RTC employees
-
సమస్యలకు టాటా సంతోషాల బాట
సాక్షి, మచిలీపట్నం: ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థే అయినా కార్మికులకు అడుగడుగునా అవస్థలు తప్పేవి కాదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా జీతభత్యాలు అన్న మాటే లేదు. సంస్థ నష్టాల్లో ఉన్నా, ఏవైనా ఒడుదొడుకులు ఎదురైనా సకాలంలో వేతనాలు అందేవి కావు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తే జీతంలో కోతలు విధించేవారు. ఇదంతా గతం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో సంస్థ కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయి. వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు వచ్చింది. ఉద్యోగ భద్రత లభించింది. విలీనమై నాలుగేళ్లు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఆచరణలోకి పెట్టేందుకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే కమిటీ వేశారు. ఆరు నెలల్లోనే ఆచరణలో పెట్టారు. 2020 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తేవడంతో కార్మికులంతా ప్రజా రవాణా శాఖ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. దశాబ్దాల తరబడి ఎవరూ చేయని సాహసవంతమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఉద్యోగుల కష్టాలు తొలగిపోయాయి. నాలుగేళ్లుగా వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు, బెనిఫిట్స్, అలవెన్స్ అందుతున్నాయి. ఈ నిర్ణయంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5,308 కుటుంబాల్లో సంతోషాలు నిండాయి. నాడు సమ్మెలు చేస్తే జీతాలు కట్ ఆర్టీసీ ఇస్తున్న వేతనాలు చాలక డ్రైవర్లు, కండ క్టర్లు, ఇతర కార్మికులు ఎన్నోసార్లు సమ్మెలు, పోరాటాలు చేశారు. అయినా తగిన ప్రతిఫలం దక్కలేదు. గత టీడీపీ ప్రభుత్వం కార్మికులను వేధించి, సమ్మె కాలానికి జీతాలు కోసి ఉక్కు పాదం మోపింది. ఉద్యోగ భద్రత కరువై కార్మికులు రోజులు లెక్కపెట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే తమ సమస్యలకు పరిష్కారం లభించిందని ఆర్టీసీ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. లాక్‌డౌన్‌లోనూ ఠంచన్‌గా జీతాలు కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా రెండేళ్లలో సుమారు నాలుగు నెలలకు పైగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆ పరిస్థితులు గతంలో ఎదురైతే కార్మికుల వేతనాల్లో కోతలు పడేవి. అప్పటికే ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎన్ని కష్టాలు ఉన్నా ఒకటో తేదీన ఠంచన్‌గా జీతాలు అందాయి. ఇలా జీతాలు చెల్లించడం చరిత్రలో మొదటి సారి అని ఉద్యోగులు పేర్కొన్నారు. మాట తప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్టీసీ కార్మికుల సమస్యలకు సీఎం జగన్ మోహన్‌రెడ్డి శాశ్వత పరిష్కారం చూపారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆర్టీసీ విలీనం ప్రక్రియ పూర్తి చేసి మాట నిలుపుకొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ జీతాలకు బ్రేక్ లేకుండా చూశారు. ఆర్టీసీ కార్మికుల మేలు కోరిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. – చల్లా చంద్రయ్య, రాష్ట్ర అధ్యక్షుడు,పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానం ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్నప్పుడు అనేక ఇబ్బందులను ఎదు ర్కొన్నాం. చాలీచాలని వేతనాలు, అల వెన్సులు. జీతాల పెంపు కోసం సంఘాలు ఆందోళన చేసినా మాకు సరైన న్యాయం జరిగేది కాదు. అయితే ఇప్పుడు ప్రజా రవాణా శాఖలో విలీనం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు, అలవెన్స్‌లు అందుతున్నాయి. – గొడవర్తి నరసింహాచార్యులు, కండక్టర్ భరోసా వచ్చింది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులుగా ఉన్నప్పుడు మాకు ఉద్యోగ భద్రత ఉండేది కాదు. ఏదైనా పొరపాటు జరిగినా.. ఆర్టీసీ సంఘాలు చేపట్టే ఆందోళనలో పాల్గొన్నా ఒత్తిళ్లు, బెదిరింపులు ఉండేవి. ఇప్పుడు ఆ సమస్య లేదు. ప్రభుత్వంలో విలీనం చేయడంతో జీతభత్యాలపై భరోసా వచ్చింది. ఉద్యోగ భద్రత లభించింది. – ఎ. వెంకటేశ్వరరావు, డ్రైవర్ -
ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం!
ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నాళ్లో వేచిన ఉదయం మరో పది రోజుల్లో రానుంది. ఉద్యోగుల దశాబ్దాల కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారు. ఇన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులుగానే కొనసాగారు. సీఎం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగుల హోదాతో పాటు పీఆర్సీ వేతనాలను అందుకోబోతున్నారు. పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని అమల్లోకి తీసుకువస్తుండడంతో ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబాల్లో సంతోషం పరిఢవిల్లుతోంది. నెల్లూరు (క్రైమ్): వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట తప్పని మడమ తిప్పని నేతగా, ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ ఏపీఎస్ఆరీ్టసీని ప్రత్యేక కార్పొరేషన్ సంస్థగా ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రభుత్వ పరంగా నిధులు కల్పించి ఆ సంస్థను ప్రజలకు అందించారు. ఆర్టీసీ బస్సుతో ప్రతి పల్లె జనంతో విడదీయరాని బంధం ఏర్పడింది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ వారి మన్ననలను చూరగొంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆర్టీసీ బస్సులను తన ప్రచార సభలకు వాడుకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టాలకు కారకులయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతున్న ఆర్టీసీకి నిధులిచ్చి ఆదుకోవాల్సిన అప్పటి చంద్రబాబు సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరించింది. నష్టాల పేరుతో ప్రైవేట్ పరం చేసేందుకు ఎన్నోసార్లు కుయుక్తులు పన్నారు. అయితే ఉద్యోగులు,కార్మికులు ఈ చర్యలను అడ్డుకుని సంస్థను కాపాడుకునేందుకున్నారు. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి సంస్థను ఆర్టీసీ నిధులు అందించి లాభాలు ఆర్జీంచేందుకు చర్యలు తీసుకున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించారు. అయితే ఆ తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన ప్రభుత్వాలు తమ ఏకపక్ష నిర్ణయాలు, నిరంకుశ విధానాలతో సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. కార్మికుల కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. ఈ క్రమంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆర్టీసీ కార్మికుల కలిసి పరిస్థితి వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఏపీపీటీడీగా మార్చారు. ఇప్పటి వరకు కార్మికులుగానే ఉన్న వీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపులోకి వచ్చారు. అక్టోబర్ ఒకటి నుంచి నూతన పీఆర్సీని అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అక్టోబర్ ఒకటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులందరికి పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించారు. దీంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంస్థలో పని చేస్తున్న కార్మికులు గతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3,011 మందికి లబ్ధి నెల్లూరు రీజియన్‌లో నెల్లూరు 1 ,2, రాపూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు డిపోల్లో 2,951 మంది ఉద్యోగులున్నారు. వీరితో పాటు ఆర్ఎం కార్యాలయంలోని 60 మంది ఉద్యోగులు మొత్తంగా 3,011 మందికి నూతన పీఆర్సీ ప్రకారం అక్టోబర్ ఒకటి నుంచి కొత్త జీతాలు అందనున్నాయి. ఉద్యోగుల స్థాయిని బట్టి రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు అదనంగా జీతాలు పెరగనున్నాయి. వీటితో పాటు టీఏ, డీఏలు, ఇతర అలవెన్స్‌లు అందనున్నాయి. పీఆర్సీని స్వాగతిస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత తొలిసారి అమలు చేస్తున్న పీఆర్సీని స్వాగతిస్తున్నాం. పీఆర్సీ అమలుతో జీతాలు పెరగనుండటం మా జీవితాలు కూడా మారుతాయి. చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్మోహన్రెడ్డికి ఆర్టీసీ ఉద్యోగులు జన్మజన్మలకు రుణపడి ఉంటాం. – మురళీ, ఎన్ఎంయూ నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మేము ప్రభుత్వ ఉద్యోగులమని గర్వంగా చెప్పుకుంటున్నాం. మాకు సమాజంలో గౌరవం పెరిగింది. పీఆర్సీ అమలుతో కొత్త జీతాలు రానుండడం సంతోషంగా ఉంది. – మేకపాటి చిన్నారెడ్డి, ఎన్ఎంయూ అధ్యక్షుడు ఆత్మకూరు డిపో ఆనందంగా ఉంది ఎన్నో అవరోధాలను అధిగమించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఇప్పటి వరకు చిన్నపాటి జీతాలు తీసుకుంటున్నాం. పీఆర్సీ ద్వారా జీతాలు పెరగనున్నాయి. పాతబకాయిలు సైతం విజయదశమి నాటికి అందజేస్తుండడంతో ఉద్యోగులకు మరింత ఊరట కలుగుతుంది. – షేక్ మహమ్మద్ అలీ, ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రచారకార్యదర్శి, ఆత్మకూరు డిపో సీఎం జగన్‌కు రుణపడి ఉన్నాం ఆర్టీసీ కార్మికులందరూప్రభుత్వ ఉద్యోగులుగా మారడం సంతోషంగా ఉంది. సమాజంలో గౌరవం పెరిగింది. ప్రస్తుతం అన్నీ రాయితీలు మాకు అందుతున్నాయి. పీఆర్సీతో జీతాలు పెరగనున్నాయి. మా దశబ్దాల కల నెరవేరింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉన్నాం. – వి. వెంకటాద్రి, వైఎస్సార్ మజ్దూర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి -
ఆర్టీసీ ఆసుపత్రిలో ఐసీయూ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కుటుంబాల చికిత్స కోసం ఉన్న తార్నాకలోని ఆసుపత్రిలో ఎట్టకేలకు ఐసీయూ సిద్ధమైంది. ఈ ఆసుపత్రిని నిర్మించి మూడు దశాబ్దాలు అవుతుండగా ఇన్నేళ్ల తర్వాత అతిముఖ్యమైన విభాగం అందుబాటులోకి వచ్చింది. ఇక మరో కీలక డయాలసిస్ విభాగం కూడా ఏర్పాటైంది. దీంతో ఇటు డయాలసిస్ చేసుకోవాల్సిన ఆర్టీసీ సిబ్బంది, అత్యవసర చికిత్సలకు వచ్చేవారికి ఇక్కడే సేవలు అందనున్నాయి. ఇంతకాలం రిఫరల్ పేరుతో వారిని ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు పంపేవారు. ఆ రెఫరల్ బిల్లులు ఏడాదికి రూ.35 కోట్ల వరకు అవుతుండటంతో ఆర్టీసీకి అది గుదిబండగా మారింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నెల రోజుల్లోనే ఆసుపత్రిని సమూలంగా మార్చే చర్యలు ప్రారంభించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దాతల సాయంతో ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని సజ్జనార్ నిర్ణయించి ఏర్పాట్లు ప్రారంభించారు. ఇందుకు ఓ ప్రైవేటు ఆసుపత్రిని కన్సల్టెన్సీ సేవలకు వినియోగించుకున్నారు. అలా కొందరు ప్రైవేటు వ్యక్తులు ముందుకు రావడంతో దాదాపు రూ. 2 కోట్ల వ్యయంతో ఐసీయూను సిద్ధం చేయించారు. దానికి కావాల్సిన వెంటిలేటర్లు, ఆక్సిజన్ వసతి, బెడ్లు, ఇతర యంత్ర పరికరాలను సమకూరుస్తున్నారు. పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 27న ఈ సేవలు ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. డయాలసిస్‌లు ఇక్కడే.. డయాలసిస్ చేయించుకోవాల్సిన ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటివరకు ప్రైవేటు ఆసుపత్రులే దిక్కుగా ఉండేవి. డయాలసిస్ కోసం ప్రతిసారీ దాదాపు రూ. 2,500 ఖర్చయ్యేది. ఆర్టీసీ ఆసుపత్రి ద్వారా రెఫర్ చేయించుకుని రోగులు వెళ్తుండగా సకాలంలో బిల్లులు రానందున కొన్ని ఆసుపత్రుల్లో ఆ సేవలను నిలిపివేశారు. దీంతో కొందరు రోగులు సొంతంగా ప్రైవేటులో ఆ సేవలు పొందుతున్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఆసుపత్రిలో తొలుత నాలుగు డయాలసిస్ యంత్రాలతో డయాలసిస్ సెంటర్ సిద్ధం కావడంతో ఇప్పుడు కేవలం ఉద్యోగులే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడే డయాలసిస్ చేసే విధానాన్ని ప్రారంభిస్తున్నారు. దసరా ముందురోజు డయాలసిస్ యంత్రాలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, అధికారుల సమక్షంలో పూజలు నిర్వహించారు. ఈ నెల 27 నుంచి సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నిరంతరం మందులు.. ఆర్టీసీ రెగ్యులర్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు వైద్య సేవలతోపాటు అవసరమైన మందులు పొందేందుకు వెసులుబాటు ఉంది. కానీ నిధుల సమస్యతో కొన్ని మందులకు కొరత నెలకొంటోంది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా ప్రభుత్వ మందుల సరఫరా విభాగంతో అధికారులు చర్చించి సమస్య పరిష్కరించారు. 24 గంటలూ మందులు పొందేలా మార్పుచేర్పులు చేశారు. ఇంతకాలం ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే ఫార్మసీ అందుబాటులో ఉండేది. కాగా, 2డీ ఎకో లాంటి పరీక్షలను కూడా ఆసుపత్రిలోనే నిర్వహించేలా కావాల్సిన పరికరాలు సమకూరుస్తున్నారు. -
తెలంగాణ ఆర్టీసీ: కారుణ్యం లేదు.. కనికరం లేదు
సాక్షి, హైదరాబాద్: వేయి మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రెండేళ్లుగా అంతులేని ఆవేదనతో విలవిల్లాడుతున్నాయి. ఆర్థిక సమస్యలతో అతలాకుతలం అవుతున్నాయి. విధి నిర్వహణలోఉండగా ఉద్యోగి చనిపోయి సంపాదించేవారు లేక కొన్ని కుటుంబాలు ఛిన్నాభిన్నమైతే, కుటుంబ పెద్ద ఉద్యోగం చేయలేక అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో జీవనాధారం లేక మరికొన్ని దిక్కుతోచని స్థితిలో ఉన్నా యి. వీరిని ఆదుకునేందుకు చట్టపరంగా రెండు పథకాలున్నా.. ఆర్టీసీలో నెలకొన్న గందరగోళ పరిస్థితితో అవి అక్కర కు రాకుండా పోయాయి. బాధిత కుటుంబసభ్యులు నిత్యం బస్‌భవన్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కన్నీళ్లే మిగులుతున్నాయి..తప్ప కనికరించే నాథుడే కన్పించడం లేదు. సమ్మె సమయంలో నిర్ణయాలే శాపం 2019 అక్టోబర్.. ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద సమ్మె. ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆర్టీసీలో ఎన్నో సమస్యలకు కారణమయ్యాయి. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగి చనిపోతే అతని కుటుంబంలో ఒకరికి అర్హతల ఆధారంగా సంస్థలో ఉద్యోగం ఇచ్చేందుకు వీలు కల్పించే (బ్రెడ్ విన్నర్) కారుణ్య నియామకాలను సంస్థ అటకెక్కించింది. అలాగే అనారోగ్య సమస్యలతో విధులు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులను ఆర్టీసీ అన్‌ఫిట్‌గా ప్రకటించి ఉద్యోగం నుండి తొలగిస్తుంది. అలాంటి వారికి ఇంకా సర్వీసు మిగిలే ఉంటే వారి కుటుంబంలో కూడా ఒకరికి మెడికల్ ఇన్వాలిడేషన్ పథకం కింద ఉద్యోగం ఇవ్వొచ్చు. కానీ ఇవ్వడం లేదు. ఉద్యోగాల కోసం 1,025 దరఖాస్తులు 2018 నుంచి ఇప్పటివరకు కారుణ్య నియామకాల కింద 770 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 50 మందికి ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి శిక్షణ ఇచ్చారు. పోస్టింగులు ఇవ్వడమే తరువాయి. అలాగే అనారోగ్య సమస్యలతో 2018 తర్వాత అన్‌ఫిట్ అయిన డ్రైవర్ల కుటుంబాల నుంచి 255 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 30 మంది పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆర్టీసీలో 52 రోజుల సుదీర్ఘ సమ్మె జరిగింది. ఆ సమయంలో ఖర్చును తగ్గించే పేరుతో ఏకంగా వేయికి పైగా బస్సులను తొలగించి వాటి స్థానంలో 1,300 అద్దె బస్సులను తీసుకున్నారు. ఫలితంగా 2,500 మంది డ్రైవర్లు, కండక్టర్లు మిగులు (ఎక్సెస్)గా తేలారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంటు వయసును 58 నుంచి 60కి పెంచారు. ఫలితంగా రెండేళ్లపాటు రిటైర్మెంట్లు లేకుండాపోయాయి. ఈ రెండు నిర్ణయాలతో ఆర్టీసీలో ఖాళీలు ఏర్పడకపోగా, భారీగా సిబ్బంది మిగిలిపోయారు. దీంతో కారుణ్య నియామకాలు, అన్‌ఫిట్ ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ కల్పన పథకాలు అటకెక్కాయి. భవిష్యత్తులో ఖాళీలు ఏర్పడితే తప్ప వారికి ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదని అధికారులు తేల్చి చెప్పేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తికాని వారి మాటలా ఉంచితే.. చివరకు శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగులకు సిద్ధంగా ఉన్న వారిని కూడా తీసుకోలేదు. వారికిచ్చి.. వీరికివ్వకుండా.. ఆర్టీసీ సమ్మె సమయంలో 32 మంది కార్మికులు చనిపోయారు. కొందరు ఆత్మహత్య చేసుకోగా, మరికొందరు గుండెపోటు, ఇతర కారణాలతో చనిపోయారు. ఆ కుటుంబాల్లోని ఇతర సభ్యులకు అర్హతల ఆధారంగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చారు. కానీ వీరి కంటే ముందునుంచి పెండింగులో ఉన్న దరఖాస్తుదారులను మాత్రం ఆర్టీసీ పట్టించుకోవడం లేదు. తండ్రికి మందులు కూడా కొనలేక.. పగడపల్లి దత్తు ఆదిలాబాద్ డిపోలో డ్రైవర్. తీవ్ర అనారోగ్య సమస్యతో 2017లో డ్రైవర్‌గా పనిచేసే అర్హత కోల్పోయారు. ఆయనను సంస్థ అన్‌ఫిట్‌గా డిక్లేర్ చేసింది. అప్పటికి మరో ఐదేళ్ల సర్వీసు ఉండటంతో ఆయన కుమారుడు బీఎస్సీ చదివిన చంద్రశేఖర్ బ్రెడ్ విన్నర్ స్కీం కింద ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో కానిస్టేబుల్‌గా దరఖాస్తు చేసుకుని, ఎంపికై శిక్షణ కూడా పొందారు. కానీ పోస్టింగ్ ఇచ్చే సమయానికి సంస్థలో ఖాళీలు లేవనే పరిస్థితి ఏర్పడింది. అతని పోస్టింగ్ కోసం ఆ కుటుంబం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తోంది. వివాహమైన చంద్రశేఖర్ ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థలో రూ.8 వేల జీతానికి పనిచేస్తున్నాడు. తల్లి, అనారోగ్యంతో ఉన్న తండ్రి, భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో కూడిన ఆ కుటుంబానికి రూ.8 వేలు ఎటూ చాలకపోవడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతోంది. ఆరోగ్యం సరిగా లేని తండ్రికి మందులు ఇప్పించటం కూడా కష్టంగా మారిందని చంద్రశేఖర్ ఆవేదన చెందుతున్నాడు. కండక్టర్‌గా ఎంపికైనా ఫలితం లేదు ఎన్.లింగన్న నిర్మల్ ఆర్టీసీ డిపోలో కండక్టర్. విధుల్లో ఉండగా 2017లో గుండెపోటుకు గురై చనిపోయారు. బీటెక్ కంప్యూటర్స్ పూర్తి చేసి హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగం చేస్తున్న ఆయన కుమారుడు విఘ్నేశ్ దానికి రాజీనామా చేసి కారుణ్య నియామకం పథకం కింద ఆర్టీసీకి దరఖాస్తు చేసుకున్నాడు. కండక్టర్ పోస్టుకు ఎంపికయ్యాడు కూడా. పోస్టింగ్ కోసం శిక్షణ ఇచ్చే సమయంలోనే.. ఆర్టీసీలో బస్సుల సంఖ్య తగ్గించటం, ఉద్యోగ పదవీ విరమణ వయసును పెంచటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో విఘ్నేశ్‌కు ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. విధిలేని పరిస్థితుల్లో కుటుంబపోషణకు నిర్మల్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ వద్ద చాలీచాలని జీతానికి సైట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. -
TSRTC: జీతం రాదు.. పింఛన్ లేదు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టుకుని దాచుకున్న నిధిని ఖాళీ చేసి వారి అవసరాలకు రుణాలు అందకుండా చేసిన ఆర్టీసీ.. విశ్రాంత ఉద్యోగులకూ మనశ్శాంతి లేకుండా చేస్తోంది. పని చేసిన కాలంలో దాచుకున్న ఎర్న్డ్ లీవ్స్ (ఈఎల్స్) తాలూకు నగదును చెల్లించట్లేదు. 2,500 మందికి సంబంధించి నగదుగా మార్చుకునే ఈఎల్స్ చెల్లింపులు నిలిపేసింది. మూడేళ్లు గడుస్తున్నా వారికి రావాల్సిన మొత్తాన్ని నిధులు లేవన్న సాకుతో ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆ బకాయిలు రూ.100 కోట్లకు చేరుకున్నాయి. ఇటు జీతం లేక, అటు పింఛన్ వెసులుబాటు లేక, ఈఎ ల్స్ చెల్లింపులూ అందక విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 11 నెలల జీతంతో సమానం..: ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఆర్టీసీ ఉద్యోగులకు 300 ఈఎల్స్‌ను నగదుగా మార్చుకునే వెసులుబాటు ఉంది. రిటైర్ అయ్యాక ఒకేసా రి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. పదవీ విరమ ణ పొందిన నెలలో ఉన్న బేసిక్‌తో పా టు కరువు భత్యం కలిపి దీన్ని చెల్లి స్తారు. ఇది వారి 10 నెలల జీతానికి సమానమ వుతుంది. దీంతోపాటు రిటైర్మెంట్ శాలరీ పేరుతో బోనస్‌గా మరో నెల జీతం ఇస్తారు. మొత్తం 11 నెలల జీతం అందుతుంది. ఇది వారి హోదాలను బట్టి జీతం ఆధారంగా రూ.4 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుంది. 2018 ఏప్రిల్ నుంచి పదవీ విరమణ పొందిన వారికి ఈఎల్స్ చెల్లింపులు ఆపేసింది. అలా 2019 డిసెంబర్ వరకు నిలిచిపోయాయి. ఈ మధ్య కాలంలో దాదాపు రెండున్నర వేల మంది రిటైర్ అయ్యారు. ఆర్టీసీ రెండు సార్లు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంది. గతేడాది రూ.650 కోట్లు, నెలన్నర కింద రూ.500 కోట్లు రుణంగా తెచ్చుకుంది. తొలి అప్పును జీతాల పేరుతో చెల్లించింది. వాటి నుంచి తమకు ఈఎల్స్ మొత్తం విడుదల చేయాలని విశ్రాం త ఉద్యోగులు ఎంతగా అడిగినా వినలేదు. -
ఆర్టీసీ నిధులన్నీ హాంఫట్!
ఆయన ఆర్టీసీలో కండక్టర్. పదేళ్ల క్రితం రిటైర్ అయ్యారు. ఐదేళ్ల క్రితం చనిపోయారు. పదవీ విరమణ సమయంలో వచ్చిన మొత్తాన్ని ఆర్టీసీకి అనుబంధంగా ఉండే సహకార పరపతి సంఘం (సీసీఎస్)లో డిపాజిట్ చేశారు. దానిపై రూ.10వేల వడ్డీ ప్రతినెలా ఆయన భార్యకు అందుతోంది. ఆమెకు అదే జీవనాధారం. ఇప్పుడు ఉన్నట్టుండి నిధులు లేవని వడ్డీ ఇవ్వటం మానేశారు. మరి ఆమెకు పూట గడిచేదెలా? డ్రైవర్‌గా పనిచేసి రిటైర్ అయిన ఓ వ్యక్తి కుటుంబంలో ఇద్దరికి కోవిడ్ సోకింది. చికిత్సకు భారీగా ఖర్చయింది. తాను సీసీఎస్‌లో దాచుకున్న డబ్బులోంచి అంత మొత్తం ఇవ్వాలని వేడుకున్నా.. నిధులు లేకపోవటంతో చిల్లిగవ్వ కూడా అందలేదు. సాక్షి, హైదరాబాద్: ఈ ఇద్దరి పరిస్థితే కాదు.. ఆర్టీసీలో పదవీ విరమణ చేసి, అప్పుడు వచ్చిన డబ్బును సీసీఎస్‌లో దాచుకున్న 15 వేల మంది దీనగాథ. ఉద్యోగుల నెల జీతాల్లోంచి కొంత మొత్తం మినహాయిస్తూ కూడిన మొత్తంతో సీసీఎస్ నడుస్తుంది. ఆ నిధుల్లోంచి ఉద్యోగులు కుటుంబ అవసరాలకు రుణాలు తీసుకుంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంతింటి నిర్మాణం, ఆస్పత్రుల ఖర్చులు.. ఇలా అన్నింటికి అదే దిక్కు. ఇక రిటైర్ అయిన సమయంలో వచ్చిన మొత్తాన్ని చాలా మంది ఇందులోనే డిపాజిట్ చేసుకుంటారు. ఇక్కడ కాస్త ఎక్కువ వడ్డీ ఇస్తారు. ఆ వడ్డీని పింఛన్ తరహాలో నెలనెలా పొందుతారు. ఇప్పటి వరకు వడ్డీ చెల్లింపులో జాప్యం లేకుండా సీసీఎస్ చెల్లిస్తూ వచ్చింది. కానీ, ఈ నెల వడ్డీ చెల్లించలేక చేతులెత్తేశారు. దీంతో ఈ వడ్డీనే ఆధారంగా చేసుకుని బతుకీడుస్తున్నవారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వడ్డీ సంగతి దేవుడెరుగు, అసలు అందుతుందా అన్న భయం మొదలైంది. ఎందుకీ పరిస్థితి?.. ఉద్యోగి జీతంలో 7 శాతం మొత్తాన్ని ఆర్టీసీ.. సీసీఎస్‌కు చెల్లిస్తుంది. ఆ మొత్తాన్ని రుణాల రూపంలో ఉద్యోగులకు ఇచ్చి.. వచ్చే వడ్డీతో సీసీఎస్ పాలకవర్గం నిధిని పెంపు చేస్తుంది. అలాగే మిగతా మొత్తాన్ని వేరే సంస్థల్లో పెట్టుబడి పెట్టి ఆదాయాన్ని పొందుతుంది. రుణాలు తీసుకున్న ఉద్యోగుల కిస్తీలను ఆర్టీసీనే ప్రతినెలా వారి జీతం నుంచి మినహాయించి సీసీఎస్‌కు చెల్లిస్తుంది. అలా ప్రతినెలా దాదాపు రూ.40 కోట్లు సీసీఎస్‌కు జమవుతాయి. కానీ గత 19 నెలలుగా ఆర్టీసీ యాజమాన్యం సీసీఎస్‌కు జమ చేయడం మానేసింది. ఇక సీసీఎస్ నిధుల నుంచి రూ.740 కోట్లను ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. దానికి సంబంధించి రూ.140 కోట్ల వడ్డీ పేరుకుపోయింది. ఇక సీసీఎస్ నుంచి ఉద్యోగులు ఇప్పటికే తీసుకున్న రుణాల మొత్తం రూ.800 కోట్లు. వెరసి సీసీఎస్ వద్ద ప్రస్తుతం చిల్లి గవ్వ కూడా లేదు. ఫలితంగా ఆగస్టు నెలకు సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన వడ్డీ ఇవ్వలేకపోయింది. ఇదే విషయాన్ని పాలక వర్గం ఆర్టీసీ యాజమాన్యాన్ని అడిగితే, మా వద్ద డబ్బు లేదని చేతులెత్తేసింది. కరోనా వేళ బయట అప్పు పుట్టడం కష్టంగా ఉన్న సమయంలో సీసీఎస్ వడ్డీ రాక విశ్రాంత ఉద్యోగులు అల్లాడుతున్నారు. ఇదీ లెక్క.. విశ్రాంత ఉద్యోగులు దాచుకున్న మొత్తం డబ్బు: రూ.370 కోట్లు దీనిపై నెలకు చెల్లించాల్సిన వడ్డీ: రూ.4.5 కోట్లు డబ్బు దాచుకున్న రిటైర్ట్ ఉద్యోగుల సంఖ్య: 15,000 సీసీఎస్ వడ్డీ చెల్లింపు ఇలా... రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులో 50 శాతానికి వడ్డీ: 14% మిగతా 50 శాతానికి వడ్డీ: 10% అదనంగా డిపాజిట్ చేస్తే దానిపై ఇచ్చే వడ్డీ: 8.5% ఈనెల సరుకులకు డబ్బుల్లేవ్ రంగారావు, విశ్రాంత ఉద్యోగి నా రిటైర్మెంట్ డబ్బంతా సీసీఎస్‌లో ఉంచాను. నెలకు రూ.13వేల వడ్డీ వస్తుంది. ఈ నెల వడ్డీ అందలేదు. దీంతో సరుకులు కొనేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాం. వెంటనే నా డిపాజిట్ డబ్బు మొత్తం ఇవ్వాలని కోరుతున్నా. మా అబ్బాయి వద్ద చేయి చాచాల్సి వచ్చింది చంద్రారెడ్డి, విశ్రాంత ఉద్యోగి సీసీఎస్ వడ్డీ డబ్బులతో ఇంతకాలం ఇల్లు గడిచింది. ఈ నెల వడ్డీ రాలేదు. డబ్బులు చాలక మా అబ్బాయి వద్ద చేయి చాచాల్సి వచ్చింది. 72 ఏళ్ల వయసులో నాకు ఎందుకీ ఇబ్బంది. వెంటనే ప్రభుత్వం ఆ డబ్బు చెల్లించేలా సహకరించాలి. -
మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులతో ఈ నెల 1వ తేదీన సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం దిశగా టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రాధాన్యతాక్రమంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ఆదేశాల మేరకు సమ్మె కాలంలో మరణించిన 33 మంది ఉద్యోగుల పిల్లలకు విద్యార్హతలను బట్టి ఆర్టీసీలో ఉద్యోగాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరణించిన 38 మంది ఉద్యోగులకు సంబంధించి 22 కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆయా జిల్లాల కలెక్టర్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించగా, మరో 16 కుటుంబాలకు శనివారం పరిహారం అందజేయనున్నారు. రాత్రి 8 గంటల్లోగా మహిళా ఉద్యోగుల డ్యూటీ ముగిసేలా త్వరితగతిన షెడ్యూలు సర్దుబాటు చేయాలని సునీల్‌శర్మ డిపో మేనేజర్లను ఆదేశించారు. మహిళా ఉద్యోగుల కోసం ఈ నెల 15 లోగా హైదరాబాద్ నగరంలో విశ్రాంతి గదులతో పాటు, డిపోలు, హైదరాబాద్ సిటీ చేంజ్‌ఓవర్ పాయింట్ల వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చీఫ్ సివిల్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను ఆదేశించారు. -
అయోమయంలో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్!
-
ఆర్టీసీ కార్మికుల్లో కొందరి పరిస్థితి అయోమయం
సాక్షి, హైదరాబాద్: సమ్మెలో ఉండి తిరిగి విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికుల్లో కొందరి పరిస్థితి అయోమయంలో పడింది. ఈనెల ఐదవతేదీ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరినవారినే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పెట్టిన గడువుకు 495 మంది విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతూ లేఖలు ఇచ్చారు. వారిలో 220 మంది మాత్రమే ఇప్పుడు విధులకు హాజరవుతున్నారు. మిగిలిన 275 మందిని సమ్మెలో ఉన్నట్టుగానే అధికారులు పరిగణిస్తున్నారు. వీరు సమ్మెలోకి వెళ్లకుండా విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండగా..అధికారులనుంచి పిలుపు రాకపోవటంతో వీరి పరిస్థితి గందరగోళంగా మారింది. వీరు విధుల్లో చేరుతున్నట్లు సమర్పించిన లేఖలు తమకు అందలేదని డిపో మేనేజర్లు చెబుతున్నారు. ఇప్పటికే రెండు నెలల నుంచి వేతనాల్లేక ఇబ్బంది పడుతున్నందున, ఇప్పుడు డ్యూటీలో లేనట్టుగా అధికారులు పరిగణిస్తే ప్రస్తుత నెల వేతనం కూడా అందదన్న ఆందోళనతో ఉన్నారు. అసలేం జరిగింది.. ఈనెల 2న సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు ప్రకటనకు తొలిరెండ్రోజులు కార్మికుల నుంచి స్పందనలేదు. తాము పనిచేస్తోన్న డిపో మేనేజర్ల వద్దకు వెళ్లి లేఖలు ఇస్తే సమ్మెలో ఉన్న తోటి కార్మికుల ఆగ్రహానికి గురవుతామన్న భయం కార్మికుల్లో ఉందని అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు ఈ నెల 4న కార్మికులు పనిచేస్తోన్న డిపోలోనే కాకుండా ఏ డిపోలో లేఖ ఇచ్చినా స్వీకరిస్తామని, కలెక్టరేట్లు, పోలీసు స్టేషన్లు, ఆర్డీఓ కార్యాలయాలు..ఇలా కొన్ని ప్రత్యామ్నాయ కార్యాలయాలను ప్రకటించారు. దీంతో చివరిరోజు ఎక్కు వ మంది కార్మికులు ఆయా ప్రత్యామ్నాయ కార్యాలయాల్లో అందజేశారు. ఈ లేఖల్లో కొన్ని మాత్రమే సంబంధిత డిపోలకు చేరగా, మిగతావి అందలేదు. ఇప్పుడదే ఈ గందరగోళానికి కారణమైంది. ‘నేను పనిచేస్తున్న డిపోలో కాకుండా నగరంలోని ఓ పోలీసు స్టేషన్‌కు వెళ్లి లేఖ ఇవ్వగా అక్కడి ఏసీపీనే స్వయంగా అందుకున్నారు. వారం గడిచినా నా లేఖ సంబంధిత డిపో మేనేజర్‌కు అందలేదు. దీంతో నాకు అధికారుల నుంచి పిలుపు రాలేదు. ఏం జరిగిందో వాకబు చేస్తే అసలు లేఖనే రాలేదని చెప్పారు. ఇప్పుడు ఈడీ కార్యాలయం నుంచి అనుమతి పొందితేనే చేర్చుకుంటామంటున్నారు’అని నగరానికి చెందిన ఓ డిపో స్థాయి అధికారి పేర్కొన్నారు. ఇలాంటి వారు ఎంతోమంది. ప్రస్తుతం ఆర్టీసీ భవితవ్యం కోర్టు ఆదేశాలపైనే ఆధారపడ్డ నేపథ్యంలో, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొంతమంది విధుల్లో చేరాలనుకుంటున్నారు. సమ్మె నుంచి బయటకొచ్చి ధైర్యం చేసి లేఖలిచ్చినా, ఇప్పుడవి అధికారులకు చేరకపోవటంతో వారు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. తమకు గడువులోపు లేఖలు అందినవారిని మాత్రమే విధుల్లోకి తీసుకున్నామని, లేఖలు ఇచ్చి ఇప్పటి వరకు విధులకు రాని వారిని, లేఖలు ఇవ్వనివారిని సమ్మెలోనే ఉన్నట్టుగా పరిగణిస్తామని ఓ అధికారి పేర్కొన్నారు. -
నోటికి నల్లగుడ్డతో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ
సాక్షి, వనపర్తి: ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని పోలీసుల నిర్భందాలతో ఆపాలనుకోవడం ప్రభుత్వ అవివేక చర్య అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆర్.గోపిగౌడ్, సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, ప్రజావాగ్గేయకారుడు రాజారాంప్రకాశ్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 37వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని సమ్మెశిబిరం నుంచి ఆర్టీసీ కార్మికులు మూతికి నల్లగుడ్డలు కట్టుకుని బస్టాండ్ మీదుగా, రాజీవ్‌చౌక్, బస్ డిపోరోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆర్టీసీ డిపోఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలో ట్యాం క్‌బండ్‌లో పోలీసులు వ్యవహరించిన తీరు తెలంగాణ సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. పోలీసుల తీరు అమానుషమని, సమైక్య పాల కుల హయాంలోకంటే దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా డిమాండ్లు సా ధించే వరకు పోరు ఆపబోమని అన్నారు. న్యా యస్థానాలు సూచించినా, 36 రోజులుగా ఏకధాటిగా ప్రజలు పోరాటం చేస్తున్నా.. ప్రభు త్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం ఏమిటని నిలదీశారు. ఆర్టీసీని రక్షించాలనే ఉద్దే శం ప్రభుత్వానికి ఉంటే చర్చలకు ఎందుకు పిలవడం లేదన్నారు. ఆర్టీసీని నిర్మూలించాలనే ఆశయంతోనే ప్రభుత్వ పెద్దలు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలతో పదుల సంఖ్యలో కార్మికులు అమరులు అవుతు న్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆర్టీసీని బతికించుకునేందుకు రెండు నెలలుగా ఆర్టీసీ కార్మికులు పస్తులతో పోరాటం చేస్తున్నార ని అన్నారు. తెలంగాణపోరాట స్ఫూర్తితోనే ఆర్టీ సీని కాపాడుకునేంత వరకు ప్రజాస్వామ్యపద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఆర్టీసీపై ఉన్నతాధికారులు హైకోర్టుకు ఇస్తున్న నివేదికలతోనే ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు వెంకటయ్య, రమేష్, వీవీమూర్తి, శ్రీలత, ప్రభరాణి, లక్ష్మీ, రేణుక, చపలతిరెడ్డి, నందిమల్ల నాగరాజు పాల్గొన్నారు. -
సమ్మె విరమించండి
సాక్షి, హైదరాబాద్: పరిస్థితులు చేయి దాటక ముందే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెను విరమించి ప్రభుత్వంతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.కేశవరావు పిలుపునిచ్చారు. సమ్మెలో ఉన్న ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం తనను ఎంతో బాధించిందని, ఏ సమస్యకూ ఆత్మాహుతి లేదా ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు. ఈ మేరకు కేకే సోమవారం లేఖ విడుదల చేశారు. ‘టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపట్ల ఎప్పుడూ సానుకూల ధోరణితోనే వ్యవహరిస్తూ వచ్చింది. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల్లో ఇచ్చిన 44 శాతం ఫిట్మెంట్, 16 శాతం మధ్యంతర భృతి ప్రభుత్వ సానుకూల ధోరణికి నిదర్శనం. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్ మినహా సంస్థ ఉద్యోగులు లేవనెత్తిన ఇతర అంశాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని కేకే లేఖలో పేర్కొన్నారు. ‘ఆర్టీసీని ప్రైవేటీకరించరాదనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. అలాంటి నిర్ణయాలు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదనే విషయాన్ని అందరూ గమనించాలి. ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనతోపాటు దేశంలో బస్సు రవాణాలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రజారవాణాలో మూడంచెల ఏర్పాట్లు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేవలం ఓ ప్రయోగంలా మాత్రమే చూడాల్సి ఉంది. 50 శాతం బస్సులను ఆర్టీసీ, 30 శాతం బస్సులను స్టేజి క్యారియర్లుగా, మరో 20 శాతం బస్సులను ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా నడపాలనేది ఓ ప్రయోగంలా మాత్రమే భావించాలి’ అని కేశవరావు వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ నియంత్రణలో నడిచే రాష్ట్ర, ప్రభుత్వరంగ సంస్థల నడుమ ఎంతో తేడా ఉంటుంది. ప్రభుత్వం అనేది ఎంత మాత్రం వాణిజ్య సంస్థ కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రూపొందించే విధానాలను ఏ వ్యవస్థ కూడా నిర్దేశించలేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన అంశం పార్టీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా ఎన్నడూ నా పరిశీలనలోకి రాలేదు. కాబట్టి ఆర్టీసీ లేదా ఏ ఇతర ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశంపై ఎలాంటి స్థితిలోనూ పునరాలోచన ఉండబోదని కేశవరావు స్పష్టం చేశారు. -
సీఎంను కలిసిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు కలిశారు. సచివాలయంలోని ముఖ్యమంత్రిని కలిసిన వారు ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవడంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చుతున్నారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకోవడానికి ఆయన ఆమోదం తెలపడంతో 52 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది. చదవండి: ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం విదితమే. దీంతో ఇకపై ఆర్టీసీలోని ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వీరంతా కొత్తగా ఏర్పాటయ్యే ప్రజా రవాణా శాఖ కిందకు వస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు, నియమ నిబంధనలు ప్రజా రవాణా శాఖలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తాయి. చదవండి: ఆర్టీసీ విలీనం! -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్‌కు కృతజ్ఞతలు
సాక్షి, విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ క్యాబినెట్ ఆమోదించటంపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గురువారం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఈయూ నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పుష్పార్చన చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతం చేసిన జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆర్టీసీలోని ఇతర సమస్యలతో పాటు తమకు దక్కాల్సిన బెనిఫిట్స్‌పై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. -
ఆర్టీసీ ఉద్యోగుల్లో నయాజోష్
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలుకు సోమవారం క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో ప్రకటించగా, నాడు ఆర్టీసీ కార్మిక వర్గాలు హర్షం తెలిపాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మరొక హామీని అమలు చేసేందుకు క్యాబినెట్ సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ముఖ్యమంత్రి ప్రజా సంకల్పయాత్రలో ప్రకటించారు. దీనిపై అప్పట్లోనే ఆర్టీసీ కార్మిక వర్గాలు హర్షం తెలిపాయి. ఈ హామీ అమలుకు తొలి అడుగు సోమవారం పడింది. ఆర్టీసీ విలీనా నికిప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. లాభనష్టాలతో భేరీజు వేయకుండా మానవతా దృక్పథంతో విలీ నంపై నిర్ణయం తీసుకోవాలని క్యాబినెట్‌కు సీఎం జగన్ వివరించారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు తెలిపారు. జిల్లాలో 6,500 మంది కార్మికులకు లబ్ధి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కృష్ణా రీజియ న్లో సుమారు 6,500 మంది కార్మికులకు మేలు జరుగుతుందని ఆర్టీసీ కార్మిక వర్గాలు చెబుతున్నాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించారు. అప్పట్లో సుమారు 2000 మందికి మేలు జరి గింది. వైఎస్ మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ఉద్యోగస్తులపై ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు. ప్రస్తుతం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కార్మికులకు ప్రభుత్వాలకు మేలు జరుగుతుంది. వాస్తవంగా ఆర్టీసీ కార్పొరేషన్‌గా వుండటంతో సిబ్బందికి ఇంక్రిమెంట్లు, ఇతర సౌకర్యాలు కావాలంటే పోరాడాల్సిన పరిస్థితి ఉంది. అదే ప్రభుత్వంలోకి వెళ్లితే మిగిలిన ప్రభుత్వశాఖల్లోని సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చే ఐఆర్, ఇంక్రిమెంట్లు ఆర్టీసీ కార్మికులకు వర్తిస్తాయని కార్మికులు ఆర్థిక స్థితిగతులు బాగు పడతాయని ఆ సంఘా ల నాయకులు చెబుతున్నారు. నష్టాల బాటలో కృష్ణా రీజియన్ కృష్ణా రీజియన్‌లో ఆర్టీసీకి గతేడాది రూ.60 కోట్ల నష్టం వచ్చింది. ప్రయాణికుల సంక్షేమంగా పని చేస్తున్న ఆర్టీసీ మారుమూల గ్రామాలకు బస్సులు నడుపుతోంది. అలాగే ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా వున్నప్పటికీ బస్సులు నడుపుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో రూ.7 కోట్ల వరకు నష్టం వచ్చిందని తెలిసింది. కృష్ణా రీజియన్ పరిధిలో 14 ఆర్టీసీ బస్సు డిపోలు ఉండగా, విజయవాడ, ఆటోనగర్, మచిలీపట్నం డిపోలు మినహా మిగిలినవి నష్టాల బాటలోనే నడుస్తున్నాయి. గతంలో ఇటువంటి డిపోలను ఆర్టీసి మూసి వేయడానికి నిర్ణయించింది. ప్రస్తుతం విలీనం జరిగితే డిపోలు మూత పడవు. అలాగే కృష్ణా రీజియన్‌కు నష్టం వచ్చినా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించి, ఉద్యోగస్తులకు పూర్తి భద్రత కల్పించడంతో పాటు ప్రజలకు ఆర్టీసీని మరింత చేరువుగా తీసుకు వెళ్లేందుకు ఉపయోగపడుతుందని కార్మిక సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి. ఆర్టీసీ విలీలానికి సూత్రపాయంగా ప్రభుత్వం అంగీకరించడంతో భవిష్యత్‌లో తామంతా ప్రభుత్యోగులుగా మారతామని, తమ కష్టాలు తీరిపోతాయని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
జగనన్న హామీతో ఆర్టీసీకి జవసత్వాలు
సాక్షి, కొయ్యలగూడెం : దశాబ్ధాల పోరాట ఫలితం ఫలించిన వేళ ఆర్టీసీ లోకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ పాలన కోసం ఎదురుచూస్తున్నామంటూ కార్మికులు పేర్కొంటున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీతో ఆర్టీసీ ఉద్యోగులు ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నారు. వరుస నష్టాలతో కూనరిల్లుతున్న ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా దశాబ్దం నుంచి చేస్తున్న పోరాటాలు, ఆందోళనకు జగన్ హామీ జవసత్వాలను నింపిందన్నారు. ఆర్టీసీలో ఏళ్ల తరబడి కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ పోస్టులు భర్తీకి నోచుకోకపోవడంతో అదనపు భారం మోస్తూ అనారోగ్యం పాలవుతున్నామన్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా సంస్థ నష్టాల్లో ఉందని మొహం చాటేశారే గానీ, మా బాధలు వినలేదని వాపోయారు. ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు 50 శాతం ఫిట్మెంట్ ఇస్తామని, తీరా 25 శాతంతో సరిపెట్టి కార్మికులను వంచించారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు 60 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ అవకాశం కల్పించి, ఆర్టీసీ కార్మికులకు పెంచకపోవడం తీవ్ర అన్యాయమని, ఈ నేపథ్యంలో జగనన్న హామీ విలీనం వల్ల తమకు లబ్ధి చేకూరుతుందని భావోద్వేగాలతో పేర్కొంటున్నారు. నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజారవాణా వ్యవస్థకు ఆయువుపట్టు వంటి ఏపీఎస్ఆర్టీసీని చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని కార్మికులు విమర్శిస్తున్నారు. సంస్థను ప్రైవేట్ పరం చేసి ప్రభుత్వం లబ్ధిపొందుదామని చేసిన ప్రయత్నాలను కార్మికులు ఆందోళనలతో అడ్డుకున్నారు. పల్లె వెలుగు బస్సులను సగానికిపైగా రద్దు చేసి వాటి స్థానంలో ప్రైవేట్ బస్సులను ప్రోత్సహిస్తూ పాలకులు లబ్ధిపొందారని కార్మికులు ఆరోపించారు. మేన్ సర్వీస్ పేరిట కండక్టర్ల విధులు కూడా చేయిస్తున్నారని, 2012 నుంచి డ్రైవర్ల రిక్రూట్మెంట్ లేకుండా నిరుద్యోగులను సైతం ప్రభుత్వం పెంచిందన్నారు. పనిభారం పెంచి డ్యూటీలు వేయిస్తూ వారి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని, మెకానిక్ పోస్టులు సైతం గత పదేళ్లుగా నోచుకోలేదని వాపోతున్నారు. ప్రజల కోసం పండుగ రోజుల్లో కూడా పనిచేస్తున్న తమకు ప్రభుత్వం హామీ ఇచ్చిన ఫిట్మెంట్ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో అద్దె బస్సులు, రిజర్వేషన్ కౌంటర్లను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తూ తమ పొట్టలు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా వీఆర్ఎస్ జీవోను కూడా తీసుకువచ్చారని సిబ్బంది స్వచ్ఛందంగా తప్పుకునేలా ప్రణాళికలను ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. ఈ నేపధ్యంలో ఆర్టీసీ మనుగడకు విలీనం ఒక్కటే శాశ్వత పరిష్కారం అని భావించిన యువనేత అందుకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవడం తమలో ఆనందాన్ని నింపిందన్నారు. విలీనం వల్ల నష్టాల పేరుతో సర్వీసులు ఎత్తివేయడం ఉండదని, అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కలుగుతుందని, కొత్త బస్సులు సమకూర్చుకోవచ్చని పేర్కొంటున్నారు. విలీనంతో ఎంతో మేలు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలు వర్ణనాతీతం. తక్కువ వేతనాలతో ఎక్కువ పనులు చేస్తూ సిబ్బంది నానాయాతనలు పడుతున్నాం. ఆర్టీసీ విలీనంపై ఎప్పటి నుంచో యూనియన్లు చేస్తున్న ఆందోళనలకు జగన్ హామీ అభయహస్తంలా మాకు మేలు చేయగలదు. – ఎం.భాస్కరరావు, ఏడీసీ, ఆర్టీసీ మా అభ్యర్థనలు ఫలించాయి వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వ శాఖ వలే ప్రజారవాణా శాఖగా ప్రకటించాలని ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్రెడ్డికి పాదయాత్రలో ప్రతి జిల్లా నుంచి అభ్యర్థనలు వెళ్లిన ఫలితం ఫలించింది. సాధక బాధలు విన్న జగన్మోహన్రెడ్డి ఆర్టీసీ లోకానికి తియ్యని కబురు అందించారు. – బి.వీరయ్య, కండక్టర్ మరింత మెరుగైన రవాణా ప్రజారవాణా బాధ్యత ప్రభుత్వం తీసుకున్నప్పుడే నిర్వహణ సక్రమమవుతుంది. ప్రయాణికులకు భరోసా కలుగుతుంది. విలీనంతో ప్రజలకు మరింత మెరుగైన రవాణాను మారుమూల ప్రాంతాల్లో సైతం అందించగలుగుతాం. ప్రతి కార్మికునికి బాధ్యత ఉంటుంది. – ఎల్ఎన్ రావు, ఏడీసీ, ఆర్టీసీ -
ఆర్టీసీ విలీనం..విలువైన నిర్ణయం..
సాక్షి, రాజమహేంద్రవరం సిటీ: ప్రజారంజక పాలనకు.. రాజన్న రాజ్యం స్థాపనకు వస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్ రవాణా సంస్థ కార్మికులకు ఊరట కల్పించేలా చేసిన ప్రకటనతో ఆ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పాలన చేపట్టిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానంటూ చేసిన ప్రకటనను యూనియన్లకు అతీతంగా స్వాగతిస్తున్నారు. నిత్యం లక్షలాది మంది ప్రయాణకులను గమ్యస్థానాలను చేర్చే మా జీవితాల్లో వెలుగులు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్న ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నాన్ని నిజం చేసేందుకు రానున్న జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, తుని, రాజోలు, రామచంద్రపురం, రావులపాలెం, ఏలేశ్వరం, గోకవరం డిపోలు ఉన్నాయి. వీటిలో 1550 మంది డ్రైవర్లు, 1180 మంది కండక్టర్లతో కలిసి మిగిలిన సిబ్బంది మొత్తం 4300 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే 1952లో ప్రారంభమైన ఆర్టీసీ నేటి వరకూ అనేక కష్ట నష్టాలతో నెట్టుకువస్తోంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ జీవితాల్లో వెలుగు రావడం లేదని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. పాలకులు ఎందరు మారినా సంస్థను, దాని బాగును విస్మరించిన నేపథ్యంలో పాదయాత్ర సందర్భంగా వచ్చిన జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానన్న ప్రకటనను వారు స్వాగతిస్తున్నారు. జగన్ ఇచ్చిన మాట తప్పరు ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేది విలీన విధానం. జగన్ అధికారంలోనికి వచ్చిన వెంటనే కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం ప్రతీ కార్మికునికి ఉంది. ఏళ్ల తరబడి కార్మికులు విలీనం కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లకు కార్మికుల కల నిజం కానుంది. –ఎంఎన్ రావు, జాయింట్ సెక్రటరీ, ఈయూ ఇక జీవితం బంగారమే.. జగన్ పాలనలో ఆర్టీసీ కార్మికుల జీవితం స్వర్ణమయం కానుంది. కార్మికులు నిత్యం పడుతున్న కష్టాలు తీరనున్నాయి. కార్మికుల జీవన విధానంలో మార్పులు రానున్నాయి. – జి.అప్పారావు,డిపో కార్యదర్శి, ఈయూ మహిళా సంక్షేమం సాధ్యమౌతుంది సంస్థలో పనిచేసే ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారితే వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మహిళలకు మరింత సంక్షేమ ఫలాలు అందుతాయి జగన్ ప్రకటించిన విలీన విధానం ప్రతి కార్మికుడు స్వాగతించాల్సిందే – ఆర్ఆర్ కుమారి, కండక్టర్ కార్మికులకు బహుళ ప్రయోజనాలు విలీనం జరిగితే కార్మికులకు బహుళ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కార్మికుల డిమాండ్‌ను నెరవేర్చేందుకు జగన్ పాలన రానున్నదనే నమ్మకం కనిపిస్తున్నది. – టీఆర్ బాబు, కార్మికుడు విలీన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం కార్మికులకు ప్రయోజనం కలిగించే అంశం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఇది అందరూ స్వాగతించాల్సిన అంశం. జగన్ తీసుకున్న నిర్ణయం ఎందరో కార్మికుల దశాబ్దాల పోరాటం లక్ష్యం. ఎందరో జీవితాలకు భరోసా. – ఆర్ రాజు, డ్రైవర్ -
బాబోయ్ డ్యూటీనా?
ఖమ్మంమామిళ్లగూడెం: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో పనిచేస్తున్న డ్రైవర్లపై ఇటీవల కాలంలో పనిభారం అధికమవుతోంది. సిబ్బంది కొరతతో అదనంగా విధులు నిర్వహించాల్సి వస్తోందని, అలసిపోతున్నామని, ఒత్తిడితో ఆందోళన చెందుతున్నామని కొందరు ఆవేదన చెబుతున్నారు. ఒక డ్రైవర్చేతనే రెండు మూడు రోజులు డబుల్ డ్యూటీ (డీడీ)ల పేరుతో వరుస డ్యూటీలు చేయించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల తీరుతో అద్దె బస్సుల డ్రైవర్లు వారంపది రోజులు వరుస డ్యూటీలు చేస్తున్నారు. డ్రైవర్లకు విశ్రాంతి తీసుకునే సమయం లేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూ అనారోగ్యం పాలవుతున్నారు. ఖమ్మం రీజియన్‌లో రోడ్డు రవాణా సంస్థకు సిబ్బంది కొరత సమస్య తీవ్రంగా పీడిస్తోంది. డ్రైవర్, కండక్టర్ పోస్టుల ఖాళీలు భర్తీ చేయట్లేదు. రీజియన్‌లో 1117 డ్రైవర్లు విధులు నిర్వహిస్తుండగా 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 1136 కండక్టర్లు విధులు నిర్వహిస్తుండగా, 12 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే..ఇంకా అదనంగానే సిబ్బంది అవసరమవుతారని కార్మిక సంఘాల నాయకులంటు న్నారు. మొత్తం 630 బస్సులకు గాను 600కు పైగా సర్వీసులు నడుస్తున్నాయి. ఈ లెక్క ప్రకా రం 1400 మంది డ్రైవర్లు అవసరం. ఖమ్మం డిపోలో అయితే డ్రైవర్ డ్యూటీ దిగడమే ఆలస్యం గేటువద్ద అధికారులు వారిని అడ్డుకొని అదనపు డ్యూటీ చేస్తే అడిగినప్పుడు సెలవు ఇస్తామని, డీడీ నగదు ఇస్తామని ఆశలు చూపించి డ్రైవర్ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా అదనపు ట్రిప్పులు తిప్పిస్తున్నారు. అనారోగ్యంపాలైన కార్మికుడు సెలవు అడిగితే కుదరదు అంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఓటీలు, డీడీలతో కార్మికులకు విశ్రాంతి అనేది లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికుల్లో అధికశాతంమంది అనారోగ్యాలపాలై ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందనేది బహిరంగ రహస్యమే. అధికారుల అవగాహన లేమి.. రీజియన్ పరిధిలోని డిపోల్లో పని చేస్తున్న ఉన్నతాధికారులకు రూట్లపై సరైన అవగాహన లేకపోవడంతో కార్మికుల పట్ల శాపంగా మారింది. పలు రూట్లలో కిలోమీటర్లు పెంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు. రోడ్లు బాగాలేకపోయినా సమయం తగ్గించి, కిలోమీటర్లు పెంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఖమ్మం నుంచి రాజమండ్రి, సూర్యాపేట, కోదాడ రూట్లలో తిరగే బసుల సమయం తగ్గించారు. రాజమండ్రి రోడ్డు బాగాలేకపోయినా గతంలో ఉన్న ప్రయాణ సమయం తగ్గించడంతో సకాలంలో చేరుకునేందుకు డ్రైవర్ ఒత్తిడికి గురవుతున్నాడు. 40 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న కోదాడ ప్రాంగణానికి 1:15 గంటల సమయం మాత్రమే ఇవ్వడంతో..స్టాప్ల వద్ద ప్రయాణికులను ఎక్కించుకుంటూ నిర్ణీత సమయానికి గమ్యస్థానానికి చేరుకునేందుకు అతివేగంగా వెళ్లి ప్రమాదాల బారినపడుతున్నారు. విశ్రాంతి ఎక్కడ ? సంస్థలోని కార్మికులు రాత్రి, పగలు అనే తేడాలేకుండా విధులు నిర్వహిస్తుంటే..వారు విశ్రాంతి తీసుకునేందుకు సరైన వసతులే లేవు. రిజియన్లో ఆరు డిపోలు ఉండగా వాటిలో సగానికి పైగా విశ్రాంతిగదులు లేనివే. డబుల్ డ్యూటీలు చేసే డ్రైవర్లు ఉన్న గంట, రెండు గంటల సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళా కండక్టర్ల పరిస్థితి మరీ దారుణం. వారికైతే రెస్ట్ రూముల్లో కూర్చునేందుకు కుర్చీలు కూడా ఉండవు. నైట్ అవుట్ బస్సుల డ్యూటీ చేసే కార్మికుల ఇబ్బందులైతే అన్నీఇన్నీ కావు. రాత్రి వేళ..గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లపై, పంచాయతీ కార్యాయాల బయట నిద్రిస్తున్నారు. గది సౌకర్యం లేకపోవడంతో విష పురుగుల భయంతో నిద్రలేని రాత్రులను గడపాల్సిన పరిస్థితి పోవట్లేదు. డ్రైవర్లకు శిక్షణే లేదు.. ఆర్టీసీలో పని చేసే డ్రైవర్, కండక్టర్లకు సంస్థ నెలకోమారు డిపోల్లో తరగతులు, 6 నెలలకోసారి రీజియన్ స్థాయిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కానీ..ప్రసతం శిక్షణ తరగతులే లేవు. రెండు సంవత్సరాలుగా డ్రైవర్లకు ట్రైనింగ్ నిలిచిందంటే సంస్థ పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శిక్షణలో ప్రతి కార్మికుడికీ నూతన మెళకువలు నేర్పడంతో పాటు రోడ్డుపై వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తుంటారు. ఇలాంటి తరగతులు లేకపోవడంతో డ్రైవర్లు తమకు ఇస్తున్న బస్సులతో రోడ్లపై ఉన్న ట్రాఫిక్‌ను అధిగమించి పోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
కేసీఆర్ బెదిరింపులకు భయపడం
ఆసిఫాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఉ ద్యోగాలనుంచి తొలగిస్తామని బెదిరింపులకు పా ల్పడటం ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన కు నిదర్శమని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బస్సు డి పోలో నిర్వహించిన గేటు ధర్నాకు ఆయన మద్ద తు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర చాలా క్రియాశీలకమన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆ ర్ 46 రోజులపాటు కార్మికులతో సమ్మె చేయిం చి.. ఇప్పుడు సమ్మె చేస్తే సంస్థను మూసి వేస్తామనడంలో ఆంత్యరం ఏమిటని ప్రశ్నించారు. ప్రభు త్వ విధానాల వల్లనే ఆర్టీసీ నష్టాలబాట పడుతుందని ఆరోపించారు. సంస్థలో పని చేసేది 52 వేల కార్మికుల కోసం కాదని.. నాలుగు కోట్ల ప్రజ ల కోసం పని చేయాలన్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు గురిచేసినా కార్మికుల తమ ఉద్యోగ భద్రత, హక్కుల సాధనకు సమ్మె నిర్వహించి తీరాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కేసీఆర్‌ను గద్దె దింపేంది కార్మికులేనన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్టీసీ ఇచ్చింది కేవలం రూ.508 కోట్లు మాత్రమేనని, సంస్థను వ్యాపార రంగంగా కాకుండా ప్రజల సంక్షేమ రంగంగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేశ్, జేఏసీ నాయకులు ఐలయ్య, సత్యనారాయణ, ఎజాజ్, వసంత్, హన్మంతు, సుధాకర్ పాల్గొన్నారు. -
కార్మికులపై కక్ష సాధింపు సరికాదు : కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు జరుగుతన్న అన్యాయం పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మడిపండ్డారు. గురువారం ప్రగతి భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడారని అలా మాట్లాడటం సరైంది కాదన్నారు. ఆనాడు ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ప్రకటించిన ఆయన ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆరోపించారు. గతంలో మంత్రిగా ఉండి ఆర్టీసీని నష్టాల్లో నుంచి లాభాల్లోకి తెచ్చిన కేసీఆర్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆర్టీసీ ఉద్యోగులను పట్టించుకోక పోవటం ఏంటనీ ప్రశ్నించారు. కేరళ రాష్ట్రంలో ఆర్టీసీకి మూడు వేల కోట్లు, తమిళనాడులో నాలుగు వేల కోట్లుకు పైగా కేటాయిస్తే, మన రాష్ట్రంలో నాలుగేళ్లకు గాను కేవలం 11 వందల కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజల్ పన్ను పై రెండు వేల 690 కోట్లు వసూలు చేస్తోందన్నారు. ఈ పన్నును ఎత్తివేస్తే ఆర్టీసీ లాభల్లోకి వస్తుందని సూచించారు. బస్సు పాస్ రాయితీ, ప్రీడమ్ ఫెటర్స్, జర్నలిస్టులకు రీయంబర్స్మెంట్ చేయడం లేదన్నారు. ఆర్టీసీ నుంచి రోజుకు 12 కోట్లు ఆదాయం వస్తే దానిని తిరిగి రాష్ట్ర సర్కార్‌కు 1.8 టాక్సీ చెలిస్తున్నారు. జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన 300 కోట్లు బకాయిలు తిరిగి ఆర్టీసీకి చెల్లించాలి డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుపై కక్ష సాధింపు చర్యలు మాని, సాధ్యమైనంత తొందరగా పీఆర్సీని పెంచాలని డిమాండ్ చేశారు. రెండు వేల 800 వందల కోట్లు రాష్ట్ర సర్కార్ నిర్ణయాల వల్లే వచ్చింది, కానీ ఆర్టీసీ కార్మికుల వల్ల కాదని చిన్నారెడ్డి తెలిపారు. -
ఆర్టీసీ కార్మికులకు అందని వేతనాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కార్మికుల వేతనాల చెల్లింపుల్లో మరోసారి తీవ్ర జాప్యం జరగడం కలకలం సృష్టిస్తోంది. చేతిలో డబ్బులు లేక, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీ.. సిబ్బందికి వేతనాలివ్వడం కష్టంగా మారింది. కొంతకాలంగా నాలుగైదు రోజులు ఆలస్యంగా కార్మికులకు వేతనాలు చెల్లిస్తోంది. ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందాల్సి ఉన్నా.. గురువారం రాత్రి వరకు కూడా అందకపోవడంతో కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో గుర్తింపు కార్మిక సంఘాలైన తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్లు శుక్రవారం ధర్నాలకు పిలుపునిచ్చాయి. అన్ని బస్ డిపోలు, బస్ భవన్ ఎదుట భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించాలని ఆయా సంఘాల నేతలు అశ్వత్థామరెడ్డి, ధామస్‌రెడ్డి, రాజిరెడ్డి, బాబు, హనుమంతు, సుధాకర్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రంలోగా వేతనాలు అందకుంటే శనివారం నుంచి బస్సులు తిప్పేది లేదని హెచ్చరించారు. కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలని యాజమాన్యాన్ని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బస్సుల నిర్వహణ, ఇతర ఖర్చులకు సరిపడా ఆదాయం లేకపోవడంతో కార్మికుల భవిష్యనిధి నుంచి దాదాపు రూ.500 కోట్లు, పరపతి సహకార సంఘం నుంచి రూ.250 కోట్లు, పదవీ విరమణ బెనిఫిట్, కార్మికులు మృతి చెందితే సాయం ఇచ్చే నిధి నుంచి కూడా ఆర్టీసీ సొంతానికి డబ్బులు వాడుకుంది. వీటిని చెల్లించాలని కార్మిక సంఘాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందకపోవడంతో యాజమాన్యం చేతులెత్తేసింది. గత పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ పూర్తిగా చెల్లించకపోవడంతో ఆగ్రహంగా ఉన్న కార్మికులు.. తాజాగా వేతనాల చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తడంతో మరింత మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలు కోసం రూ.35 కోట్లు విడుదల చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆర్టీసీలో ఉద్యోగులపై వేటు..!
నల్లగొండ :నల్లగొండ రీజియన్‌లో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులపై వేటు పడింది. సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడినందుకు స్టేషన్ మేనేజర్, క్లర్క్‌లను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. దుకాణాల టెండర్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారించినందుకు స్టేషన్ మేనేజర్‌ను, టెండర్ల ద్వారా దుకాణం పొందిన వ్యక్తికి పరోక్ష సహకారం అందించినట్లు క్లర్క్‌పై ఆరోపణలు రావడంతో విజిలెన్స అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో అవకతవకలు రుజువు కావడంతో వారిద్దరిని సస్పెండ్ చేశారు. ఇదే విషయంలో పరోక్షక్ష ప్రమేయం ఉందన్న కారణంతో ఆర్ఎం ఆఫీస్ పీఓకు సీఐగా రివర్షన్ ఇచ్చారు. ఇదే సంఘటనలో మరొ ఇద్దరు అధికారులపైనా చార్జిషీట్ నమోదు చేశారు. వివిధ కారణాలతో నల్లగొండ ఆర్ఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను పొరుగు జిల్లాలకు బదిలీ చేశారు. వీరిలో ఒకరిని సంగారెడ్డి జిల్లా నారాయాణఖేడ్, మరొకరిని వనపర్తి జిల్లాకు బదిలీ చేశారు. నల్లగొండ ఆర్ఎం ఆఫీసులో పనిచేసిన ఉద్యోగిపై ఆరోపణలు రావడంతో గతంలో దేవరకొండకు బదిలీ చేశారు. మళ్లీ సదరు ఉద్యోగిని ఇటీవల దేవరకొండ నుంచి నల్లగొండ ఆర్ఎం ఆఫీస్‌కు బదిలీ చేశారు. ఆరోపణలతో బదిలీ అరుున ఉద్యోగిని మళ్లీ నల్లగొండకు ఎందుకు బదిలీ చేశారన్న దానిపైనా విజిలెన్స అధికారులు విచారణ చేపట్టారు. దీనిపై విజిలెన్స అధికారులు ఆర్ఎం, అధికారులను విచారించినట్లు తెలిసింది. రీజియన్ డిప్యూటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రిటైర్డ్ అధికారిని ఉద్యోగం నుంచి తొలగించారు. వివిధ డిపోల్లో నిర్మించిన మరుగుదొడ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించకుండా అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపైన విచారణ చేసిన విజిలెన్స అధికారులు రీజియన్ డీఈగా ఏళ్ల తరబడి ఇక్కడే పనిచేయడమేగాక రిటైర్డ్ అరుున తర్వాత మళ్లీ అక్కడే కొనసాగడంపై విజిలెన్స అధికారులు సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. అక్రమ పోస్టింగ్‌లు.. మద్యం సేవిస్తూ పట్టుబడిన డ్రైవర్లు, టికెట్ ఇవ్వకుండా నగదు కాజేసిన కండక్టర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడంలో గతంలో ఇక్కడ పనిచేసిన ఆర్ఎంలు అక్రమాలకు పాల్పపడినట్లు ఆర్టీసీ విజిలెన్స డిపార్ట్మెంట్కు ఫిర్యాదులు వవెళ్లారుు. రీజియన్ మొత్తంగా 220 మంది కండక్టర్లు, డ్రైవర్లను సస్పెండ్ చేయగా వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోవడంలో అధికారులు నిబంధనలు అతిక్రమించినట్లు సమాచారం. సాధారణంగా ఆర్టీసీలో సస్పెండ్ అయిన వారిని పనిచేసిన డిపోలో కాకుండా మరొ డిపోకు పోస్టింగ్ ఇస్తారు. కానీ అలాకాకుండా సస్పెండ్‌కు గురైన డిపోల్లోనే డ్రైవర్లు, కండక్టర్లను తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు విజిలెన్స అధికారుల విచారణలో తేలింది. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు నల్లగొండ రీజియన్‌పైనా పూర్తి నిఘా పెట్టారు. గతంలో ఆర్ఎంలుగా పనిచేసి జిల్లా నుంచి వెళ్లిపోరుున అధికారులు ఈ అక్రమాలకు పాల్పడ్డట్లు విజిలెన్స విచారణలో తేలింది. దీంతో ఇటీవల ఆర్ఎం కార్యాలయాన్ని తనిఖీ చేసిన విజిలెన్స అధికారులు కొన్ని కీలక ఫైళ్లను తమ వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది. కార్మిక సంఘాల తిరుగుబాటు... అకారణంగా కార్మికుల అక్రమ బదిలీ, సస్పెండ్ చేశారన్న కారణంతో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ తిరుగుబాటుకు సిద్ధమైంది. సోమవారం అన్ని డిపోల ఎదుట కార్మికులు ఎర్రబ్యాడ్జీలు ధరించి, భోజన విరామ సమయంలో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చినట్లు రీజియన్ కార్యదర్శి బి.నరేందర్ ప్రకటనలో తెలిపారు. అదే రోజున హైదరాబాద్‌లో జోనల్ సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. దీనికి సంబంధించి శనివారం టీఎంయూ ఆధ్వర్యంలో జోనల్ కార్యదర్శి బి.యాదయ్య, రాష్ట్ర కార్యదర్శి బి.పుల్లయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఉద్యోగులపై చర్యలు వాస్తవమే సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారని, ఆర్ఎం ఆఫీస్‌లో పనిచేసిన ఇద్దరిని పొరుగు జిల్లాలకు బదిలీ, పీఓను సీఐ స్థాయికి రివర్షన్, కాంట్రాక్టు డీఈని విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. - మధుసూదన్, డిప్యూటీ సీటీఎం -
పండుగకు పప్పన్నమెట్ల..?
ఆర్టీసీ కార్మికులకు దసరా అడ్వాన్స హుష్‌కాకి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఓవైపు అప్పులు... మరోవైపు నష్టాల బూచి చూపి ఇప్పటికే వారి భవిష్య నిధి (పీఎఫ్), అంతర్గత రుణ నిధి (సీసీఎస్) మొత్తాలను జీతాల కింద చెల్లించిన యాజమాన్యం పండుగపూట పప్పన్నమూ దొరకకుండా మరో షాక్ ఇచ్చింది. అత్యంత ఘనంగా నిర్వహించుకునే దసరా ఖర్చుల కోసం ఏటా యాజమాన్యం ముందస్తుగా చెల్లించే పండుగ అడ్వాన్‌సను ఈసారి ఎగ్గొట్టింది. ఆర్థిక ఇబ్బందుల సాకుతో దసరా అడ్వాన్‌సను ఈసారి చెల్లించలేమని తేల్చి చెప్పింది. ఆగస్టు నెల జీతంతో ఎప్పటిలాగే.. ఈసారి కూడా అడ్వాన్స అందుతుందని ఎదురుచూసిన కార్మికులు ఈ నిర్ణయంతో కంగుతిన్నారు. ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, క్లర్కులు, సూపరింటెండెంట్లకు ఒక్కొక్కరికి రూ.మూడు వేలు చొప్పున, అటెండర్లు, శ్రామిక్‌లకు రెండున్నర వేల చొప్పున ఆర్టీసీ ముందస్తుగా పండుగ అడ్వాన్స చెల్లిస్తుంది. దీన్ని వాయిదాల రూపంలో పది నెలల్లో తిరిగి వసూలు చేసుకుంటుంది. ఈసారి దసరా అడ్వాన్స చెల్లించాలంటే రూ.45 కోట్లు అవసరం. వచ్చే నెలలో జీతాల చెల్లింపే కష్టంగా మారిన తరుణంలో ఈ మొత్తాన్ని కేటాయించడం సాధ్యం కాదని తేల్చిన యాజమాన్యం ఈ నిర్ణయానికొచ్చింది.