
సాక్షి, అమరావతి: ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ చేసిన చట్టానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ పేరిట ఉత్తర్వులు విడుదల చేసింది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ‘ఏపీ ఆర్టీసీ చట్టం-2019’ బిల్లును శాసనసభ ఇటీవల ఆమోదించింది. ప్రభుత్వం తీసుకువచ్చే ఏపీఎస్ ఆర్టీసీ విలీనం చట్టం ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న ఆర్టీసీ పూర్తిగా ప్రభుత్వ సంస్థగా అవతరించనుంది. దీంతో 52 వేలమంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణింపబడనున్నారు. ఇక ఆర్టీసీ విలీనానికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ నొటిఫికేషన్‌ను జారీ చేయనుంది.
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో జారీ చేసినందుకు నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: విలీనం రైట్ రైట్)
Comments
Please login to add a commentAdd a comment