సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టుకుని దాచుకున్న నిధిని ఖాళీ చేసి వారి అవసరాలకు రుణాలు అందకుండా చేసిన ఆర్టీసీ.. విశ్రాంత ఉద్యోగులకూ మనశ్శాంతి లేకుండా చేస్తోంది. పని చేసిన కాలంలో దాచుకున్న ఎర్న్‌డ్ లీవ్స్ (ఈఎల్స్) తాలూకు నగదును చెల్లించట్లేదు. 2,500 మందికి సంబంధించి నగదుగా మార్చుకునే ఈఎల్స్ చెల్లింపులు నిలిపేసింది. మూడేళ్లు గడుస్తున్నా వారికి రావాల్సిన మొత్తాన్ని నిధులు లేవన్న సాకుతో ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆ బకాయిలు రూ.100 కోట్లకు చేరుకున్నాయి. ఇటు జీతం లేక, అటు పింఛన్ వెసులుబాటు లేక, ఈఎ ల్స్ చెల్లింపులూ అందక విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
11 నెలల జీతంతో సమానం..: ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఆర్టీసీ ఉద్యోగులకు 300 ఈఎల్స్‌ను నగదుగా మార్చుకునే వెసులుబాటు ఉంది. రిటైర్ అయ్యాక ఒకేసా రి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. పదవీ విరమ ణ పొందిన నెలలో ఉన్న బేసిక్‌తో పా టు కరువు భత్యం కలిపి దీన్ని చెల్లి స్తారు. ఇది వారి 10 నెలల జీతానికి సమానమ వుతుంది. దీంతోపాటు రిటైర్మెంట్ శాలరీ పేరుతో బోనస్‌గా మరో నెల జీతం ఇస్తారు. మొత్తం 11 నెలల జీతం అందుతుంది. ఇది వారి హోదాలను బట్టి జీతం ఆధారంగా రూ.4 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుంది.
2018 ఏప్రిల్ నుంచి పదవీ విరమణ పొందిన వారికి ఈఎల్స్ చెల్లింపులు ఆపేసింది. అలా 2019 డిసెంబర్ వరకు నిలిచిపోయాయి. ఈ మధ్య కాలంలో దాదాపు రెండున్నర వేల మంది రిటైర్ అయ్యారు. ఆర్టీసీ రెండు సార్లు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంది. గతేడాది రూ.650 కోట్లు, నెలన్నర కింద రూ.500 కోట్లు రుణంగా తెచ్చుకుంది. తొలి అప్పును జీతాల పేరుతో చెల్లించింది. వాటి నుంచి తమకు ఈఎల్స్ మొత్తం విడుదల చేయాలని విశ్రాం త ఉద్యోగులు ఎంతగా అడిగినా వినలేదు.
Comments
Please login to add a commentAdd a comment