
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో యాసిడ్ దాడి బాధితులతో పాటు మానసిక అస్వస్థత, అటిజం వంటి వ్యాధులతో బాధపడేవారికి రిజర్వేషన్ కల్పించనున్నట్టు అధికారిక ఉత్తర్వులు వెల్లడయ్యాయి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్స్‌లో ప్రస్తుతం ఏ, బీ, సీ గ్రూపుల్లో మూడు శాతంగా ఉన్న రిజర్వేషన్‌ను నాలుగు శాతానికి పెంచుతూ పైన పేర్కొన్న క్యాటగిరీలకు కోటా వర్తింపచేయనున్నట్టు ఈ ఉత్తర్వులు స్పష్టం చేశాయి.
40 శాతం కన్నా తక్కువ లేకుండా నిర్థిష్ట వైకల్యం కలిగిన వారికి రిజర్వేషన్లను వర్తింపచేస్తారు. వీరికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో వీటికి సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలు గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్లను నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైకల్యం కలిగిన ఉద్యోగి పట్ల ఎవరైనా వివక్ష పాటిస్తే వారిపై గ్రీవెన్స్ రిడ్రెసల్ అధికారి వద్ద ఫిర్యాదు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment