హైదరాబాద్: ఉద్యోగులకు 47 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు టీఎన్జీవో తెలిపింది. అలాగే ఏపీఎన్జీవోలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మధ్యంతర భృతిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సబ్ కమిటీ చెప్పినట్టు పేర్కొంది. అయితే ఏపీఎన్జీవో, టీఎన్జీవోలను విడివిడిగా చర్చలకు పిలవమని టీఎన్జీవో సూచించింది.
కాగా, మధ్యంతర భృతిపై చర్చించేందుకు... ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. మంత్రి మండలి ఉప సంఘం ఈ సాయంత్రం సచివాలయంలో సమావేశమైంది.