సాక్షి, అమరావతి : పాదయాత్రలో ఆర్టీసీ కార్మికుల కష్టాలను ప్రత్యేక్షంగా చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే విలీన హామీని నెరవేర్చారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆర్టీసీ విలీనం బిల్లును సోమవారం ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ.. జనవరి 1లోపు ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్త చట్టం తెచ్చామన్నారు. 1997లో చంద్రబాబు నాయుడు తెచ్చిన చట్టం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో కలిపేందుకు అడ్డంకిగా మారిందని, అందుకే కొత్త చట్టం తెచ్చామని మంత్రి వివరించారు. విలీనానికి బోర్డు కూడా అంగీకారం తెలిపిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి కొత్తగా ప్రజారవాణా విభాగం ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. 200 రోజుల్లో ఆర్టీసీని విలీనం చేసిన ఘనన సీఎం జగన్‌కు దక్కిందని ప్రశంసించారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు పెంచిన జీతాలను బకాయి పెడితే.. వాటినికి చెల్లించామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
బాబు ఏనాడు ఆర్టీసీకి మేలు చేయలేదు
చంద్రబాబు నాయుడు ఏనాడు ఆర్టీసీ కార్మికులకు మేలు చేయలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. ప్రైవేటీకరణ అంటేనే చంద్రబాబుకు ఇష్టమని విమర్శించారు. పాదయాత్రలో ఆర్టీసీ కార్మికుల కష్టాలకు ప్రత్యేక్షంగా చూసిన సీఎం జగన్.. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment