APNGO employees
-
47 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని కోరాం: టీఎన్జీవో
హైదరాబాద్: ఉద్యోగులకు 47 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు టీఎన్జీవో తెలిపింది. అలాగే ఏపీఎన్జీవోలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మధ్యంతర భృతిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సబ్ కమిటీ చెప్పినట్టు పేర్కొంది. అయితే ఏపీఎన్జీవో, టీఎన్జీవోలను విడివిడిగా చర్చలకు పిలవమని టీఎన్జీవో సూచించింది. కాగా, మధ్యంతర భృతిపై చర్చించేందుకు... ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. మంత్రి మండలి ఉప సంఘం ఈ సాయంత్రం సచివాలయంలో సమావేశమైంది. -
అశోక్‌బాబుపై ఏపీఎన్జీవో ఉద్యోగుల విమర్శలు
జనవరి 5న జరిగే ఎన్నికల్లో అశోక్‌బాబు ప్యానల్‌ను ఓడించేందుకు వ్యతిరేక వర్గాల యత్నాలు విభజన బిల్లు రాష్ట్రానికి చేరి సమైక్యాంధ్ర ఉద్యమవేడి మళ్లీ రాజుకుంటున్న నేపథ్యంలో.. సమైక్యవాదుల దృష్టి ఏవీఎన్జీవో సంఘంపైకి వురలుతోంది. చాలారోజుల తరువాత ఆ సంఘానికి ఎన్నికలు జరుగుతున్నారుు. ఈ నెల 22న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా.. వచ్చే నెల 5న ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో ఆ సంఘంలో ఇటు ఉద్యవువేడి, అటు ఎన్నికల వేడి పెరుగుతున్నారుు. వురోవైపు ఏపీఎన్జీవో సంఘం వుుఖ్య నేతల రాజకీయు ఉద్దేశాలపై వ్యతిరేకత పెరుగుతుండటం ఆసక్తికరంగా వూరింది. ముఖ్యంగా అశోక్‌బాబు వైఖరిపై ఉద్యోగుల్లో తీవ్రంగా చర్చ సాగుతోంది. సంఘం నిర్వహించే కార్యక్రవూలకు పార్టీల వుద్దతు తీసుకోకపోవడంపై, కీలకమైన రాజకీయు సహకారం లేకుండా ఒంటరిగా వుుందుకెళ్లాలనే అశోక్‌బాబు వైఖరిపై సంఘంలోని ఆయున వర్గం ఉద్యోగులకూ నచ్చడం లేదు. ఈ మేరకు అశోక్‌బాబు వ్యతిరేక వర్గాలు శుక్రవారం ఓ హోటల్లో ప్రత్యేకంగా సవూవేశమైనట్లు సవూచారం. ‘‘సమైక్యానికి కలిసిరాని పార్టీలను నిలదీయుడంలో కూడా ఉదాసీనత కనిపిస్తోంది. అలాంటి పార్టీలపై ఒత్తిడి తీసుకురాకపోవడం ఉద్దేశపూర్వకమేనని మా అనువూనం. పైగా సమైక్య ఉద్యవూనికి సారథ్యం వహిస్తున్న పార్టీల వుద్దతు కూడగట్టడంలో గానీ, కలుపుకొనిపోవడంలోగానీ నిర్లక్ష్యం కనిపిస్తోంది. తద్వారా వురింత ప్రభావవంతంగా ఉద్యవూన్ని వుుందుకు తీసుకెళ్లే అవకాశాన్ని మేమే చేజేతులా దూరం చేసుకున్నట్లరుుంది. తెలంగాణలో రాజకీయు, ఉద్యోగ, ప్రజా సంఘాలన్నీ కలిసి రాజకీయ జేఏసీగా ఏర్పడి ఉద్యవూన్ని నడిపించిన తీరు వూ నాయుకులకు అర్థం కాలేదా? లేక అర్థమైనా ఉద్దేశపూర్వకంగానే ఏకపక్షంగా ఉద్యవూన్ని నడిపించే ప్రయుత్నం జరుగుతోందా? అనేది వూ సందేహం. ఆ దిశగా వూ సంఘ నేతలు ఎందుకు చొరవ తీసుకోలేదు?’’ అని ఏపీఎన్జీవో నేతలే ప్రశ్నిస్తున్నారు. వుునుపెన్నడూ లేని విధంగా 66 రోజులపాటు సీవూంధ్రలో సాగిన ఉద్యోగుల సమ్మెను అర్ధంతరంగా ఆపేసిన తీరుపై వ్యక్తమైన సందేహాలకు ఇప్పటికీ తెరపడలేదు. ఉవ్వెత్తున ఎగిసిపడిన సమైక్యాంధ్ర ఉద్యవుస్ఫూర్తికి ఆ పరిణామం అకస్మాత్తుగా బ్రేకులు వేసిందనేది ప్రధాన వివుర్శ. సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి సుబ్బరాయన్ వంటి నేతలు అశోక్‌బాబు వైఖరిని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇప్పటిదాకా అశోక్‌బాబు వెంట నడిచిన కొందరు ఆయున వ్యతిరేకవర్గాలవైపు చేరుతున్నారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి తదితర జిల్లాల నేతలతో ఆ వర్గాలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అశోక్‌బాబు ప్యానల్‌కు వ్యతిరేకంగా కొత్త ప్యానల్‌ను గెలిపించేందుకు 13 జిల్లాలు, 16 యూనిట్లు సిద్ధంగా ఉన్నాయని వారన్నారు. ఉద్యోగుల సమ్మెకాలపు వేతనంపైనా చర్చించకుండా నష్టపరిచారని వివుర్శిస్తున్నారు. ‘‘అశోక్‌బాబు నియంతలా వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయమ’’ని హైదరాబాద్ నగరశాఖ నేత సత్యనారాయణ శుక్రవారం విమర్శించారు. అయితే అశోక్‌బాబు వర్గం ఈ వివుర్శలను తేలికగా కొట్టిపారేస్తోంది. ఇదీ ఎన్నికల నేపథ్యం: వాస్తవానికి ఏపీఎన్జీవో సం ఘం ఎన్నికలు జూన్‌లోనే జరగాల్సి ఉంది. కానీ, ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం లేదంటూ కొంతమంది కోర్టుకు వెళ్లడంతో.. స్టే ఇచ్చింది. దాంతో విజ యవాడలో జరిగిన రాష్ట్ర మహాసభలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి ప్రధాన కార్యదర్శిగా ఉన్న అశోక్‌బాబును అధ్యక్షుడిగాను, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. కోర్టు ఇచ్చిన సమయం ముగిసిన నేపథ్యంలో జనవరి 5న ఎన్నికలు జరుగుతాయి. -
50% మధ్యంతర భృతి ఇవ్వాలి: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: పదో వేతన సంఘం సిఫారసులు అమలులోకి వచ్చేందుకు ఇంకా సమయం ఉన్నందున, ప్రస్తుత అధిక ధరల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 50% మధ్యంతర భృతిని ప్రకటించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈమేరకు రేపోమాపో సీఎంను కలసి విజ్ఞాపన పత్రం ఇవ్వాలని నిర్ణయించింది. హెల్త్‌కార్డుల జారీ విషయంలో జాప్యానికి తెరదించి ఉద్యోగులు కోరినట్టుగా పరిమితిలేని చికిత్స, ఔట్‌పేషెంట్ చికిత్సకూ చోటు కల్పించే నిబంధనలతో వాటిని జారీ చేయాలని డిమాండ్ చేసింది. సోమవారం ఉద్యోగ సంఘాల జేఏసీ కార్యవర్గ సమావేశం జరి గింది. అనంతరం జేఏసీ నేతలు ఏపీ ఎన్జీఓల సంఘం భవనంలో విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అంశం పరిశీలనలో ఉన్న ప్రస్తుత తరుణంలో పదో వేతన సంఘం అమలుపై కాలయాపన తగదన్నారు. ప్రస్తుత సందిగ్ధ పరిస్థితి ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, పీఆర్సీ నివేదికపై కసరత్తును నవంబర్ 15 నాటికల్లా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. అన్ని వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యం లో పీఆర్సీ అమలు వరకు ఎదురు చూడకుండా ఉద్యోగులకు 50% మధ్యంతర భృతి ప్రకటించాలని, దీన్ని గత జూలై ఒకటి నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే మళ్లీ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమని స్పష్టంచేశారు. సమావేశంలో జేఏసీ సభ్యులు కె.నరసింహారెడ్డి, బి.వెంకటేశ్వర్లు, ఐ.వెంకటేశ్వరరావు, కె.సుబ్బారెడ్డి, ఎన్.రఘురామిరెడ్డి, యు.కుల్లాయప్ప, ఆర్.అప్పారావు, డి.జి.ప్రసాదరావు, డి.మణికుమార్, టి.వి.ఫణిపేర్రాజు, ఎన్.చంద్రశేఖరరెడ్డి, ఓబులపతి తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర ఉద్యమం ఆగదు: అసెంబ్లీని సమావేశపరచిన వెంటనే మళ్లీ సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభిస్తామని అశోక్‌బాబు తెలిపారు. ఎవరు ఒత్తిడి తెచ్చినా సమ్మెను విరమించే పరిస్థితి ఉండదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్తూ, తమను భయపెట్టి ఉద్యమాన్ని నిలువరించే స్థాయి సీఎంకు కూడా ఉందనుకోవటం లేదన్నారు. మధ్యంతరభృతి వెంటనే చెల్లించాలి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే 65% మధ్యంతరభృతి చెల్లించాలని ఏపీ నీటి పారుదల శాఖ ఎన్జీవోలు డిమాండ్ చేశారు. సంక్రాంతిలోగా పీఆర్సీని అమల్లోకి తేవాలని, గత జూలై 1 నుంచి వర్తింపజేయాలని కోరారు. ఈ మేరకు సంఘం ప్రతినిధులు సోమవారం పీఆర్సీ చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. తర్వాత సంఘం అధ్యక్షుడు పి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ పీఆర్సీ అమల్లో ప్రభుత్వ జాప్యాన్ని తప్పుపట్టారు. కాగా, విభజనపై కేంద్రం ముందుకు వెళ్తే మెరుపుసమ్మెకు దిగుతామని, ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలేస్తామని సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు హెచ్చరించారు. -
సమైక్య ఆందోళనలతో.. ప్రభుత్వాఫీసుల మూత
సీమాంధ్ర వ్యాప్తంగా మిన్నంటిన సమైక్య ఆందోళనలు సాక్షి నెట్వర్క్ : కేంద్రం టీ-నోట్‌ను ఆమోదించిన దరిమిలా ఉద్ధృతమైన సమైక్య ఉద్యమం తారస్థాయికి చేరింది. సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక, ఏపీఎన్జీవోల పిలుపు మేరకు మంగళవారం సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పోస్టాఫీసులు, బ్యాంకులను సమైక్యవాదులు, ఆందోళనకారులు మూయించారు. వైద్య ఆరోగ్య శాఖ జేఏసీ పిలుపు మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా అన్ని సేవలనూ నిలిపివేశారు. ఇక సోమవారం కూడా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలతో కోస్తా, రాయలసీమ జిల్లాలు హోరెత్తాయి. పోలవరం పనులు అడ్డగింత రాష్ర్టం ముక్కలైతే పోలవరం ప్రాజెక్టుతో ఇక పనేమిటంటూ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులను అడ్డగించారు. సోనియూగాంధీ, దిగ్విజయ్‌సింగ్ సహా విభజనవాదులందిరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఏలూరులో జపం చేశారు. విశాఖలో దీక్షలు కొనసాగుతున్నాయి. అనకాపల్లిలో ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన వ్యక్తంచేశారు. నర్సీపట్నంలో గాజువాక ఎంఎల్ఎ చింతలపూడి వెంకట్రామయ్య ఇంటిని ముట్టడించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం, వేమగిరిల్లో 250 లారీలతో భారీ ర్యాలీ చేపట్టారు. సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్) ముట్టడి రెండోరోజు కూడా కొనసాగుతోంది. అమలాపురం ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ముమ్మిడివరం, మామిడికుదురులలో ఆందోళనలు జరిగాయి. రాష్ట్రంలో రైల్వేను స్తంభింపజేస్తాం అనంతపురం జిల్లా గుంతకల్లులో రైల్వే ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. విభజన ఆపకపోతే రాష్ట్రంలో రైల్వే వ్యవస్థను స్తంభింపజేస్తామని గుంతకల్లు డివిజన్ రైల్వే జేఏసీ నేతలు హెచ్చరించారు. మడకశిరలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఇంటిని ముట్టడించారు. కర్నూలులో కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ వైద్యులు యూపీఏ ప్రభుత్వాన్ని సమాధి చేసినట్లు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పీలేరులో సీమాంధ్ర మంత్రులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో సమైక్యవాదులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళంలో డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ముగ్గురు వైద్య ఉద్యోగులు ఆమరణ దీక్ష చేపట్టారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు విద్యాసంస్థల యాజ మాన్య కమిటీ ప్రకటించింది. కోఠి ఎస్బీఐని ముట్టడించిన ఏపీఎన్జీవోలు హైదరాబాద్: ఏపీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపుపై మంగళవారం కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రధాన కార్యాలయాన్ని ఏపిఎన్జీవోలు ముట్టడించారు. తమ కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చిఎస్బీఐ ప్రధాన గేట్ వద్దకు నినాదాలు చేస్తూ దూసుకొచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏపీఎన్జీవోల సంఘం నగర అధ్యక్షుడు పివీవీ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ తమ దీక్షా శిబిరాన్ని త్వరలో ఢిల్లీకి మార్చుతామన్నారు. విద్యుత్ సబ్స్టేషన్ల దిగ్బంధం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావ్యాప్తంగా విద్యుత్ సబ్స్టేషన్ల ఎదుట సమైక్యవాదులు ఆందోళనలు చేపట్టారు. ఒంగోలులో ఉద్యోగులు ఎంపీ మాగుంట ఇంటిని ముట్టడించారు. మార్కాపురంలో చంద్రబాబు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా ఆర్టీపీపీలో ఉద్యోగుల విధుల బహిష్కరతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. పులివెందులలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. తుమ్మలపల్లి యురేనియం ప్రాజెక్టుకు విద్యుత్ నిలిపేశారు. సమైక్యాంధ్ర కోసం బలిదానం హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుంటించుకున్న వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి 11.45 మృతి చెందాడు. అనంతపురం జిల్లా చెన్నంపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ మల్లికార్జున్నాయక్(35) ఈ నెల 6న కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మరోవైపు, విభజన కలతతో సీమాంధ్రలో నలుగురు గుండె పోటుతో మృతిచెందారు. లగడపాటిపై ఫిర్యాదు ఎంపీ లగడపాటి రాజగోపాల్ కనబడటం లేదంటూ విద్యార్థి, పొలిటికల్ జేఏసీల నాయకులు విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరులో జరిగిన సమైక్య శంఖారావం కార్యక్రమానికి వేలాదిగా విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే, ఎమ్మెల్యే మల్లాది విష్ణును న్యాయవాదులు అడ్డుకున్నారు. పదవికి రాజీ నామా చేయాలంటూ బార్ అసోసియేషన్ నేతలు నిలదీయగా, అంతుచూస్తానంటూ విష్ణు బెదిరించడంతో న్యాయవాదులు తిరగబడ్డారు. -
6వ తేదీన ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతాం : ఏపీఎన్జీఓలు
-
‘సమైక్య’ పార్టీలకే ప్రజల మద్దతు: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: సమైక్యవాదానికి కట్టుబడే పార్టీలకే వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆదరణ, మద్దతు లభిస్తాయని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. సమై క్య ఉద్యమం రాజకీయాలకు అతీతంగా సాగుతోందన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, నగర శాఖ అధ్యక్షుడు సత్యనారాయణతో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి అవసరమైతే జగన్‌ను తప్పకుండా కలుస్తాం. దీనిపై జేఏసీ కార్యవర్గం నిర్ణయం తీసుకుంటుందని ఒక ప్రశ్నకు జవాబుగా అశోక్‌బాబు చెప్పారు. శనివారం విశాఖలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నామన్నారు. ఆదివారం కర్నూలులో జరగనున్న సభకు తరలిరావాలన్నారు. సమ్మె కొనసాగిస్తాం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు సమ్మె కొనసాగించాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌లో కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యవర్గంతో పాటు అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, వీఆర్వో, వీఆర్ఏ సంఘాల ప్రతినిధులూ ఇందులో పాల్గొన్నారు. సమావేశం అనంతరం తీర్మానాలను వెంకటేశ్వర్లు వెల్లడించారు. వాటిల్లో ముఖ్యమైనవి: ముఖ్యమైన విధులకు సిబ్బంది హాజరుకావాలని కలెక్టర్ల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. అయినా విధుల్లో చేరే ప్రసక్తే లేదు. దసరా ఉత్సవాల్లోనూ పాల్గొనబోము జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు బ్యాంకు రుణాలు ఇప్పించడానికి రెవెన్యూ అధికారులు సహకరించాలి. -
యుద్ధానికి సిద్ధమే: దేవీప్రసాద్
ఖమ్మం, న్యూస్‌లైన్ : ‘ఆరు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు చేస్తున్న ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చింది. దీనిపై సీమాంధ్ర ప్రజలు రాద్ధాంతం చేస్తున్నారు. మేం శాంతియుతంగా విడిపోదాం అంటుంటే.. వారు యుద్ధం చేయాలంటున్నారు.. యుద్ధమే చేయాలనుకుంటే మేమూ సిద్ధమే’ అని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఖమ్మంలో శుక్రవారం ఆయన విలేకరులతో, టీఎన్జీవోల సభలో మాట్లాడుతూ, మీరు సమ్మె చేయండి.. మీ జీతాలు మీకిప్పిస్తామని సీమాంధ్ర ఉద్యోగులకు ఓ మంత్రి భరోసా ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. చర్చలకు రమ్మని ఏపీఎన్జీవో ఉద్యోగులు పిలుస్తున్నారని, విభజన తర్వాతే వస్తామన్నారు. ఏపీఎన్జీవోల వైఖరివల్లే పీఆర్సీ అందకుండా పోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులకు దసరాలోపు 45 శాతం ఇంటీరియం చెల్లించాలని, లేనిపక్షంలో టీజేఏసీ ఆధ్వర్యంలో అక్టోబరులో మహోద్యమం చేపడతామని హెచ్చరించారు. గ్రామీణ వ్యవస్థకు పునాది అయిన గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ తీరు వివక్షతపూరితంగా ఉందని దేవీప్రసాద్ విమర్శించారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల కేంద్ర సంఘం ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. గ్రామ సహాయకులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి, రూ.15 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, విఠల్ తదితరులు మాట్లాడారు. -
రాజధాని రూట్లో ఉద్యోగులు
సాక్షి నెట్వర్క్: రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌లో శనివారం జరగనున్న ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సుకు హాజరయ్యేందుకు సీమాంధ్ర జిల్లాల నుంచి వేలాదిమంది ప్రభుత్వోద్యోగులు తరలివెళ్లారు. రోడ్డు, రైలు మార్గాల ద్వారా శనివారం ఉదయానికల్లా రాజధానికి చేరుకోనున్నారు. ఆర్టీసీ బస్సుల బంద్‌తో వందలాది ప్రైవేట్ బస్సులు, ట్రావెల్స్ వాహనాలను వారు అద్దెకు తీసుకున్నారు. ఇక సీమాంధ్ర జిల్లాల మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్ చేరుకునే రైళ్లన్నీ శుక్రవారం ఉద్యోగులతో కిటకిటలాడాయి. కొంతమంది రెండురోజుల ముందుగానే హైదరాబాద్ చేరుకోగా, ఒక్క శుక్రవారం రోజునే వేలాదిమంది రాజధానికి బయలుదేరారు. ఒక్క గుంటూరుజిల్లా నుంచే పదివేల మందికి పైగా ఉద్యోగులు హాజరవుతున్నట్టు అంచనా. శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో జిల్లాకు చెందిన 500 మందికిపైగా ఉద్యోగులు సదస్సుకు బయల్దేరారు. గుంటూరు స్టేషన్ నుంచి రాత్రి 10.30 గంటలకు ప్రత్యేక రైలులో 2వేల మంది ప్రయాణమయ్యారు. ఇక శనివారం ఉదయం పిడుగురాళ్ల నుంచి సికింద్రాబాద్ వరకూ నడిచే ఎంఎంటీఎస్ రైల్లోనూ మరో 1200 మంది వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. విజయనగరం జిల్లా నుంచి గరీబ్థ్,్ర విశాఖ, ఫలక్‌నుమా, గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు నాలుగు బస్సుల ద్వారా సుమారు 2,500 మంది ఉద్యోగులు తరలి వెళ్లారు. విశాఖ జిల్లా నుంచి 3,750 మంది ఉద్యోగులు 28 ప్రత్యేక బస్సుల్లోనూ, మరో వెయ్యిమంది వివిధ రైళ్లలోనూ పయనమయ్యారు. ప్రకాశం నుంచి 3 వేల మంది, అనంతపురం నుంచి 5 వేల మంది, శ్రీకాకుళం జిల్లా నుంచి వేయి మంది, కృష్ణాజిల్లా నుంచి ఎనిమిది వేల మంది ఉద్యోగులు తరలివెళ్లినట్లు అంచనా.