సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలుకు సోమవారం క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో ప్రకటించగా, నాడు ఆర్టీసీ కార్మిక వర్గాలు హర్షం తెలిపాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మరొక హామీని అమలు చేసేందుకు క్యాబినెట్ సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తాను అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ముఖ్యమంత్రి ప్రజా సంకల్పయాత్రలో ప్రకటించారు. దీనిపై అప్పట్లోనే ఆర్టీసీ కార్మిక వర్గాలు హర్షం తెలిపాయి. ఈ హామీ అమలుకు తొలి అడుగు సోమవారం పడింది. ఆర్టీసీ విలీనా నికిప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. లాభనష్టాలతో భేరీజు వేయకుండా మానవతా దృక్పథంతో విలీ నంపై నిర్ణయం తీసుకోవాలని క్యాబినెట్‌కు సీఎం జగన్ వివరించారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు తెలిపారు.
జిల్లాలో 6,500 మంది కార్మికులకు లబ్ధి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కృష్ణా రీజియ న్‌లో సుమారు 6,500 మంది కార్మికులకు మేలు జరుగుతుందని ఆర్టీసీ కార్మిక వర్గాలు చెబుతున్నాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించారు. అప్పట్లో సుమారు 2000 మందికి మేలు జరి గింది. వైఎస్ మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ఉద్యోగస్తులపై ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు.
ప్రస్తుతం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కార్మికులకు ప్రభుత్వాలకు మేలు జరుగుతుంది. వాస్తవంగా ఆర్టీసీ కార్పొరేషన్‌గా వుండటంతో సిబ్బందికి ఇంక్రిమెంట్లు, ఇతర సౌకర్యాలు కావాలంటే పోరాడాల్సిన పరిస్థితి ఉంది. అదే ప్రభుత్వంలోకి వెళ్లితే మిగిలిన ప్రభుత్వశాఖల్లోని సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చే ఐఆర్, ఇంక్రిమెంట్లు ఆర్టీసీ కార్మికులకు వర్తిస్తాయని కార్మికులు ఆర్థిక స్థితిగతులు బాగు పడతాయని ఆ సంఘా ల నాయకులు చెబుతున్నారు.
నష్టాల బాటలో కృష్ణా రీజియన్
కృష్ణా రీజియన్‌లో ఆర్టీసీకి గతేడాది రూ.60 కోట్ల నష్టం వచ్చింది. ప్రయాణికుల సంక్షేమంగా పని చేస్తున్న ఆర్టీసీ మారుమూల గ్రామాలకు బస్సులు నడుపుతోంది. అలాగే ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా వున్నప్పటికీ బస్సులు నడుపుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో రూ.7 కోట్ల వరకు నష్టం వచ్చిందని తెలిసింది. కృష్ణా రీజియన్ పరిధిలో 14 ఆర్టీసీ బస్సు డిపోలు ఉండగా, విజయవాడ, ఆటోనగర్, మచిలీపట్నం డిపోలు మినహా మిగిలినవి నష్టాల బాటలోనే నడుస్తున్నాయి.
గతంలో ఇటువంటి డిపోలను ఆర్టీసి మూసి వేయడానికి నిర్ణయించింది. ప్రస్తుతం విలీనం జరిగితే డిపోలు మూత పడవు. అలాగే కృష్ణా రీజియన్‌కు నష్టం వచ్చినా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించి, ఉద్యోగస్తులకు పూర్తి భద్రత కల్పించడంతో పాటు ప్రజలకు ఆర్టీసీని మరింత చేరువుగా తీసుకు వెళ్లేందుకు ఉపయోగపడుతుందని కార్మిక సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి. ఆర్టీసీ విలీలానికి సూత్రపాయంగా ప్రభుత్వం అంగీకరించడంతో భవిష్యత్‌లో తామంతా ప్రభుత్యోగులుగా మారతామని, తమ కష్టాలు తీరిపోతాయని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment