12 న ఏపీడీఆర్‌సీ ప్రవేశ పరీక్ష | aprdc entrance exam om may 12 th | Sakshi
Sakshi News home page

12 న ఏపీడీఆర్‌సీ ప్రవేశ పరీక్ష

Published Mon, May 9 2016 8:46 PM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM

aprdc entrance exam om may 12 th

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల 12న ఏపీఆర్‌డీసీ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. నాగార్జున సాగర్, కర్నూలు జిల్లాల్లోని డిగ్రీకళాశాలల్లో ప్రవేశానికి తెలంగాణ నుంచి 425మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణ నిమిత్తం హైదరాబాద్‌లో సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్(సికింద్రాబాద్)ను, వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల(హన్మకొండ)పరీక్షాకేంద్రాలుగా ఎంపిక చేసినట్లు సెట్ కన్వీనర్ సోమవారం తెలిపారు. హాల్‌టికెట్లు అందని అభ్యర్థులు www.aprs.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటలవరకు పరీక్ష జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement