RTC merger
-
జీతాలపై దుష్ప్రచారం చేస్తున్నారు
సాక్షి, అమరావతి: వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఉద్యోగుల జీతాల విషయంలో ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చాక అదనంగా రెండున్నర లక్షలమందికిపైగా ఉద్యోగాలు ఇచ్చిందని, వారంతా ప్రభుత్వంలో కొత్తగా చేరిన విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఆర్టీసీ విలీనం వల్ల వారు ప్రభుత్వ ఉద్యోగులయ్యారని, గ్రామ సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించాయని, వీటివల్ల జీతాల భారం పెరిగిందని వివరించారు. ప్రభుత్వ సొంత ఆదాయం ఏడాదికి రూ.1.25 లక్షల కోట్ల మేర వస్తుంటే, రూ.90 వేల కోట్లు జీతాలకే సరిపోతోందని చెప్పారు. సీపీఎస్ రద్దు అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు. ఈ నెలాఖరులోగా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.3 వేల కోట్లకుపైగా చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. పీఆర్సీ బకాయిల చెల్లింపులపై ఈ నెల 16వ తేదీన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. కానీ బయటకు వెళ్లాక ఉద్యమాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. -
ఏపీఆర్టీసీ విలీనానికి గవర్నర్ ఆమోదం
సాక్షి, అమరావతి: ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ చేసిన చట్టానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ పేరిట ఉత్తర్వులు విడుదల చేసింది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ‘ఏపీ ఆర్టీసీ చట్టం-2019’ బిల్లును శాసనసభ ఇటీవల ఆమోదించింది. ప్రభుత్వం తీసుకువచ్చే ఏపీఎస్ ఆర్టీసీ విలీనం చట్టం ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న ఆర్టీసీ పూర్తిగా ప్రభుత్వ సంస్థగా అవతరించనుంది. దీంతో 52 వేలమంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణింపబడనున్నారు. ఇక ఆర్టీసీ విలీనానికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ నొటిఫికేషన్‌ను జారీ చేయనుంది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో జారీ చేసినందుకు నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: విలీనం రైట్ రైట్) -
బాబు ఏనాడు ఆర్టీసీకి మేలు చేయలేదు
-
అంత ఆందోళన వద్దు రామానాయుడు గారూ..
-
ఇక 52వేలమంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులే
-
‘అందుకే కొత్త చట్టం తెచ్చాం’
సాక్షి, అమరావతి : పాదయాత్రలో ఆర్టీసీ కార్మికుల కష్టాలను ప్రత్యేక్షంగా చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే విలీన హామీని నెరవేర్చారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆర్టీసీ విలీనం బిల్లును సోమవారం ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ.. జనవరి 1లోపు ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్త చట్టం తెచ్చామన్నారు. 1997లో చంద్రబాబు నాయుడు తెచ్చిన చట్టం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో కలిపేందుకు అడ్డంకిగా మారిందని, అందుకే కొత్త చట్టం తెచ్చామని మంత్రి వివరించారు. విలీనానికి బోర్డు కూడా అంగీకారం తెలిపిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి కొత్తగా ప్రజారవాణా విభాగం ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. 200 రోజుల్లో ఆర్టీసీని విలీనం చేసిన ఘనన సీఎం జగన్‌కు దక్కిందని ప్రశంసించారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు పెంచిన జీతాలను బకాయి పెడితే.. వాటినికి చెల్లించామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. బాబు ఏనాడు ఆర్టీసీకి మేలు చేయలేదు చంద్రబాబు నాయుడు ఏనాడు ఆర్టీసీ కార్మికులకు మేలు చేయలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. ప్రైవేటీకరణ అంటేనే చంద్రబాబుకు ఇష్టమని విమర్శించారు. పాదయాత్రలో ఆర్టీసీ కార్మికుల కష్టాలకు ప్రత్యేక్షంగా చూసిన సీఎం జగన్.. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. -
ఇకపై ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులే
సాక్షి, అమరావతి: జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... 52వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. అధికారంలో ఉన్న అయిదేళ్లపాటు చంద్రబాబు ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ రంగ సంస్థల్లోని ఉద్యోగులు... ప్రభుత్వంలో విలీనం కాకుండా గతంలో చంద్రబాబు చట్టం తెచ్చిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1997లో చంద్రబాబు తెచ్చిన చట్టం అడ్డంకిగా మారిందని, అందుకే ఆర్టీసీ విలీనం కోసం చారిత్రాత్మక బిల్లును ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. అంత ఆందోళన వద్దు రామానాయుడు గారూ.. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై రవాణా, సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని సమాధానం ఇస్తూ...‘ఛార్జీల పెంపు వల్ల ప్రజలు ఆర్టీసీకి దూరం అయిపోతున్నారని రామానాయుడుగారు బాధపడుతున్నారు. మీరు విచారం వ్యక్తం చేసేంతగా ఏం జరగడం లేదు. ఆయన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఛార్జీల పెంపుతో ప్రజలు బస్సులు ఎక్కడం మానేయలేదు. ఇవాళ మీరు కంగారు పడేంతగా సామాన్యుల మీద భారం పడలేదు. స్వల్పంగా ఛార్జీలు పెంచాం. దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా తక్కువ ఖర్చుతోనే ప్రజలను ఆర్టీసీ వారి గమ్యస్థానాలకు చేర్చుతోంది’ అని తెలిపారు. -
మాకు మద్దతివ్వండి...
-
‘విలీనం’ వదులుకుంటాం : ఆర్టీసీ జేఏసీ
సుందరయ్య విజ్ఞానకేంద్రం(హైదరాబాద్) : ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని, ఇకకైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. గురువారమిక్కడి ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో అఖిలపక్ష నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు చేసిన సూచనలను తిరస్కరించడం ద్వారా ప్రభుత్వం కోర్టులను తప్పు దోవ పట్టించిందని ఆరోపించారు. విలీనం చేస్తేనే చర్చలకు వస్తామంటున్నామని, విలీన డిమాండ్‌పై పట్టు వీడడం లేదంటూ తమపై దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను వదులుకుంటున్నామని, ఇతర డిమాండ్లపై ప్రభుత్వం కార్మిక సం ఘాలతో చర్చలు జరపాలని కోరారు. 23 మంది కార్మికుల ఆత్మహత్యలు, మరణాలకు ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నా.. ఇప్పటివరకు ఒక్క ఎమ్మెల్యే గానీ, ఒక మంత్రి గానీ పరామర్శించడం, సానుభూతి ప్రకటించకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాకు మద్దతివ్వండి... ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తే ఆర్టీసీ కార్మికుల కన్నా ప్రజలే ఎక్కువ నష్టపోతారని, తమ ఇష్టానుసారం చార్జీలు పెంచుకుంటూ వెళతారని అశ్వత్థామరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు ప్రజా, ఉద్యోగ, నిరుద్యోగ తదితర సంఘాలు సంపూర్ణ మద్ధతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు మనోధైర్యం కోల్పోయి ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ట్యాంక్‌బండ్ బంద్‌ను విజయవంతం చేసిన కార్మికులకు, తమకు మద్ధతు ప్రకటించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమ్మెలో భాగంగా శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు తాము నిర్వహించతలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని అశ్వత్థామరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ నేత వీహెచ్, బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, మోహన్‌రెడ్డి, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర్, న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్ధన్, సూర్యం, డీజీ నర్సింగ్‌రావు, ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి, థామస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జేఏసీ ఆందోళన కార్యక్రమాలివే.. 15న గ్రామాల్లో బైక్ ర్యాలీలు 16న సామూహిక నిరాహార దీక్షలు, వీటికి మద్దతుగా డిపోల ముందు బైక్ ర్యాలీలు 17, 18న అన్ని బస్ డిపోల ముందు సామూహిక దీక్షలు 19న హైదరాబాద్–కోదాడ జాతీయ రహదారిపై సడక్‌బంద్ -
ఆర్టీసీ విలీనానికి ఓకే!
సాక్షి, అమరావతి : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదముద్ర పడింది. సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణబాబు అధ్యక్షతన శుక్రవారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎజెండాలో ప్రాధాన్యాంశంగా ఆర్టీసీ విలీన ప్రక్రియను చేర్చి దానిని ఆమోదిస్తూ పాలక మండలి తీర్మానం చేసింది. విలీనానికి ముందు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్ (పీటీడీ) ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలు, కమిటీ నియామకాలకూ ఆమోదం తెలిపింది. అలాగే, తొలి విడతగా 350 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్స్టేషన్లలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల నిర్వహణకు సంబంధించి లైసెన్సుల పొడిగింపునూ ఆమోదించారు. సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు.. - బ్రెడ్ విన్నర్ స్కీం కింద (ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ చనిపోయిన కుటుంబాల వారసులకు ఉద్యోగం ఇచ్చే విధానం) దరఖాస్తుల గడువును తగ్గించేందుకు ప్రతిపాదనలను ఆమోదించారు. - ఆర్టీసీని కంప్యూటరీకరణ చేస్తున్నందున జూనియర్ అసిస్టెంట్ (స్టాటిస్టిక్స్) పోస్టుల్ని రద్దుచేశారు. - విశాఖలోని ఎంవీపీ బస్‌స్టేషన్‌లో ఈస్ట్‌కోస్ట్ రైల్వేస్ నిర్వహిస్తున్న రిజర్వేషన్ కౌంటర్ లైసెన్సును మూడేళ్లు, అనంతపురం జిల్లా పుట్టపర్తి బస్‌స్టేషన్‌లో సౌత్ వెస్ట్రన్ రైల్వేస్ రిజర్వేషన్ కౌంటర్ లైసెన్సును పదేళ్లు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బస్‌స్టేషన్‌లో సివిల్ కోర్టు నడిపేందుకు లైసెన్సును మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ బోర్డు నిర్ణయించింది. - విజయవాడ పాత బస్టాండ్ వద్ద 2,836 చదరపు మీటర్ల ఆర్టీసీ స్థలాన్ని బీఓటీ పద్ధతిలో అభివృద్ధికి ఉద్దేశించిన లీజు అగ్రిమెంట్ రద్దుకు బోర్డు ఆమోదించింది. -
సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన కేశినేని నాని
-
ఏపీ సీఎం జగన్ సక్సెస్ అయ్యారు: కేశినేని నాని
సాక్షి, విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని స్వాగతించారు. ఆయన గురువారమిక్కడ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ అయ్యారని అభినందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. ఆర్టీసీని కాపాడటాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందన్నారు. లాభాలు వచ్చే మార్గాల్లో ప్రయివేట్ బస్సులు నడుపుతారని, నష్టాలు వచ్చే మార్గంలో ప్రయివేట్ ఆపరేటర్లు బస్సులు నడపరని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని కేశినేని నాని అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలన్న కాన్సెప్ట్ చాలా గొప్పదన్నారు. మంచిపని చేశారని తనకు అనిపించింది కాబట్టే చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. మంత్రి పేర్ని నాని కుటుంబం కార్మిక పక్షపాతి అని ప్రశంసించారు. చదవండి: ఆర్టీసీ విలీనంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం -
విలీనానందం
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకారం తెలిపారు. ఇకపై ఆర్టీసీ ఉద్యోగులు అంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి అధ్యక్షతన నియమించిన కమిటీ.. తన నివేదికను సీఎం జగన్‌కు అందజేసిం ది. నిపుణుల కమి టీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఆర్టీసీ లో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని నిర్ణయించారు. ముఖ్య మంత్రి జగన్ బుధవారం అధికారికంగా ఆర్టీసీ విలీనాన్ని ప్రకటిస్తుండడంతో కార్మికసంఘాలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. రాష్ట్ర విభజన సమయంలో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయింది. నష్టాల్లోంచి గట్టెక్కాలంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని నాటి నాటి ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు పద్మాకర్ సూచించారు. నాటి నుంచి ఈ విషయంలో కార్మిక వర్గాలు పోరాడుతూనే ఉన్నాయి. సంకల్ప యాత్రలో భాగంగా ఈ సమస్యను వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాం. సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసి, మూడు నెలల్లోనే విలీనం చేస్తామన్నారు. అనుకున్నట్టే హామీ నిలబెట్టుకుంటున్నారు. ఆయన రుణం ఎప్పటికీ మర్చిపోం. – కేజే శుభాకర్, రాష్ట్ర కార్యదర్శి, ఎంప్లాయిస్ యూనియన్ సీఎం నిర్ణయం అభినందనీయం.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహోసపేత నిర్ణయంపై కార్మిక వర్గాల్లో ఆనందం ఉప్పొంగుతోంది. ఆయనకు మేమంతా రుణపడి ఉంటాం. – అల్లు సురేష్‌నాయుడు, రీజనల్ కార్యదర్శి, విశాఖ రీజియన్ సాహసోపేత నిర్ణయం.. ఏపీఎస్ ఆర్టీసీని కార్పొరేషన్ స్థాయి నుంచి ప్రభుత్వంలోనే విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి యావత్ ఆర్టీసీ కార్మిక వర్గం రుణపడి ఉంటుంది. విశాఖ రీజనల్ పరిధిలోనే గాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, రీజనల్ పరిధిల్లో నష్టాలను, ఆస్తులను గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు అధ్యయనం చేసినా ఆచరణలో విఫలమయ్యాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంకాగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకోవడంతో మా చిరకాల కోరిక నెరవేరబోతోంది. విలీనం కోసం ఎన్ఎంయూ చాలా ఏళ్లుగా కృషి చేస్తోంది. జగన్మోహన్రెడ్డి ఉద్యోగుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు అందరిలో హర్షం వ్యక్తమవుతోంది. – ఏకే శివాజి, అర్బన్ డివిజన్ కార్యదర్శి, నేషనల్ మజ్దూర్ యూనియన్ శుభపరిణామం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం శుభపరిణామం. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకోలేకపోయాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు ఆర్టీసీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. విలీనం కారణంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు పలు ప్రయోజనాలు చేకూరతాయి. – జీపీ రావు, ప్రచార కార్యదర్శి, వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ జగన్‌కు రుణపడి ఉంటాం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ మంగళవారం సాయంత్రం పలు టీవీ చానల్లో వస్తున్న స్క్రోలింగ్ చూసి ఎంతో సంబరపడ్డాను. కేబినెట్ తొలి సమావేశంలోనే ఆర్టీసీపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీ వేయడం. ఆ కమిటీ మూడు నెలల్లోనే నివేదికను ప్రభుత్వానికి అందజేయడం, ఆపై జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడం ప్రతి కార్మికుడు, ఉద్యోగి సంతోషపడ్డ విషయమే. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులే. ప్రతి కార్మికుడు, ఉద్యోగి జగన్‌కు రుణపడి ఉంటాం. – బి.అరుణ రాజేశ్వరి, ఆర్టీసీ ఉద్యోగి, మధురవాడ మా కల నిజమవుతోంది.. ఎప్పుడూ నష్టాల పేరిట మా శ్రమను దోచుకున్న పరిస్థితి నుంచి ప్రభుత్వ హయాంలో పనిచేయడం వింటుంటే కలా..నిజమా అనిపిస్తోంది. మా కలను ముఖ్యమంత్రి నెరవేర్చారు. కొండంత అప్పుల్లో మునిగి ఉన్న ఆర్టీసీ ఈ రోజు జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ప్రగతిబాటలో నడవడం ఖాయం. మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులమనే ఫీలింగ్ గొప్పగా ఉంది. పాదయాత్రలో జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు. – కేఎస్ఎస్ మూర్తి, సహాయ కార్యదర్శి, విశాఖ రీజియన్ -
ఆర్టీసీ ఉద్యోగుల్లో నయాజోష్
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలుకు సోమవారం క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో ప్రకటించగా, నాడు ఆర్టీసీ కార్మిక వర్గాలు హర్షం తెలిపాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మరొక హామీని అమలు చేసేందుకు క్యాబినెట్ సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ముఖ్యమంత్రి ప్రజా సంకల్పయాత్రలో ప్రకటించారు. దీనిపై అప్పట్లోనే ఆర్టీసీ కార్మిక వర్గాలు హర్షం తెలిపాయి. ఈ హామీ అమలుకు తొలి అడుగు సోమవారం పడింది. ఆర్టీసీ విలీనా నికిప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. లాభనష్టాలతో భేరీజు వేయకుండా మానవతా దృక్పథంతో విలీ నంపై నిర్ణయం తీసుకోవాలని క్యాబినెట్‌కు సీఎం జగన్ వివరించారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు తెలిపారు. జిల్లాలో 6,500 మంది కార్మికులకు లబ్ధి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కృష్ణా రీజియ న్లో సుమారు 6,500 మంది కార్మికులకు మేలు జరుగుతుందని ఆర్టీసీ కార్మిక వర్గాలు చెబుతున్నాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించారు. అప్పట్లో సుమారు 2000 మందికి మేలు జరి గింది. వైఎస్ మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ఉద్యోగస్తులపై ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు. ప్రస్తుతం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కార్మికులకు ప్రభుత్వాలకు మేలు జరుగుతుంది. వాస్తవంగా ఆర్టీసీ కార్పొరేషన్‌గా వుండటంతో సిబ్బందికి ఇంక్రిమెంట్లు, ఇతర సౌకర్యాలు కావాలంటే పోరాడాల్సిన పరిస్థితి ఉంది. అదే ప్రభుత్వంలోకి వెళ్లితే మిగిలిన ప్రభుత్వశాఖల్లోని సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చే ఐఆర్, ఇంక్రిమెంట్లు ఆర్టీసీ కార్మికులకు వర్తిస్తాయని కార్మికులు ఆర్థిక స్థితిగతులు బాగు పడతాయని ఆ సంఘా ల నాయకులు చెబుతున్నారు. నష్టాల బాటలో కృష్ణా రీజియన్ కృష్ణా రీజియన్‌లో ఆర్టీసీకి గతేడాది రూ.60 కోట్ల నష్టం వచ్చింది. ప్రయాణికుల సంక్షేమంగా పని చేస్తున్న ఆర్టీసీ మారుమూల గ్రామాలకు బస్సులు నడుపుతోంది. అలాగే ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా వున్నప్పటికీ బస్సులు నడుపుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో రూ.7 కోట్ల వరకు నష్టం వచ్చిందని తెలిసింది. కృష్ణా రీజియన్ పరిధిలో 14 ఆర్టీసీ బస్సు డిపోలు ఉండగా, విజయవాడ, ఆటోనగర్, మచిలీపట్నం డిపోలు మినహా మిగిలినవి నష్టాల బాటలోనే నడుస్తున్నాయి. గతంలో ఇటువంటి డిపోలను ఆర్టీసి మూసి వేయడానికి నిర్ణయించింది. ప్రస్తుతం విలీనం జరిగితే డిపోలు మూత పడవు. అలాగే కృష్ణా రీజియన్‌కు నష్టం వచ్చినా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించి, ఉద్యోగస్తులకు పూర్తి భద్రత కల్పించడంతో పాటు ప్రజలకు ఆర్టీసీని మరింత చేరువుగా తీసుకు వెళ్లేందుకు ఉపయోగపడుతుందని కార్మిక సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి. ఆర్టీసీ విలీలానికి సూత్రపాయంగా ప్రభుత్వం అంగీకరించడంతో భవిష్యత్‌లో తామంతా ప్రభుత్యోగులుగా మారతామని, తమ కష్టాలు తీరిపోతాయని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
రవాణాకు రాజయోగమే
సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను పరిరక్షించడంలో ప్రభుత్వం అంతంత మాత్రంగానే కృషి చేస్తోంది. రాష్ట్రంతోపాటు జిల్లాలోని అనేక డిపోలు నష్టాల బాటలోపయనిస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. చివరకు కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిందా అంటే అది కూడా నామ మాత్రమేనని చెప్పక తప్పదు. ప్రతినిత్యం లక్షలాది మంది ప్రయాణం చేసే ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లతోపాటు ఇతర ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందరినీ సురక్షితంగా గమ్యస్థానం చేర్చే ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు కనిపించడం లేదు. ఆర్టీసీ సంస్థకు సంబంధించిన కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా సంస్థలో పనిచేస్తున్న అందరికీ ప్రయోజనాలు ఒనగూరుతాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో పాదయాత్రలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మికుల సమస్యలపై సమరశంఖం పూరించారు. పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని విలీనం చేస్తామని ప్రకటించారు. 30 ఏళ్ల వారికి రాని రూ. 5 వేల పింఛన్ ఎన్నో ఏళ్లపాటు సంస్థను నమ్ముకుని...అంకితభావంతో పనిచేసినా పింఛన్ల విషయంలో అన్యాయం జరుగుతోంది. 30 ఏళ్లపాటు సర్వీసులో ఉండిన తర్వాత పదవీ విరమణ చేసిన వారికి కూడా రూ. 5 వేలు అందని పరిస్థితి నెలకొంది. ఇన్నేళ్లు సంస్థకోసం, ప్రజల కోసం పనిచేసినా అనుకున్న మేర రాకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతకష్టపడినా చివరి మజిలీలో కూడా రావాల్సిన పింఛన్ అంతంత మాత్రం వస్తే వారి కష్టాలు దేవుడెరుగు. నిబంధనలు సర్కారువీ..నష్టాలు ఆర్టీసీవీ.... ఆర్టీసీ సంస్థకు సంబంధించి పలు విభాగాల వ్యవహారాలు ప్రభుత్వ అనుమతితోనే జరుగుతున్నా నష్టాలకు మాత్రం సంస్థ బాధ్యత వహించాల్సి వస్తోంది. వేతనాల సవరణ, నియామకాలు, ఛార్జీల పెంపు తదితర వాటి విషయంలో పెత్తనం చెలాయిస్తున్న ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి మాత్రం పెద్దపీట వేయలేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. అలాగే నష్టాల్లో ఉన్న డిపోలను గట్టెక్కించే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడాన్ని పలువురు ఎత్తి చూపుతున్నారు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఆర్టీసీలో వేతనాలు తక్కువ 2015 మే నెలలో ఆర్టీసీ సంస్థకు సంబంధించిన ఉద్యోగులు జీతాలు సరిపోక సమ్మెకు దిగితే 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. ఫిట్మెంట్ ఇచ్చినా ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఆర్టీసీ కార్మికుల జీతాలు 60 శాతం తక్కువగా ఉన్నాయి. చంద్రబాబు కార్మిక సంస్థలను ఆదుకుంటామని ప్రకటించినా ఇప్పటివరకు అతీగతీ లేదు. పైగా ఆర్థిక మంత్రి నేతృత్వంలో ఉపసంఘం ఏర్పడినా కార్మికులకు మాత్రం న్యాయం జరగడం లేదు.అరకొర వేతనాలతోనే కార్మికులు కాలాన్ని వెళ్లదీస్తున్నారు. అధికారంలోకి వస్తే ఆర్టీసీ విలీనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని విలీనం చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో కార్మికులు సంబరాలు నిర్వహించుకుంటున్నారు. పలు డిపోల పరిధిలో స్వీట్లు పంపిణీ చేశారు. ఇబ్బందులు ఎదురైనా నెట్టుకొని వస్తున్న వీరి జీవితాల్లో విలీనంతోనే వెలుగు లభిస్తుందని వారు ఆశపడుతున్నారు. వైఎస్సార్ మజ్దూర్ యూనియన్‌తోపాటు కార్మికులు వైఎస్ జగన్ నిర్ణయంపట్ల తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్‌తోనే ఆర్టీసీకి మనుగడ: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అటు కార్మికులతోపాటు ఇటు సంస్థకు మేలు జరుగుతుంది. అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఖాయం. ఆర్టీసీలో కార్మికులంతా కష్టపడి పనిచేస్తున్నా అంతంత మాత్రం జీతాలతో ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్‌ను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు.నష్టాల్లో ఉన్న డిపోలను ఆదుకోవడంగానీ, ఆర్థికంగా చేయూత అందించడంగానీ చేయడం లేదు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తేనే అందరికీ ప్రయోజనం ఉంటుంది. వైఎస్ జగన్ మాట తప్పడని, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీకి మంచి రోజులు రానున్నాయి. – పి.రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షులు సంతోషదాయకం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సార్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పడం సంతోషదాయకం. ఈ విషయం గురించి పోరాటాలు చేస్తున్నా పట్టించుకొనేవారు లేదు. దీనివల్ల ఆర్టీసీకి తీవ్ర నష్టం వస్తుంది. ప్రభుత్వమే నడిపిస్తే లాభాలబాట పయనిస్తుంది. – ఆర్.వీ వాసు, కండక్టర్ ,మైదుకూరు డిపో ఎన్నో ఏళ్ల కల ఆర్టీసీ కార్మికుల ఎన్నో ఏళ్ల కల వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడంతో ఫలిస్తుంది. చాలీచాలని జీతాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న ఆర్టీసీ కార్మికులందరికి ఈ ప్రకటన సంతోషకరమైంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులు అన్న మాట అనుకుంటేనే ఆనందంగా ఉంది. – ఫకృద్దీన్, ఆర్టీసీ కార్మికుడు, ప్రొద్దుటూరు. వైఎస్సార్సీపీకి అండగా ఉంటాం.. ప్రభుత్వానికి ఆర్టీసీని విలీనం చేయాలంటూ ఏళ్లతరబడి చేస్తున్న పోరాటాలకు వైఎస్ జగన్‌రెడ్డి హామీ ఇవ్వడం శుభపరిణామం. కార్మికుల పక్షాన నిలిచిన వైఎస్ జగన్‌కు తప్పక అండగా ఉంటాం. భవిష్యత్‌లో వైఎస్సార్సీపీకి అండగా నిలుస్తాం. – మరియమ్మ(ఆర్టీసీ కండక్టర్), పులివెందుల -
అధికారంలోకి వస్తే
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం నెహ్రూనగర్ : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తథ్యమని కమలాపురం ఎమ్మెల్యే, ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ పార్టీ అధినేత జగన్‌మెహన్‌రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 18వ తేదీ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం ఆయన గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గుంటూరు రీజియన్ అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోల్‌సేల్‌గా ఆర్టీసీని సేల్ చేసేందుకు కాచుకొని ఉన్నట్లు ఆరోపించారు. యూనియన్లు బలహీనపడిన నేపథ్యంలో బాబు ఆర్టీసీ కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు ఆర్టీసీ ఇంత వరకు బతికి ఉందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పుణ్యమేనన్నారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న జగన్ కూడా ఆర్టీసీ కార్మికులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో వచ్చిన గుర్తింపు ఎన్నికలను దానికి చక్కని వేదికగా మలచుకోవాలని రవీంద్రనాథ్‌రెడ్డి ఇటు పార్టీ నేతలకు, అటు కార్మికులకు పిలుపునిచ్చారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కార్మిక వ్యతిరేకని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఇకపై సహించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. కార్మికులకు అండగా నిలిచి ఆర్టీసీని పరిరక్షిం చుకునేందుకు ఎన్నిక ల బరిలో దిగుతున్నట్లు వెల్లడిం చారు. జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవడం ఖాయమని స్పష్టం చేశారు. నర్సరావుపేట ఎమ్యెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆదుకోవాల్సిందిపోయి పన్నుల పేరుతో వేధిస్తూ మరింత నష్టాల్లోకి నెడుతోందని నిందించారు. మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఓ వైపు ఆర్టీసీ చార్జీలు పెంచకుండా మరోవైపు ఆర్టీసీకి నష్టాలు రాకుండా భారమంతా ప్రభుత్వంపైనే వేసుకొని ప్రజోపయోగ రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దారని తెలిపారు.గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మ ద్ ముప్తఫా మాట్లాడుతూ ఆర్టీసీ పరిరక్షణకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ కన్వీనర్ రావి వెంకటరమణ, పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, తెనాలి కన్వీనర్ అన్నాబత్తుని శివకమూర్, పెదకూరపాడు కన్వీనర్ పాణ్యం హానిమిరెడ్డి పాల్గొన్నారు.