garuda bus accident
-
ఆర్టీసీ గరుడ బస్సు బోల్తా
చిల్లకల్లు (జగ్గయ్యపేట): ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్‌ప్లాజాకు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ గరుడ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో విజయవాడకు చెందిన నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఏపీ16 జడ్ 0599 బస్సు విజయవాడ నుంచి మియాపూర్ వెళ్తుండగా టోల్‌ప్లాజా వద్దకు వచ్చే సరికి హెడ్లైట్లలో సమస్య తలెత్తడంతో అదుపు తప్పింది. డ్రైవర్ నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ పక్కకు దూసుకెళ్లి ఓ వైపునకు బోల్తా పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కాపాడండంటూ కేకలు వేశారు. గమనించిన టోల్‌ప్లాజా సిబ్బంది, హైవే పోలీసులు బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడ్డ వారిని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగతా వారిని మరో బస్సు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు పంపించారు. -
గరుడ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
సాక్షి, విజయవాడ : తెలంగాణ ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సుకు పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటన జరిగినప్పుడు బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం అధికారులు వారిని వేరే బస్సులో తరలించారు. కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎలక్ట్రికల్ వైరింగ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'గరుడ'కి తప్పిన ప్రమాదం
-
'గరుడ'కి తప్పిన ప్రమాదం
బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న గరుడ ఆర్టీసీ బస్సు అయిల్ ట్యాంకర్ శుక్రవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ పూర్తగా పగిలిపోయింది. దాంతో ట్యాంకర్‌లోని ఆయిల్ మొత్తం రోడ్డుపైకి వచ్చింది. ఆ ఘటనతో గరుడ బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాంతో ప్రయాణికులు అద్దాలు పగులగొట్టుకుని బస్సులోంచి రోడ్డుపైకి దూకి పరుగులు తీశారు. ఆ ఘటనలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. దాంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. -
హైవేపై డివైడర్‌ను ఢీకొన్న గరుడ బస్సు
కనగానపల్లి, న్యూస్‌లైన్: అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం దాదులూరు సమీపాన 44వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ వోల్వో (గరుడ ప్లస్) బస్సు అదుపుతప్పి హైవేపై డివైడర్‌ను ఢీకొని రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. బస్సు బోల్తా పడకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న 28 మంది ప్రయాణికులు సురక్షితంగా కిందకు దిగారు. బస్సు కంప చెట్లలోకి వెళ్లినపుడు డ్రైవర్ జోగిరెడ్డికి గాయాలయ్యాయి. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు పంపించారు.