ఈ-కామర్స్‌తో ఆప్కోలో రూ. అరకోటి వ్యాపారం!
సాక్షి, హైదరాబాద్: ఆప్కో ఈ-కామర్స్‌కు అపూర్వ ఆదరణ లభిస్తోందని, ఆన్‌లైన్ ద్వారా ఇప్పటివరకు రూ. అరకోటి విలువైన వస్త్రాలను విక్రయించామని ఆ సంస్థ ఎండీ గౌరీశంకర్ గురువారం తెలిపారు. ‘షాప్ డాట్ ఆప్కో ఫ్యాబ్రిక్స్ డాట్ కామ్’ ద్వారా 30 శాతం రాయితీతో వస్త్రాలను విక్రయిస్తున్నామన్నారు. దేశీయంగా ఉచిత డెలివరీ సదుపాయం ఉందన్నారు.
ఆప్కో వస్త్రాలకు దేశీయంగానే కాకుండా ఏకంగా అమెరికా, కెనడా, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, సింగపూర్, ఆస్ట్రేలియాల నుంచి కూడా ఆర్డర్స్ ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 1,200 ఆర్డర్స్‌ను డెలివరీ చేశామని వివరించారు. ఆన్‌లైన్‌లో ఆప్కో ఉత్పత్తులను లక్షన్నర మంది పరిశీలించారని, ఈ-కామర్స్ పేజీని 5 లక్షల మంది సందర్శించారని పేర్కొన్నారు. ఎక్కువ మంది చీరాల నిఫ్ట్ డిజైన్‌ను పరిశీలించారన్నారు. కేవలం రూ.30 వేలతో ఏర్పాటు చేసిన ఈ-కామర్స్ వెబ్‌సైట్‌తో ఆప్కో వస్త్రాలకు మరింత డిమాండ్ పెరిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.