జనవరి 5న జరిగే ఎన్నికల్లో అశోక్‌బాబు ప్యానల్‌ను ఓడించేందుకు వ్యతిరేక వర్గాల యత్నాలు
విభజన బిల్లు రాష్ట్రానికి చేరి సమైక్యాంధ్ర ఉద్యమవేడి మళ్లీ రాజుకుంటున్న నేపథ్యంలో.. సమైక్యవాదుల దృష్టి ఏవీఎన్జీవో సంఘంపైకి వురలుతోంది. చాలారోజుల తరువాత ఆ సంఘానికి ఎన్నికలు జరుగుతున్నారుు. ఈ నెల 22న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా.. వచ్చే నెల 5న ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో ఆ సంఘంలో ఇటు ఉద్యవువేడి, అటు ఎన్నికల వేడి పెరుగుతున్నారుు. వురోవైపు ఏపీఎన్జీవో సంఘం వుుఖ్య నేతల రాజకీయు ఉద్దేశాలపై వ్యతిరేకత పెరుగుతుండటం ఆసక్తికరంగా వూరింది. ముఖ్యంగా అశోక్‌బాబు వైఖరిపై ఉద్యోగుల్లో తీవ్రంగా చర్చ సాగుతోంది. సంఘం నిర్వహించే కార్యక్రవూలకు పార్టీల వుద్దతు తీసుకోకపోవడంపై, కీలకమైన రాజకీయు సహకారం లేకుండా ఒంటరిగా వుుందుకెళ్లాలనే అశోక్‌బాబు వైఖరిపై సంఘంలోని ఆయున వర్గం ఉద్యోగులకూ నచ్చడం లేదు. ఈ మేరకు అశోక్‌బాబు వ్యతిరేక వర్గాలు శుక్రవారం ఓ హోటల్‌లో ప్రత్యేకంగా సవూవేశమైనట్లు సవూచారం.
‘‘సమైక్యానికి కలిసిరాని పార్టీలను నిలదీయుడంలో కూడా ఉదాసీనత కనిపిస్తోంది. అలాంటి పార్టీలపై ఒత్తిడి తీసుకురాకపోవడం ఉద్దేశపూర్వకమేనని మా అనువూనం. పైగా సమైక్య ఉద్యవూనికి సారథ్యం వహిస్తున్న పార్టీల వుద్దతు కూడగట్టడంలో గానీ, కలుపుకొనిపోవడంలోగానీ నిర్లక్ష్యం కనిపిస్తోంది. తద్వారా వురింత ప్రభావవంతంగా ఉద్యవూన్ని వుుందుకు తీసుకెళ్లే అవకాశాన్ని మేమే చేజేతులా దూరం చేసుకున్నట్లరుుంది. తెలంగాణలో రాజకీయు, ఉద్యోగ, ప్రజా సంఘాలన్నీ కలిసి రాజకీయ జేఏసీగా ఏర్పడి ఉద్యవూన్ని నడిపించిన తీరు వూ నాయుకులకు అర్థం కాలేదా? లేక అర్థమైనా ఉద్దేశపూర్వకంగానే ఏకపక్షంగా ఉద్యవూన్ని నడిపించే ప్రయుత్నం జరుగుతోందా? అనేది వూ సందేహం. ఆ దిశగా వూ సంఘ నేతలు ఎందుకు చొరవ తీసుకోలేదు?’’ అని ఏపీఎన్జీవో నేతలే ప్రశ్నిస్తున్నారు. వుునుపెన్నడూ లేని విధంగా 66 రోజులపాటు సీవూంధ్రలో సాగిన ఉద్యోగుల సమ్మెను అర్ధంతరంగా ఆపేసిన తీరుపై వ్యక్తమైన సందేహాలకు ఇప్పటికీ తెరపడలేదు. ఉవ్వెత్తున ఎగిసిపడిన సమైక్యాంధ్ర ఉద్యవుస్ఫూర్తికి ఆ పరిణామం అకస్మాత్తుగా బ్రేకులు వేసిందనేది ప్రధాన వివుర్శ. సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి సుబ్బరాయన్ వంటి నేతలు అశోక్‌బాబు వైఖరిని బాహాటంగానే విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. ఇప్పటిదాకా అశోక్‌బాబు వెంట నడిచిన కొందరు ఆయున వ్యతిరేకవర్గాలవైపు చేరుతున్నారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి తదితర జిల్లాల నేతలతో ఆ వర్గాలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అశోక్‌బాబు ప్యానల్‌కు వ్యతిరేకంగా కొత్త ప్యానల్‌ను గెలిపించేందుకు 13 జిల్లాలు, 16 యూనిట్లు సిద్ధంగా ఉన్నాయని వారన్నారు. ఉద్యోగుల సమ్మెకాలపు వేతనంపైనా చర్చించకుండా నష్టపరిచారని వివుర్శిస్తున్నారు. ‘‘అశోక్‌బాబు నియంతలా వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయమ’’ని హైదరాబాద్ నగరశాఖ నేత సత్యనారాయణ శుక్రవారం విమర్శించారు. అయితే అశోక్‌బాబు వర్గం ఈ వివుర్శలను తేలికగా కొట్టిపారేస్తోంది.
ఇదీ ఎన్నికల నేపథ్యం: వాస్తవానికి ఏపీఎన్జీవో సం ఘం ఎన్నికలు జూన్‌లోనే జరగాల్సి ఉంది. కానీ, ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం లేదంటూ కొంతమంది కోర్టుకు వెళ్లడంతో.. స్టే ఇచ్చింది. దాంతో విజ యవాడలో జరిగిన రాష్ట్ర మహాసభలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి ప్రధాన కార్యదర్శిగా ఉన్న అశోక్‌బాబును అధ్యక్షుడిగాను, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. కోర్టు ఇచ్చిన సమయం ముగిసిన నేపథ్యంలో జనవరి 5న ఎన్నికలు జరుగుతాయి.