
సాక్షి, విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ క్యాబినెట్ ఆమోదించటంపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గురువారం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఈయూ నేతలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పుష్పార్చన చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతం చేసిన జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆర్టీసీలోని ఇతర సమస్యలతో పాటు తమకు దక్కాల్సిన బెనిఫిట్స్‌పై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.