హైవేపై డివైడర్‌ను ఢీకొన్న గరుడ బస్సు | APSRTC Garuda accident in anatapuram district | Sakshi
Sakshi News home page

హైవేపై డివైడర్‌ను ఢీకొన్న గరుడ బస్సు

Published Mon, Dec 16 2013 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM

హైవేపై డివైడర్‌ను ఢీకొన్న గరుడ బస్సు

హైవేపై డివైడర్‌ను ఢీకొన్న గరుడ బస్సు

కనగానపల్లి, న్యూస్‌లైన్: అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం దాదులూరు సమీపాన 44వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ వోల్వో (గరుడ ప్లస్) బస్సు అదుపుతప్పి హైవేపై డివైడర్‌ను ఢీకొని రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. బస్సు బోల్తా పడకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సులో  ఉన్న 28 మంది ప్రయాణికులు సురక్షితంగా కిందకు దిగారు.  బస్సు కంప చెట్లలోకి వెళ్లినపుడు డ్రైవర్ జోగిరెడ్డికి గాయాలయ్యాయి. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు పంపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement