retired employess
-
ప్రధాని దృష్టికి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు
సైదాబాద్ (హైదరాబాద్): రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల పెన్షన్ పెంపు.. తదితర అపరిష్కృత సమస్యలను ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి హామీ ఇచ్చారు. గురువారం ఆయన సైదాబాద్‌లోని ఎస్బీహెచ్ ఏ కాలనీ కమ్యూనిటీహాల్లో నిర్వహించిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.రోహిణిరావు, అసోసియేషన్ సభ్యులతో కలసి కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు. గత మూడు దశాబ్దాలుగా బ్యాంక్ ఉద్యోగుల ప్రాథమిక పెన్షన్‌ను సవరించలేదని ఆయన పేర్కొన్నారు. 2002కు ముందు పదవీ విరమణ పొందిన సీనియర్ మేనేజర్లు, టాప్ మేనేజర్లలో చాలామంది రూ. 35 వేల కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారని వివరించారు. పెరిగిన ఖర్చులతో పెద్ద హోదాలోనివారి పరిస్థితే ఇలా ఉంటే తక్కువ క్యాడర్ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని తెలిపారు. కాగా, పెన్షన్ రివిజన్, 100 శాతం డీఏ న్యూట్రలైజేషన్ సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని వారు కోరారు. అసోసియేషన్ వినతులకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
TSRTC: జీతం రాదు.. పింఛన్ లేదు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టుకుని దాచుకున్న నిధిని ఖాళీ చేసి వారి అవసరాలకు రుణాలు అందకుండా చేసిన ఆర్టీసీ.. విశ్రాంత ఉద్యోగులకూ మనశ్శాంతి లేకుండా చేస్తోంది. పని చేసిన కాలంలో దాచుకున్న ఎర్న్డ్ లీవ్స్ (ఈఎల్స్) తాలూకు నగదును చెల్లించట్లేదు. 2,500 మందికి సంబంధించి నగదుగా మార్చుకునే ఈఎల్స్ చెల్లింపులు నిలిపేసింది. మూడేళ్లు గడుస్తున్నా వారికి రావాల్సిన మొత్తాన్ని నిధులు లేవన్న సాకుతో ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆ బకాయిలు రూ.100 కోట్లకు చేరుకున్నాయి. ఇటు జీతం లేక, అటు పింఛన్ వెసులుబాటు లేక, ఈఎ ల్స్ చెల్లింపులూ అందక విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 11 నెలల జీతంతో సమానం..: ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఆర్టీసీ ఉద్యోగులకు 300 ఈఎల్స్‌ను నగదుగా మార్చుకునే వెసులుబాటు ఉంది. రిటైర్ అయ్యాక ఒకేసా రి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. పదవీ విరమ ణ పొందిన నెలలో ఉన్న బేసిక్‌తో పా టు కరువు భత్యం కలిపి దీన్ని చెల్లి స్తారు. ఇది వారి 10 నెలల జీతానికి సమానమ వుతుంది. దీంతోపాటు రిటైర్మెంట్ శాలరీ పేరుతో బోనస్‌గా మరో నెల జీతం ఇస్తారు. మొత్తం 11 నెలల జీతం అందుతుంది. ఇది వారి హోదాలను బట్టి జీతం ఆధారంగా రూ.4 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుంది. 2018 ఏప్రిల్ నుంచి పదవీ విరమణ పొందిన వారికి ఈఎల్స్ చెల్లింపులు ఆపేసింది. అలా 2019 డిసెంబర్ వరకు నిలిచిపోయాయి. ఈ మధ్య కాలంలో దాదాపు రెండున్నర వేల మంది రిటైర్ అయ్యారు. ఆర్టీసీ రెండు సార్లు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంది. గతేడాది రూ.650 కోట్లు, నెలన్నర కింద రూ.500 కోట్లు రుణంగా తెచ్చుకుంది. తొలి అప్పును జీతాల పేరుతో చెల్లించింది. వాటి నుంచి తమకు ఈఎల్స్ మొత్తం విడుదల చేయాలని విశ్రాం త ఉద్యోగులు ఎంతగా అడిగినా వినలేదు. -
‘పెన్షన్ రాజ్యాంగ హక్కు.. కోతకు వీల్లేదు’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌లో 25 శాతం కోత విధించడంపై హై కోర్టులో దాఖలయిన పిటిషన్‌ను సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారించింది. పిటీషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌లో కోత విధించవద్దని పిటీషనర్ కోర్టును కోరారు. పూర్తి పెన్షన్‌ను అందించేలా చూడాలన్నారు. పెన్షన్ రాజ్యాంగ హక్కని.. దీనిలో కోత విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులేదని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెన్షన్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉన్నాయని కోర్టుకు వెల్లడించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు పెన్షన్ అంశంలో ఎలాంటి హక్కులు ఉన్నాయో పూర్తి వివరాలను తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణనను ఈ నెల 17కు వాయిదా వేసింది. వృద్ధాశ్రమాల నిర్వహణపై హై కోర్టు విచారణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధాశ్రమాల్లో ఎలాంటి సదుపాయాలు లేవని న్యాయవాది వసుధ నాగరాజు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. స్వచ్ఛంద సంస్థల ద్వారా వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయని పిటీషనర్ కోర్టుకు విన్నవించారు. నిధులు లేని వృద్ధాశ్రమాల్లో ఒక్కొక్కరి వద్ద నుంచి 60-13 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. వృద్ధాశ్రమాల్లో ఉన్నవారిని చూసుకోవడానికి సరిపడా సిబ్బంది లేరని తెలిపారు. పిటీషనర్ తరపున వాదనలు విన్న కోర్టు రాష్ట్రంలోని వృద్ధాశ్రమాల్లో ఏలాంటి పరిస్థితులు ఉన్నాయో నేరుగా వెళ్లి పరిశీలించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. పిటీషనర్ను తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్స్‌ను సందర్శించాలని తెలిపింది. వాస్తవిక పరిస్థితుల చూసి పూర్తి నివేదిక సమర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వృద్ధాశ్రమాల నిర్వహణ కోసం కావాల్సిన నిధులను కార్పోరేట్ కంపెనీలు, ఎన్జీవోల ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ(సీఎస్ఆర్) కింద సమకూర్చుకోవాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాక తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉన్న వృద్ధాశ్రమాల ఎన్ని.. వాటిలో రిజిస్టర్ అయినవి ఎన్ని, కానివి ఎన్ని ఉన్నాయో తెలపాలన్నది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని సెక్రటరీ సోషల్ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చైల్డ్, అండ్ ఉమెన్ అధికారులును ఆదేశించించిది. తదుపరి విచారణనను ఈ నెల 23కు వాయిదా వేసింది. -
ఆ ఒక్కటీ వదిలేసి మార్గదర్శకాలు!
రేపు విడుదలయ్యే అవకాశం ఉద్యోగుల పంపిణీలో పదవీ విరమణ చేసే వారికి ఆప్షన్ అంశం వారి ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవద్దంటున్న ఏపీ సర్కారు రెండు రాష్ట్రాల సీఎస్‌లతో కమలనాథన్ సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీలో కీలకంగా మారిన.. ‘త్వరలో పదవీ విరమణ చేసే ఉద్యోగుల విషయం’పై స్పష్టతనివ్వకుండానే ముసాయిదా మార్గదర్శకాల విడుదలకు కమలనాథన్ కమిటీ సిద్ధమవుతోంది. రెండేళ్లలోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులు ఇచ్చే ఆప్షన్‌ను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవడాన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ముసాయిదా మార్గదర్శకాల్లో ఈ విషయమై ఎటువంటి నిబంధన ఉంచాలనే అంశంపై తమ అభిప్రాయం తర్వాత చెబుతామని పేర్కొంది. అందువల్ల ఆ అంశాన్ని పక్కన ఉంచి మిగతా అంశాలతో ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేయాల్సిందిగా శనివారం కమలనాథన్ కమిటీని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలనాథన్ ఆదివారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో సమావేశమై సంప్రదింపులు జరిపారు. ఏపీ ప్రభుత్వం పేర్కొన్నట్లుగా పదవీ విరమణ చేసే ఉద్యోగుల ఆప్షన్ అంశాన్ని పక్కన పెట్టి మిగతా అంశాలతో ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేసేందుకు సమ్మతమేనా? అనే అంశంపై తెలంగాణ సీఎస్‌తో కమల నాథన్ చర్చించినట్లు సమాచారం. దీంతో రాజీవ్ శర్మ తమ సీఎం కె. చంద్రశేఖర్‌రావుతో చర్చించిన తరువాత తెలియజేస్తానని పేర్కొన్నట్లు తెలిసింది. అరుుతే కేసీఆర్, సీఎస్ లు సోమవారం జిల్లా కలెక్టర్ల సమావేశంలో బిజీగా ఉండ నున్నందున మంగళవారం గానీ మార్గదర్శకాలు జారీకి వీలుపడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.