నల్లగొండ :నల్లగొండ రీజియన్‌లో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులపై వేటు పడింది. సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడినందుకు స్టేషన్ మేనేజర్, క్లర్క్‌లను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. దుకాణాల టెండర్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారించినందుకు స్టేషన్ మేనేజర్‌ను, టెండర్ల ద్వారా దుకాణం పొందిన వ్యక్తికి పరోక్ష సహకారం అందించినట్లు క్లర్క్‌పై ఆరోపణలు రావడంతో విజిలెన్‌స అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో అవకతవకలు రుజువు కావడంతో వారిద్దరిని సస్పెండ్ చేశారు. ఇదే విషయంలో పరోక్షక్ష ప్రమేయం ఉందన్న కారణంతో ఆర్‌ఎం ఆఫీస్ పీఓకు సీఐగా రివర్షన్ ఇచ్చారు. ఇదే సంఘటనలో మరొ ఇద్దరు అధికారులపైనా చార్జిషీట్ నమోదు చేశారు. వివిధ కారణాలతో నల్లగొండ ఆర్‌ఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను పొరుగు జిల్లాలకు బదిలీ చేశారు. వీరిలో ఒకరిని సంగారెడ్డి జిల్లా నారాయాణఖేడ్, మరొకరిని వనపర్తి జిల్లాకు బదిలీ చేశారు.
నల్లగొండ ఆర్‌ఎం ఆఫీసులో పనిచేసిన ఉద్యోగిపై ఆరోపణలు రావడంతో గతంలో దేవరకొండకు బదిలీ చేశారు. మళ్లీ సదరు ఉద్యోగిని ఇటీవల దేవరకొండ నుంచి నల్లగొండ ఆర్‌ఎం ఆఫీస్‌కు బదిలీ చేశారు. ఆరోపణలతో బదిలీ అరుున ఉద్యోగిని మళ్లీ నల్లగొండకు ఎందుకు బదిలీ చేశారన్న దానిపైనా విజిలెన్‌స అధికారులు విచారణ చేపట్టారు. దీనిపై విజిలెన్‌స అధికారులు ఆర్‌ఎం, అధికారులను విచారించినట్లు తెలిసింది. రీజియన్ డిప్యూటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రిటైర్డ్ అధికారిని ఉద్యోగం నుంచి తొలగించారు. వివిధ డిపోల్లో నిర్మించిన మరుగుదొడ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించకుండా అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపైన విచారణ చేసిన విజిలెన్‌స అధికారులు రీజియన్ డీఈగా ఏళ్ల తరబడి ఇక్కడే పనిచేయడమేగాక రిటైర్డ్ అరుున తర్వాత మళ్లీ అక్కడే కొనసాగడంపై విజిలెన్‌స అధికారులు సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది.
అక్రమ పోస్టింగ్‌లు..
మద్యం సేవిస్తూ పట్టుబడిన డ్రైవర్లు, టికెట్ ఇవ్వకుండా నగదు కాజేసిన కండక్టర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడంలో గతంలో ఇక్కడ పనిచేసిన ఆర్‌ఎంలు అక్రమాలకు పాల్పపడినట్లు ఆర్టీసీ విజిలెన్‌స డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదులు వవెళ్లారుు. రీజియన్ మొత్తంగా 220 మంది కండక్టర్లు, డ్రైవర్లను సస్పెండ్ చేయగా వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోవడంలో అధికారులు నిబంధనలు అతిక్రమించినట్లు సమాచారం. సాధారణంగా ఆర్టీసీలో సస్పెండ్ అయిన వారిని పనిచేసిన డిపోలో కాకుండా మరొ డిపోకు పోస్టింగ్ ఇస్తారు. కానీ అలాకాకుండా సస్పెండ్‌కు గురైన డిపోల్లోనే డ్రైవర్లు, కండక్టర్లను తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు విజిలెన్‌స అధికారుల విచారణలో తేలింది. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు నల్లగొండ రీజియన్‌పైనా పూర్తి నిఘా పెట్టారు. గతంలో ఆర్‌ఎంలుగా పనిచేసి జిల్లా నుంచి వెళ్లిపోరుున అధికారులు ఈ అక్రమాలకు పాల్పడ్డట్లు విజిలెన్‌స విచారణలో తేలింది. దీంతో ఇటీవల ఆర్‌ఎం కార్యాలయాన్ని తనిఖీ చేసిన విజిలెన్‌స అధికారులు కొన్ని కీలక ఫైళ్లను తమ వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది.
కార్మిక సంఘాల తిరుగుబాటు...
అకారణంగా కార్మికుల అక్రమ బదిలీ, సస్పెండ్ చేశారన్న కారణంతో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ తిరుగుబాటుకు సిద్ధమైంది. సోమవారం అన్ని డిపోల ఎదుట కార్మికులు ఎర్రబ్యాడ్జీలు ధరించి, భోజన విరామ సమయంలో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చినట్లు రీజియన్ కార్యదర్శి బి.నరేందర్ ప్రకటనలో తెలిపారు. అదే రోజున హైదరాబాద్‌లో జోనల్ సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. దీనికి సంబంధించి శనివారం టీఎంయూ ఆధ్వర్యంలో జోనల్ కార్యదర్శి బి.యాదయ్య, రాష్ట్ర కార్యదర్శి బి.పుల్లయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఉద్యోగులపై చర్యలు వాస్తవమే
సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారని, ఆర్‌ఎం ఆఫీస్‌లో పనిచేసిన ఇద్దరిని పొరుగు జిల్లాలకు బదిలీ, పీఓను సీఐ స్థాయికి రివర్షన్, కాంట్రాక్టు డీఈని విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- మధుసూదన్, డిప్యూటీ సీటీఎం
ఆర్టీసీలో ఉద్యోగులపై వేటు..!
Published Sun, Dec 11 2016 3:51 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement