
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం దివ్యాంగులు తమ ప్రతిభను చాటుకునేందుకు, వారికి అవకాశాలు కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని ప్రధాని మోదీ చెప్పారు. దివ్యాంగులు ప్రదర్శిస్తున్న ధైర్యాన్ని, వారు సాధిస్తున్న విజయాలను ఆయన ప్రశంసించారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందనటానికి తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలే తార్కాణం. దివ్యాంగుల జీవితాల్లో సానుకూల మార్పు కోసం అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్న కృషి వారందరికీ కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment