ఇక​ 52వేలమంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులే | Andhra Assembly Passes APSRTC's Merger With State Government | Sakshi
Sakshi News home page

ఇక​ 52వేలమంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులే

Published Mon, Dec 16 2019 6:32 PM | Last Updated on Wed, Mar 20 2024 5:39 PM

 జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... 52వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. అధికారంలో ఉన్న అయిదేళ్లపాటు చంద్రబాబు ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్‌ రంగ సంస్థల్లోని ఉద్యోగులు... ప్రభుత్వంలో విలీనం కాకుండా గతంలో చంద్రబాబు చట్టం తెచ్చిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. 19997లో చంద్రబాబు తెచ్చిన చట్టం అడ్డంకిగా మారిందని, అందుకే ఆర్టీసీ విలీనం కోసం చారిత్రాత్మక బిల్లును ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement