మోజులో యువత పట్టణాలకు ఎగబాకారు. అంతిమంగా వృద్ధులు నిరాశ్రయులయ్యారు. వితంతువుల స్థితి మరీ దారుణం. చిన్న వయసులోనే భర్తలు కోల్పోయిన వారిని 2004కు ముందు పట్టించుకున్నదెవరు? పెన్షన్లు ఇవ్వడం వైఎస్ గొప్పతనమే. పెన్షన్లు పెంచడం, వాటిని నెలనెలా సక్రమంగా ఇవ్వడం వల్ల మాకు కొంతైనా ఊరట కలిగింది. ఆయన తర్వాత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. వికలాంగులు, వయోవృద్ధులకు ఇతర దేశాల్లో ప్రభుత్వాలే చేయూతనిస్తున్నాయి. మన దేశంలో మూడు శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నారు. రాజకీయంగా ఆ మాత్రం కూడా లేదు. వితంతువులు, వికలాంగుల్లో అత్యధికులు నిరుద్యోగులు. వికలాంగుల్లో ఎక్కువ భాగం తెలంగాణలోనే ఉన్నారు. దీనికి ఫ్లోరైడ్ కూడా కారణం కావచ్చు. విద్య, వైద్యం అందరికీ అందాలని వైఎస్ చెప్పేవారు. ఆ దిశగా ఆయన కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ వంటి వైద్య సదుపాయాలు ఉండొచ్చు. అయితే మహిళా వికలాంగులకు ఇవే చేయూతనిస్తాయని చెప్పలేం. వారి సమస్యలు వేరు. ప్రసూతి సమయంలో వారికి ఉండే ఇబ్బందులు భిన్నం. వయసు మీదపడే కొద్దీ వికలాంగుల ఆరోగ్య పరిస్థితిలో మార్పు ఉంటుంది. ఔషధాల వినియోగం పెరుగుతుంది. వృద్ధుల పరిస్థితీ ఇదే. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడిచ్చే పెన్షన్‌ను మరింత పెంచాలి. సామాజిక పెన్షనర్లను రాజకీయ ఆయుధంగా వాడుకోకూడదు. ఎన్నికల మేనిఫెస్టోలో వారి గురించి ఆలోచిస్తే చాలు. చంద్రబాబు ఉద్యోగ నియామకాలపై నిషేధం విధించడం వల్ల ఒకతరం అవిటిదైపోయింది. ఇది గుర్తించి ఊరట కలిగిద్దామనుకున్నారు వైఎస్. తన ప్రయత్నాలు కార్యరూపం దాల్చేలోపే ఆయన లేకుండాపోయారు. ఆ తర్వాత పాలకులు కనీసం ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లినా బాగుండేది. మా సానుభూతి వైఎస్వైపే ఉందనుకున్నారో ఏమో! అన్యాయం చేస్తున్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. మూడేళ్లుగా ఇవ్వడం లేదు నేను పుట్టుకతోనే వికలాంగుడను. కాలు పనిచేయదు. 75శాతం వికలత్వం ఉన్నట్టు సదరం క్యాంపులో వైద్యులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు వికలాంగ పింఛన్ మంజూరు చేశారు. ఆయన ఉన్నంత వరకు పింఛన్లు సక్రమంగా ఇచ్చిన అధికారులు మూడేళ్లుగా సరిగా ఇవ్వడం లేదు. ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి తిరిగి పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి. - శివకుమార్, కొత్తపల్లి(హెచ్), నార్నూర్ వైఎస్ పుణ్యమాని.. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.75 వృద్ధాప్య పింఛన్ ఇచ్చేవాళ్లు. వైఎస్ పుణ్యమా అని అది రూ.200కు పెరిగింది. దీంతోనే బతుకుతున్నం. మాలాంటి ఎంతో మంది వృద్ధులకు వైఎస్సార్ అన్నం పెట్టిండు. వేలి ముద్రల పేరుతో ఇప్పుడు పింఛన్ ఇచ్చేందుకు పరేషాన్ చేస్తుండ్రు. వేలి ముద్రలు రాక పోవడంతో డబ్బులు సమయానికి దొరకడం లేదు. పోస్టాఫీస్ చుట్టూ తిరిగి కాళ్లరిగిపోతున్నాయి. పింఛన్ పెంచిన రాజశేఖరరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. - హమీదా బేగం, వాంకిడి, ఆదిలాబాద్ పింఛన్‌తోనే బతుకుతున్నా.. నా భర్త చనిపోయి 20ఏండ్లయింది. ఆసరాగా ఎవరూ లేరు. మొదట్లో రూ.75 పింఛన్ వచ్చేది. రాజన్న వచ్చినంక రూ.200కు పెంచిండు. ఒకటో తారీఖు రాంగనే పంచాయతీకి పోయి పైసలు తెచ్చుకుంట. ఎన్నికల్లో గెలిసేటోళ్లు పింఛన్ పెంచాలి. రూ.700 ఇత్తే అండగా ఉంటది. - బోగ రాజమ్మ, వితంతు పింఛను లబ్ధిదారురాలు, బచ్చన్నపేట, వరంగల్ -
రేపే ఏపీసెట్-2013
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ అర్హత పరీక్ష (ఏపీసెట్)-2013 నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 24న నిర్వహించనున్న ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 12 రీజినల్ సెంటర్లలో 208 పరీక్షా కేంద్రాలలో 1,26,785 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. వీరిలో 3,479 మంది వికలాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేక స్క్రైబ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అభ్యర్థులందరికీ హాల్ టికెట్ల పంపిణీ పూర్తయ్యింది. ఒకరి పరీక్షను మరొకరు రాయకుండా తొలిసారి వేలిముద్ర విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఏపీసెట్ సభ్యకార్యదర్శి ప్రొఫెసర్ బి.రాజేశ్వర్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అభ్యర్థులంతా పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని ఆయన సూచించారు.